
శ్రీనివాసరావు, ప్రణవి
శ్రీనివాసరావు, ప్రణవి జంటగా డి.ఎస్. రావ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. సుష్మా ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా సత్యేశ్వరి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకుడు రమణ సాకే క్లాప్ ఇచ్చారు. సత్యేశ్వరి మాట్లాడుతూ– ‘‘లవ్, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్.. అన్నీ కలగలిసిన మంచి కథ కుదిరింది. కథకు తగ్గట్టు నటీనటులను ఎంపిక చేస్తున్నాం. ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. గోదావరి పరిసరాల్లో షూటింగ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ధీధీరజ్, సంగీతం: రమణ సాకే.
Comments
Please login to add a commentAdd a comment