Pranavi
-
ODI: ప్రణవి అద్భుత ఇన్నింగ్స్.. బెంగాల్‌పై హైదరాబాద్ గెలుపు
BCCI Women's Senior One Day Trophy 2024- న్యూఢిల్లీ: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు విజయంతో బోణీ చేసింది. బెంగాల్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ 24 పరుగుల తేడాతో గెలిచింది. ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 225 పరుగులు సాధించింది. ప్రణవి చంద్ర (88 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. రాణించిన త్రిష అదే విధంగా గొంగడి త్రిష 31 పరుగులతో రాణించింది. ఎం.మమత 21, వీఎమ్ కావ్య 29 పరుగులు సాధించారు. వీరి బాధ్యతాయుత ఇన్నింగ్స్ కారణంగా హైదరాబాద్ జట్టు 225 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 201 పరుగులకు బెంగాల్ ఆలౌట్ ఇక బెంగాల్ బౌలర్లలో ధరా గుజ్జార్ ఐదు వికెట్లు(5/27) దక్కించుకోగా.. సస్తి మొండల్ రెండు (2/25) వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో.. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ 49.3 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ధరా గుజ్జర్ 21, సస్తి మొండల్ 23 పరుగులు చేయగా.. కశిష్ అగర్వాల్ 62 పరుగులతో బెంగాల్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో గౌహర్ సుల్తానా, బి. శ్రావణి చెరో రెండు వికెట్లు తీసి చెప్పుకోగదగ్గ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కాగా తొలి మ్యాచ్‌లోనే బెంగాల్ వంటి పటిష్ట జట్టుపై గెలుపొందడం హైదరాబాద్ మహిళా జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. చదవండి: ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్ -
11 ఏళ్లకే బాలనటిగా ఎంట్రీ.. సీరియల్స్ నుంచి సినిమాలవైపు..
బాలనటిగా మెప్పించి నటిగా మారిన మరో తెలుగు టాలెంట్.. ప్రణవి మానుకొండ. ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో మొదలైన ఆమె జర్నీ.. సీరియల్స్‌తో సాగి సినిమాకు చేరుకుంది. ఆ వివరాలు.. ► హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన ప్రణవి.. పదకొండేళ్ల వయసులో బాలనటిగా వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ► ‘రొటీన్ లవ్‌స్టోరీ’, ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాల్లో చిన్నప్పటి హీరోయిన్గా కనిపించి బాగా ఫేమస్ అయింది. ► చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇటు సినిమాల్లోనూ, అటు సీరియల్స్‌లోనూ బిజీగా ఉండేది. ‘పసుపు కుంకుమ’, ‘సూర్యవంశం’, ‘ఎవరే నువ్వు మోహినీ’, ‘గంగ మంగ’ లాంటి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ► సోషల్ మీడియాలోనూ టిక్ టాక్ వీడియోలు, రీల్స్ చేస్తూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ► ఆమధ్య సింగర్ నోయల్‌తో కలసి ‘హస్లర్ (Hustler)’ అనే వీడియో సాంగ్‌లో నటించింది. ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల మీద చేసిన వీడియో సాంగ్ ఇది. బాగా వైరలై సోషల్ మీడియాలో ప్రణవి క్రేజ్ మరింత పెరిగింది. ► ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ప్రణవి. సీరియల్స్ షెడ్యూల్స్ వల్ల సినిమాలు చేయలేదు. ఇక నుంచి మాత్రం నా దృష్టి అంతా వెండితెర మీదే! – ప్రణవి మానుకొండ View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) చదవండి: అన్నింటిలో టాప్.. కానీ కుటుంబం వల్ల ఆత్మహత్యకు యత్నించిన హీరోయిన్ -
మన హద్దుల్లో ఉంటే అడ్డే ఉండదు: శ్రీలీల
‘‘చిత్ర పరిశ్రమ అనేది గౌరవం ఉన్న ఇండస్ట్రీ. మన హద్దుల్లో మనం ఉండి సినిమాలు చేసుకుంటే అడ్డేదీ ఉండదు.. ఎలాంటి ఇబ్బందులు రావు. తెలుగమ్మాయి అయిన హీరోయిన్ ప్రణవికి నేను ఇచ్చే సలహా ఇదే’’ అని హీరోయిన్ శ్రీలీల అన్నారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలీల మాట్లాడుతూ– ‘‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ సినిమా సూపర్ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘మా సినిమాలో వినోదం, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు ఏఆర్ శ్రీధర్. ‘‘శ్రీలీల, వైష్ణవీ చైతన్య, ప్రణవి తెలుగు అమ్మాయిలే. నా కొత్త సినిమాకు తెలుగు అమ్మాయినే హీరోయిన్గా తీసుకుంటా’’ అన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ‘‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ హిట్ అయితే మరో పదిమంది కొత్తవాళ్లకు అవకాశాలు ఇస్తాం’’ అన్నారు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి. -
Slumdog Husband Movie: ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టని ఇంటర్వ్యూ
-
అద్దం ముందు డైలాగ్స్ చెప్పేదాన్ని
‘‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ కథ కొత్తగా ఉంటుంది. ఇందులో నేను చేసిన మౌనిక పాత్ర కూడా కొత్తగా ఉంటుంది’’ అన్నారు ప్రణవి మానుకొండ. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఈ నెల 29న రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా ప్రణవి మాట్లాడుతూ– ‘‘నాకు చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం. బాల నటిగా మంచి ఆఫర్లు వచ్చాయి. అనుష్కగారి ‘అరుంధతి’ సినిమా డైలాగ్స్‌ను అద్దం ముందు నిలబడి చెప్పేదాన్ని. ‘రొటీన్ లవ్ స్టోరీ, ఉయ్యాలా జంపాలా, అమిగోస్’ సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. సీరియల్స్‌లోనూ లీడ్‌గా చేశాను. హీరోయిన్గా ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ఫస్ట్ మూవీ. నేను తెలుగమ్మాయిని కావడం ప్లస్‌గా భావిస్తున్నా. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పటికీ నా ఫోకస్ సినిమాలపైనే’’ అన్నారు. -
గ్లామర్‌తో కవ్విస్తోన్న కేతిక శర్మ.. దసరా బ్యూటీ కీర్తి సురేశ్ అందాలు!
►ఎల్లో డ్రెస్‌లో దసరా బ్యూటీ కీర్తి సురేశ్ అందాలు ►బోల్డ్ లుక్స్‌తో కవ్విస్తోన్న కేతిక శర్మ ►నాజూకు అందాలతో రెచ్చగొడుతోన్న ప్రణవి మానుకొండ ►గ్లామర్ లుక్‌తో అదరగొడుతున్న శోభితా రానా ►కలర్‌ఫుల్ డ్రెస్సులతో బుట్టబొమ్మ పూజా హేగ్డే హోయలు View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. రిలయ¯Œ ్స ఎంటర్ౖటెన్మెంట్ సంస్థ ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తోంది. ‘‘మ్యారేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కొత్త పాయింట్‌ను ఈ సినిమాలో చర్చించబోతున్నాం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది. సినిమా హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు నటించిన ఈ సినిమాకు సహ–నిర్మాతలు: చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
చందమామలా మెరిసిపోతున్న నటి ప్రణవి మానుకొండ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర
సాక్షి, తిరుపతి: మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కోచ్ చాముండేశ్వరినాథ్‌తోతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. అదే విధంగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కాగా హైదరాబాద్ క్రికెట్ టీమ్‌కు ఆడుతున్న ప్రణవి చంద్ర మాట్లాడుతూ.. టీ20 క్రికెట్ లీగ్‌ల ద్వారా కొత్త వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయన్నారు. ప్రతిభ నిరూపించుకుంటే.. అంతర్జాతీయ క్రికెటర్‌టగా ఎదగడానికి ఉపయోగపడుతుందని ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్‌గా రాణిస్తున్న ప్రణవి చంద్ర పేర్కొన్నారు. చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్ బ్యాటర్ వల్లేనన్న ఆజం ఖాన్! ‘స్కై’తో నీకు పోలికేంటి? NZ Vs Eng: మరీ ఇలా కూడా అవుట్ అవుతారా? వాళ్లు అంతలా కష్టపడితే.. నీకేమో ఇంత బద్ధకమా? -
హైదరాబాద్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్, గోల్ఫర్ ట్వెసాకు 15 లక్షల చెక్
Kakinada Sea Ports Limited Sponsorship: హైదరాబాద్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ ప్రణవిచంద్ర, గోల్ఫర్ ట్వెసా మలిక్‌లకు స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు కాకినాడ సీపోర్ట్ సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ కార్యదర్శి విభా జైన్ ఈ ఇద్దరు క్రీడాకారిణులకు చెరో రూ. 15 లక్షల చెక్‌లు అందించగా... తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు భారీ షాక్.. భారత్- విండీస్ తొలి వన్డే వాయిదా! -
అందాల ముద్దుగుమ్మ ప్రణవి గ్లామర్ ఫోటోలు
-
‘పెళ్లెప్పుడు’ అని అడుగుతుంటారు..
బాలనటిగా సినిమాల్లోకి ఎంటర్ అయిన ప్రణవి సీరియల్ నటిగా పేరుతెచ్చుకుంటోంది. ‘గంగ మంగ’ సీరియల్లో గంగ గా తెలుగింటి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అచ్చతెనుగు అమ్మాయిగా పదోతరగతితోనే ‘బుల్లితెర’ంగేట్రమ్ చేసిన ప్రణవి చెబుతున్న ముచ్చట్లివి. ‘‘మాది తాడేపల్లి గూడెం. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. శాస్త్రీయ నృత్యం కూచిపూడితో పాటు వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. చిన్నప్పుడు ఢీ, ఆట.. ప్రోగ్రామ్‌ల్లోనూ పాల్గొన్నాను. ఆ ఇష్టం వెండితెరకు బాలనటిగా పరిచయం చేసింది. సినిమాల్లో ఉయ్యాల జంపాల, సీరియల్స్‌లో పసుపు కుంకుమ, భార్యామణిలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఎవరేమోహినిలో హీరోయిన్గా చేశాను. గంగ మంగ సీరియల్‌కి ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు గంగ పాత్రకు నన్ను ఎంపిక చేశారు. దృశ్యం సినిమాలోని చిన్నపాపకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా మారాను.’’– నిర్మలారెడ్డి మా అక్కే నా టీచర్! నేనిప్పుడు ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్నాను. బాలనటిగానే ఈ రంగంలోకి వచ్చాను. షూటింగ్స్ లేని రోజుల్లో చదువుకుంటాను. మా అక్క డిగ్రీ చేస్తోంది. తనే నా సబ్జెక్ట్స్ అన్నీ చెబుతుంటుంది. అక్కతో... లొకేషన్ ఎట్ ఫన్! కాన్సెప్ట్ ఏదైనా డైరెక్టర్ చెప్పగానే అలా ఒక్కసారి ఊహించుకొని చేసేస్తాను. యూనిట్లో అంతా నన్ను మెచ్చుకుంటారు. కాకపోతే ఎక్కడా ఖాళీ ఉండను. లొకేషన్ ఎప్పుడూ ఫన్‌గా ఉంటుంది. అల్లరి బాగా చేస్తానని నాకు పేరు(నవ్వుతూ). ఖాళీ దొరికితే లొకేషన్లోనే కాసేపు చదువుకోవడం లేదంటే టిక్‌టాక్ వీడియోలతో హడావిడి చేస్తుంటాను. నా ఫ్యామిలీ నా బలం ఇంట్లో నన్ను ముద్దుగా ‘గంగమ్మ’ అని పిలుస్తుంటారు. నేనీ రంగంలోకి రావడానికి మా నాన్న శ్రీనివాసమూర్తి కారణం. ఏ సన్నివేశంలో ఎలా యాక్ట్ చేయాలో చెబుతుంటారు. అమ్మ రత్నవల్లి నా క్యాస్ట్యూమ్స్ అన్నీ తనే చూసుకుంటుంది. అక్క నా చదువు చూసుకుంటుంది. బామ్మలు నేను ఎదగాలని కోరుకుంటారు. నా ఫ్యామిలీ నా బలం. మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా ముందున్న కల. సీరియల్లో ఓ దృశ్యం సీరియల్లో గంగ! ‘గంగమంగ సీరియల్లో గంగ మొదట్లో ఏమీ తెలియని అమాయకురాలు. ఇప్పుడు మంగ ఆస్తికోసం చేసే కుట్రలను తిప్పి కొడుతుంటుంది. అమ్మమ్మతో చనువుగా ఉంటుంది. ఆమె చెప్పింది వేదంలా పాటిస్తుంది. నిజ జీవితంలోనూ అంతే అమ్మమ్మ, నాన్నమ్మలు చెప్పింది బుద్ధిగా వింటాను. వాళ్లకీ నన్ను నటిగా చూడటమే ఇష్టం. నటిగా బాగా ఎదగాలని కోరుకుంటారు. స్నేహితులు కలిస్తే! మా ఫ్రెండ్స్ ఇప్పుడు కలిస్తే చాలు నన్ను ‘పెళ్లెప్పుడు’ అని సరదాగా అడుగుతుంటారు. సీరియల్లో పెళ్లి సందర్భం సన్నివేశాలు చెప్పి ఆటపట్టిస్తుంటారు. చిన్నదాన్నైనా సీరియల్లో పెద్దదానిగా కనిపిస్తుంటాను. అప్పుడు మా అమ్మ కూడా నవ్వుతూ వాళ్లకి సమాధానమిస్తుంది. -
ప్రేమ.. వినోదం
శ్రీనివాసరావు, ప్రణవి జంటగా డి.ఎస్. రావ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. సుష్మా ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా సత్యేశ్వరి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకుడు రమణ సాకే క్లాప్ ఇచ్చారు. సత్యేశ్వరి మాట్లాడుతూ– ‘‘లవ్, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్.. అన్నీ కలగలిసిన మంచి కథ కుదిరింది. కథకు తగ్గట్టు నటీనటులను ఎంపిక చేస్తున్నాం. ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. గోదావరి పరిసరాల్లో షూటింగ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ధీధీరజ్, సంగీతం: రమణ సాకే. -
సిన్సియర్ ప్రేమ
‘‘శీనుగాడి ప్రేమ’ సినిమా పాటలు, టీజర్ బాగున్నాయి. నటీనటులు కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా నటించారు. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఆర్.కేని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీనివాసరావు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘శీనుగాడి ప్రేమ’. ‘సిన్సియర్ రా మామా’ అన్నది ట్యాగ్ లైన్. ప్రణవి, కావేరి, చాందిని కథానాయికలు. రమణ సాకే స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నేను డైలాగ్స్ చెప్పే విధానం చూసిన డైరెక్టర్ హీరోగా నటించమన్నారు. కథ కూడా బాగుండటంతో నటించి, నేనే నిర్మించాను’’ అన్నారు. ‘‘శీను పేరున్న వారికి కనెక్టయ్యే కథాంశంతో ఈ సినిమా చేశాం. లవ్, కామెడీ, ఎమోషన్.. ఇలా ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలుంటాయి’’ అన్నారు ఆర్.కె. -
సిన్సియర్ రా మామా
శ్రీనివాసరావు, ప్రణవి, కావేరి, చాందినీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘శీనుగాడి ప్రేమ’. ‘సిన్సియర్ రా మామా’ అన్నది ఉపశీర్షిక. ఆర్.కె.డి. దర్శకత్వంలో సుష్మా ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై ధరిమిశెట్టి సత్యేశ్వరి నిర్మించిన ఈ సినిమా డబ్బింగ్ జరుపుకుంటోంది. నిర్మాత సత్యేశ్వరి మాట్లాడుతూ– ‘‘లవ్, సెంటిమెంట్, యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. వినోదానికీ పెద్దపీట వేశాం. ఆర్.కె.డి. చెప్పిన కథను తెరపై చక్కగా ఆవిష్కరించారు. హైదరాబాద్, అరకు, వైజాగ్, కాణిపాకం, తిరుపతి, చెన్నైలోని అందమైన ప్రదేశాల్లో ఐదు పాటలు చిత్రీకరించాం. త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అన్నివర్గాల ప్రేక్షకులను మా చిత్రం ఆకట్టుకుని, విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. రాంపల్లి వెంకటరమణ, రమ్య, భవాని తదితరులు నటించిన ఈ చిత్రా నికి కెమెరా: సతీష్, సంగీతం: రమణ. -
రెండు ఆటోలు ఢీ: చిన్నారి మృతి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం దుబ్బాక రహదారిపై మంగళవారం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన మూడేళ్ల చిన్నారి ప్రణవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మంగళవారం దుబ్బాక రహదారిపై వేగంతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ఆటోను అదుపు తప్పి ఢీకొట్టింది. ఆ ఆటోలో తల్లిదండ్రులతో ప్రయాణిస్తున్న ప్రణవి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... ప్రణవిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూనిరాగాలే సినీగానాలయ్యాయి
పిఠాపురం : సరదాగా తీసిన కూని రాగాలే తన కెరీర్‌ను మలుపు తిప్పి సినీగానాలుగా మారాయని యువ గాయని టి.ప్రణవి తెలిపారు. ఆదివారం ఆమె పిఠాపురం పాదగయక్షేత్రంలో శ్రీకుక్కుటేశ్వరస్వామిని, శ్రీపురుహూతికా అమ్మవారిని, శ్రీరాజరాజేశ్వరిదేవిని, దత్తాత్రేయస్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు ఆమెను ఆశీర్వదించగా అధికారులు ప్రసాదాలందజేశారు. ఆమె శ్రీరాజరాజేశ్వరిదేవిపై ‘శృతి నీవు గతి నీవు’ గీతాన్ని ఆలపించారు. ఆమె వెంట తండ్రి టి.విజయకుమార్, ఉంగరాల వెంకటేశ్వరరావు, ఎలుబండి ప్రభు తదితరులున్నారు. ఆ సందర్భంగా ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ. సాక్షి: మీ కుటుంబ నేపథ్యం? ప్రణవి: స్వస్థలం ముమ్మిడివరం దగ్గర కొత్తలంక. కొంత కాలం కాకినాడలో ఉన్నాం. మా అమ్మ వైణికురాలు, నాన్న రచయిత. దూరదర్శన్‌లో పని చేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సాక్షి: సంగీతం పట్ల ఆసక్తి ఎలా కలిగింది? ప్రణవి: సంగీతంలో బీఏ చేశాను. కుటుంబానికి ఉన్న సంగీత నేపథ్యంలో చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల ఆసక్తి ఉండేది. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్నా గాయని అవుతానని ఊహించలేదు. సాక్షి: సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ప్రణవి: వైజే బాలసుబ్రహ్మణ్యం, హేమావతి, రామాచారిల వద్ద. సాక్షి: తొలుత పాటలు పాడే అవకాశం ఎలా వచ్చింది? ప్రణవి: ఖాళీగా ఉన్నప్పుడు కూనిరాగాలు తీయడం అలవాటు. హైదరాబాద్‌లో ఒక సినిమా ఫంక్షన్లో కూనిరాగాలు తీస్తుంటే దర్శకుడు ఆదిత్య విని సంగీత దర్శకుడు కళ్యాణ్మాలిక్కు పరిచయం చేశారు. ఆయన కొన్ని పాత పాటలు పాడించి, ‘ఆంధ్రుడు’లో రెండు పాటలు పాడించారు. అలా అనుకోకుండా సినీరంగంలో అడుగుపెట్టాను. ఇప్పుడు సినిమాల్లో, సూపర్‌సింగర్స్, స్వరాభిషేకం కార్యక్రమాల్లో పాటలు పాడుతున్నాను. సాక్షి: మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? ప్రణవి: ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి, చక్రి, వందేమాతరం శ్రీనివాస్, కోటి తదితరులు ఎంతో ప్రోత్సహించారు. ‘శ్రీరామదాసు’లో ‘శుద్ధబ్రహ్మ’ పాట పాడించి సినీరంగంలో నిలదొక్కుకునేలా చేశారు కీరవాణి. సాక్షి: ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు, పేరు తెచ్చిన పాటలు? ప్రణవి: 150 సినిమా పాటలు పాడాను. ‘యమదొంగ’లో ‘రబ్బరుగాజులు’ పాటతో పాటు ‘పాండురంగడు, హ్యాపీడేస్’ సినిమాల్లో పాటలు మంచిపేరు తెచ్చిపెట్టాయి. సాక్షి: కొత్తగా పాడిన పాటలు? ప్రణవి: ‘అలా ఎలా, ఈ వర్షం సాక్షిగా, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమాలతో పాటు ఇంకా పేరు పెట్టని పలు సినిమాలకు పాడాను. సాక్షి: ఏమైనా అవార్డులు సాధించారా? ప్రణవి: ఇప్పటి వరకు రెండు నంది అవార్డులు పొందాను. చిన్నచిన్న అవార్డులు చాలా వచ్చాయి. సాక్షి: ఇంకే కళలోనైనా ప్రావీణ్యం ఉందా? ప్రణవి: కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యం ఉంది. విదేశాలలోనూ సంగీత, నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. పాటలు పాడాను. -
నా పాట విని లతాజీ చాలా మెచ్చుకున్నారు!
చిరు ప్రాయంలోనే స్వర ప్రయాణం మొదలుపెట్టి దశాబ్ద కాలంగా తన గానంతో శ్రోతల్ని తన్మయానికి గురిచేస్తున్నారు ప్రణవి. గాయనిగా, అనువాద కళాకారిణిగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తున్న ప్రణవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రణవితో ‘సాక్షి’ ప్రత్యేక సంభాషణ. ప్రస్తుతం ఏ ఏ సినిమాలకు పాడుతున్నారు? ముందే చెప్పేయకూడదు. ఎందుకంటే... విడుదలయ్యేంత వరకూ మేం పాడిన పాట అందులో ఉంటుందో లేదో చెప్పలేం. పరిస్థితులను బట్టి ఏమైనా జరగొచ్చు. అందుకే.. మంచి సినిమాలకే పాడుతున్నాను అని మాత్రం చెప్పగలను. ఇలాంటివి కూడా జరుగుతాయా? అంటే... ఇక్కడ ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. ఒకసారి రికార్డ్ చేసిన పాటను ఆల్బమ్ నుంచి తప్పించడానికి ఎన్నో కారణాలుంటాయి. సరే... గాయనిగా మీకు దక్కిన గొప్ప ప్రశంస? నేటి జనరేషన్లో ప్రణవి పాటంటే నాకిష్టం అని ఓ సందర్భంలో కీరవాణి అన్నారు. అలాగే... చిత్రగారు కూడా నా పాటను పలు సందర్భాల్లో మెచ్చుకున్నారు. అక్కినేని జాతీయ అవార్డు అందుకోవడానికి లతా మంగేష్కర్‌గారు ఇక్కడకు వచ్చినపుడు, ఆమె ముందు పాడే అవకాశం నాకు వచ్చింది. నా పాట విని లతాజీ ‘బహుత్ అచ్చాహై’ అని మెచ్చుకున్నారు. అసలు గానం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి? మా అమ్మ వీణ వాయిస్తారు. పాటలు రాస్తారు, కంపోజ్ చేస్తారు, పాడతారు. నాకు స్వరజ్ఞానం అమ్మ నుంచే అబ్బింది. నాన్న తెలుగు టీచర్. అలాగే... మంచి కళాకారుడు కూడా. బాపుగారి వద్ద కూడా పనిచేశారు. వీరిద్దరే నా తొలి గురువులు. నాలోని స్వరజ్ఞానం గమనించి... వారే నాకు సంగీతం నేర్పించారు. తొలి అవకాశం ఎలా వచ్చింది? నేను తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుని. ఇప్పటికి మూడొందల సినిమాల పైచిలుకు డబ్బింగ్ చెప్పాను. సినిమాల్లో చైల్డ్ కారెక్టర్లకు చెప్పేదాన్ని. ‘అతడు’ సినిమాలో త్రిష ఫ్రెండ్ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. ‘నేను పార్దూ.. నీ పద్దూని’ అనే డైలాగ్ నేను చెప్పిందే. చిన్న డైలాగే అయినా... అది చాలా పాపులర్. అలాగే కళంకిత, అంతరంగాలు, శివలీలలు తదితర సీరియల్స్‌లో కూడా కొన్ని పాత్రలకు డబ్బింగ్ చెప్పాను. కెమెరామేన్ సంతోష్‌శివన్‌గారు హిందీ, తెలుగు భాషల్లో తీసిన ‘హలో’ సినిమా తెలుగు వెర్షన్‌కి తొలిసారి పాడాను. అప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నా. ఆ తర్వాత దర్శకుడు వీఎన్ ఆదిత్యగారి ద్వారా కల్యాణ్‌మాలిక్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా ‘ఆంధ్రుడు’ సినిమాలో ఓ శ్లోకం పాడాను. పేరు తెచ్చిన పాటలు? ‘ఛత్రపతి’ సినిమా కోసం నాతో హమ్మింగ్స్ పాడిం చారు ఎం.ఎం.కీరవాణి. ఆ తర్వాత ఆయనే... ‘శ్రీరామదాసు’ సినిమా కోసం ‘శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా...’ పాట ట్రాక్ పాడించారు. ఆ పాట శ్రేయాఘోషల్ పాడాలి. కానీ నా పాట నచ్చి ఉంచేశారు. నాకు మంచి పేరు తెచ్చిన పాట అది. ఇంకా ‘యమదొంగ’లోని ‘రబ్బరు గాజులు’, ‘యంగ్ యమ’, ‘నువ్వు ముట్టుకుంటేనే’ పాటలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. కీరవాణిగారు నాకందించిన ప్రోత్సాహం నిజంగా చాలా గొప్పది. మరి ఆర్టిస్టుగా ఎందుకు ప్రయత్నించలేదు? చిన్నప్పుడు ‘హిట్లర్’ సినిమాలో నటించాను. కొన్ని ప్రైవేటు యాడ్స్‌లో కూడా చేశాను. అయితే.. మా ఇంట్లో ఎవరికీ నటనపై ఆసక్తి లేదు. అందుకే అటువైపు చూడలేదు. ఇంతకూ మీ పెళ్లెప్పుడు? దానికి టైమ్ ఉంది. అమ్మానాన్న చూపించిన అబ్బాయితోనే తాళి కట్టించుకుంటా.