ఆరోగ్య రక్ష కార్డుల పంపిణీ పరిశీలన
Published Sat, Aug 6 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
మంగపేట : మంగపేట మండలం బాలన్నగూడెం, లక్ష్మీనర్సాపురం గ్రామాల్లో జరుగుతున్న ఆరోగ్య సంరక్షణ కార్డుల పంపిణీ కార్యక్రమ నిర్వహణను కలెక్టర్ కరుణ శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా వైద్య పరీక్షలకు వచ్చిన ఆయా గ్రామాల ప్రజలతో ఆమె మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సంరక్షణ కార్డులలో వైద్యులు పొందపరుస్తున్న సమాచార వివరాలను ఆమె పరిశీలించారు. వైద్యాధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రధానంగా వర్షాకాలం పూర్తయ్యే వరకు గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వైద్యులను ఆదేశించారు.
రేషన్ కార్డులు ఇప్పించాలి
l కలెక్టర్‌కు బిల్ట్ కార్మికుల వినతి
మండలానికి వచ్చిన కలెక్టర్‌ను బిల్ట్ జేఏసీ నాయకులు వడ్లూరి రాంచందర్, చొక్కారావు, శ్రీనివాస్, కుర్బాన్ అలీ కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. బిల్ట్ కర్మాగారం మూతపడి రెండేళ్లు గడుస్తొందని, 15 నెలలు గడుస్తున్నా కార్మికులకు యాజమాన్యం వేతనాలు చెల్లించక పోవడంతో కార్మికులకు పూటగడవడం కష్టంగా మారిందని, సమస్యపై జేసీఎల్‌తో సమావేశం నిర్వహించేలా చూడాలని వేడుకున్నారు. స్పందిం చిన కలెక్టర్ ప్రభుత్వం బిల్ట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేం దుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ పథకం విషయంపై పరిశీలిస్తామన్నారు.
తల్లి, బిడ్డల ఆరోగ్యం మీ చేతుల్లోనే...
ఏటూరునాగారం : తల్లి, బిడ్డల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని, వారి ఆరోగ్యాన్ని రక్షిస్తే సమాజాన్ని రక్షించి నట్లే అవుతుందని కలెక్టర్ వాకాటి కరుణ అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం మండల కేం ద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తే ఎలాంటి రోగాలు రావన్నారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాల్లో తల్లులు, చిన్నారులు పోషకాహారం లోపంతో ఉన్నారని పరీక్షల్లో తేలిందన్నారు. పోషకాలను అందించే అంగన్‌వాడీ సెంటర్ల పని తీరును మెరుగుపర్చాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలపై ఉందన్నారు. ఖాళీల భర్తీ, ఇతర సమస్యలను అంగన్‌వాడీ కార్యకర్తలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వలియాబీ, సర్పంచ్ ఇర్సవడ్ల ఝాన్సీరాణి, ఎంపీటీసీలు కొప్పుల అనిత, నర్సింగరావు, ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ఆర్డీఓ మహేందర్‌జీ, ఐసీడీఎస్ పీడీ శైలజ, సీడీపీఓలు రాజ మణి, మల్లేశ్వరి, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement