Women Cricketer Pranavi Chandra Visit Tirumala Tirupati - Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారి సేవలో మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర

Published Mon, Feb 27 2023 4:38 PM | Last Updated on Mon, Feb 27 2023 5:11 PM

Cricketer Pranavi Chandra Visit Tirumala Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కోచ్‌ చాముండేశ్వరినాథ్‌తోతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.‌ దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు.

అదే విధంగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కాగా హైదరాబాద్‌ క్రికెట్‌ టీమ్‌కు ఆడుతున్న ప్రణవి చంద్ర మాట్లాడుతూ.. టీ20 క్రికెట్‌ లీగ్‌ల ద్వారా కొత్త వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయన్నారు. ప్రతిభ నిరూపించుకుంటే.. అంతర్జాతీయ క్రికెటర్‌టగా ఎదగడానికి ఉపయోగపడుతుందని ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌గా రాణిస్తున్న ప్రణవి చంద్ర పేర్కొన్నారు.

చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్‌ బ్యాటర్‌ వల్లేనన్న ఆజం ఖాన్‌! ‘స్కై’తో నీకు పోలికేంటి?
NZ Vs Eng: మరీ ఇలా కూడా అవుట్‌ అవుతారా? వాళ్లు అంతలా కష్టపడితే.. నీకేమో ఇంత బద్ధకమా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement