
‘‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ కథ కొత్తగా ఉంటుంది. ఇందులో నేను చేసిన మౌనిక పాత్ర కూడా కొత్తగా ఉంటుంది’’ అన్నారు ప్రణవి మానుకొండ. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ ఈ నెల 29న రిలీజ్ చేస్తోంది.
ఈ సందర్భంగా ప్రణవి మాట్లాడుతూ– ‘‘నాకు చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం. బాల నటిగా మంచి ఆఫర్లు వచ్చాయి. అనుష్కగారి ‘అరుంధతి’ సినిమా డైలాగ్స్‌ను అద్దం ముందు నిలబడి చెప్పేదాన్ని. ‘రొటీన్ లవ్ స్టోరీ, ఉయ్యాలా జంపాలా, అమిగోస్’ సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. సీరియల్స్‌లోనూ లీడ్‌గా చేశాను. హీరోయిన్‌గా ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ఫస్ట్ మూవీ. నేను తెలుగమ్మాయిని కావడం ప్లస్‌గా భావిస్తున్నా. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పటికీ నా ఫోకస్ సినిమాలపైనే’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment