రెండు ఆటోలు ఢీ: చిన్నారి మృతి | pranavi injured in road accident | Sakshi
Sakshi News home page

రెండు ఆటోలు ఢీ: చిన్నారి మృతి

Published Tue, Feb 23 2016 5:05 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

pranavi injured in road accident

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం దుబ్బాక రహదారిపై మంగళవారం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన మూడేళ్ల చిన్నారి ప్రణవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మంగళవారం దుబ్బాక రహదారిపై వేగంతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ఆటోను అదుపు తప్పి ఢీకొట్టింది. ఆ ఆటోలో తల్లిదండ్రులతో ప్రయాణిస్తున్న ప్రణవి తీవ్రంగా గాయపడింది.

స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... ప్రణవిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement