ప్రణవి చంద్ర- గొంగడి త్రిష (ఫైల్ ఫొటోలు)
BCCI Women's Senior One Day Trophy 2024- న్యూఢిల్లీ: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు విజయంతో బోణీ చేసింది. బెంగాల్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ 24 పరుగుల తేడాతో గెలిచింది.
ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 225 పరుగులు సాధించింది. ప్రణవి చంద్ర (88 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది.
రాణించిన త్రిష
అదే విధంగా గొంగడి త్రిష 31 పరుగులతో రాణించింది. ఎం.మమత 21, వీఎమ్ కావ్య 29 పరుగులు సాధించారు. వీరి బాధ్యతాయుత ఇన్నింగ్స్ కారణంగా హైదరాబాద్ జట్టు 225 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
201 పరుగులకు బెంగాల్ ఆలౌట్
ఇక బెంగాల్ బౌలర్లలో ధరా గుజ్జార్ ఐదు వికెట్లు(5/27) దక్కించుకోగా.. సస్తి మొండల్ రెండు (2/25) వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో.. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ 49.3 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.
ధరా గుజ్జర్ 21, సస్తి మొండల్ 23 పరుగులు చేయగా.. కశిష్ అగర్వాల్ 62 పరుగులతో బెంగాల్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో గౌహర్ సుల్తానా, బి. శ్రావణి చెరో రెండు వికెట్లు తీసి చెప్పుకోగదగ్గ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కాగా తొలి మ్యాచ్‌లోనే బెంగాల్ వంటి పటిష్ట జట్టుపై గెలుపొందడం హైదరాబాద్ మహిళా జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు.
చదవండి: ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment