బాలనటిగా మెప్పించి నటిగా మారిన మరో తెలుగు టాలెంట్.. ప్రణవి మానుకొండ. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో మొదలైన ఆమె జర్నీ.. సీరియల్స్‌తో సాగి సినిమాకు చేరుకుంది. ఆ వివరాలు..
► హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన ప్రణవి.. పదకొండేళ్ల వయసులో బాలనటిగా వెండితెర ఎంట్రీ ఇచ్చింది.
► ‘రొటీన్ లవ్‌స్టోరీ’, ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాల్లో చిన్నప్పటి హీరోయిన్‌గా కనిపించి బాగా ఫేమస్ అయింది.
► చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇటు సినిమాల్లోనూ, అటు సీరియల్స్‌లోనూ బిజీగా ఉండేది. ‘పసుపు కుంకుమ’, ‘సూర్యవంశం’, ‘ఎవరే నువ్వు మోహినీ’, ‘గంగ మంగ’ లాంటి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
► సోషల్ మీడియాలోనూ టిక్ టాక్ వీడియోలు, రీల్స్ చేస్తూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది.
► ఆమధ్య సింగర్ నోయల్‌తో కలసి ‘హస్లర్ (Hustler)’ అనే వీడియో సాంగ్‌లో నటించింది. ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల మీద చేసిన వీడియో సాంగ్ ఇది. బాగా వైరలై సోషల్ మీడియాలో ప్రణవి క్రేజ్ మరింత పెరిగింది.
► ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ప్రణవి.
సీరియల్స్ షెడ్యూల్స్ వల్ల సినిమాలు చేయలేదు. ఇక నుంచి మాత్రం నా దృష్టి అంతా వెండితెర మీదే!
– ప్రణవి మానుకొండ
చదవండి: అన్నింటిలో టాప్.. కానీ కుటుంబం వల్ల ఆత్మహత్యకు యత్నించిన హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment