Senior Actor Brahmaji Interesting Comments About Slum Dog Husband Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

ఆర్జీవీకి కథ చెబితే ‘కుక్క మొగుడు’ అని టైటిల్‌ పెట్టాడు : బ్రహ్మాజీ

Published Thu, Jul 27 2023 5:31 PM | Last Updated on Thu, Jul 27 2023 6:00 PM

Senior Actor Brahmaji Talk About Slum Dog Husband Movie - Sakshi

‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ స్టోరీని రామ్‌ గోపాల్‌వర్మకు వినిపించి టైటిల్‌ అడిగితే ‘కుక్క మొగుడు’అయితే బాగా సెట్‌ అవుతుందని చెప్పారు. కానీ మా నిర్మాత మాత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్ అని పెడితేనే బాగుంటుందని ఆ టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఈ సినిమా కథ, కథనం రెండూ కొత్తగా ఉంటాయి. ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’అని సీనియర్‌ నటుడు బ్రహ్మాజీ అన్నారు. బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావు హీరోగా నటించిన చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’. ప్రణవి మానుకొండ హీరోయిన్‌. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన బ్రహ్మాజీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా షూటింగ్ టైంలోనే నిర్మాత అప్పి రెడ్డి ఈ కథ, కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఓ కొత్త దర్శకుడు కథ చెప్పాడు విని, సలహా చెప్పండి అని అన్నారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బాగుందని చెప్పాను. ఇందులో లాయర్ పాత్రను మీరే అనుకుంటున్నామని అప్పుడు చెప్పారు. మరి హీరో ఎవరు అని అడిగితే.. ఇంకా డిసైడ్ కాలేదని అన్నారు. ఆ తరువాత ఓ నెలకు మా అబ్బాయిని అడగమని అన్నారు. సంజయ్‌కి స్టోరీ చెబితే నచ్చింది. అలా సినిమా స్టార్ట్ చేశాం.

సంజయ్ డాగ్ లవర్ అవ్వడంతో కాన్సెప్ట్‌కు ఈజీగా కనెక్ట్ అయ్యాడు. పైగా ఇది చాలా కొత్త కాన్సెప్ట్. మొన్న ఓ సారి పుష్ప పార్ట్ 2 షూటింగ్‌లో ఉన్నాను. రాత్రి పూట షూటింగ్ జరుగుతోంది. బన్నీ ఆ ట్రైలర్‌ను చూసి నా దగ్గరకు వచ్చి ప్రశంసించాడు. ట్రైలర్ నిజంగా బాగుందని అన్నాడు. టీం అందరికీ చెప్పి చూపించాడు.

మామూలుగా నేను కొత్తగా చేసే పాత్రలు రావు. ఎందుకంటే రకరకాల పాత్రలు చేసి ఉన్నాను. కానీ ఇందులో మాత్రం నిజంగానే ఓ కొత్త కారెక్టర్ దొరికింది. ఓల్డ్ సిటీలో ఉండే లాయర్. ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడే ఓ కారెక్టర్. విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా ఇందులో కనిపిస్తాను.

► సప్తగిరి నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమాలో మా ఇద్దరి సీన్లు పోటాపోటీగా ఉంటాయి. సప్తగిరి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఇందులో జడ్జిగా ఫిష్ వెంకట్ కనిపించడం హైలెట్‌గా నిలుస్తుంది.

► జూలై 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. అదే టైంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని జూలై 29న ఫిక్స్ అయ్యాం.

► భీమ్స్ అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారు. ఆయన ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నారు. మా సినిమాకు మంచి మాస్, మెలోడీ పాటలు ఇచ్చారు. మ్యూజికల్ హిట్ అవుతుంది.

► సుకుమార్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తాను అని అన్నారు. కానీ అర్జెంట్‌గా అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. రాలేకపోతోన్నాను.. వీడియో బైట్ పంపిస్తాను అని మెసెజ్ పెట్టారు. ఆయన ఇక్కడ ఉండుంటే.. కచ్చితంగా వచ్చేవారు.

► ప్రస్తుతం మహేశ్‌ బాబు గుంటూరు కారం,  ప్రభాస్ సలార్, బాలయ్య గారి భగవంత్ కేసరి, ఊరి పేరు భైరవకోన, నాగ శౌర్యతో ఓ సినిమా చేస్తున్నాను. ప్రభాస్ సలార్ సినిమాలో కొత్త కారెక్టర్ వేస్తున్నాను. రెండో పార్ట్‌లోనే ఎక్కువగా కనిపిస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement