Chamundeswaranath
-
తిరుమల శ్రీవారి సేవలో మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర
సాక్షి, తిరుపతి: మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కోచ్ చాముండేశ్వరినాథ్‌తోతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. అదే విధంగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కాగా హైదరాబాద్ క్రికెట్ టీమ్‌కు ఆడుతున్న ప్రణవి చంద్ర మాట్లాడుతూ.. టీ20 క్రికెట్ లీగ్‌ల ద్వారా కొత్త వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయన్నారు. ప్రతిభ నిరూపించుకుంటే.. అంతర్జాతీయ క్రికెటర్‌టగా ఎదగడానికి ఉపయోగపడుతుందని ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్‌గా రాణిస్తున్న ప్రణవి చంద్ర పేర్కొన్నారు. చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్ బ్యాటర్ వల్లేనన్న ఆజం ఖాన్! ‘స్కై’తో నీకు పోలికేంటి? NZ Vs Eng: మరీ ఇలా కూడా అవుట్ అవుతారా? వాళ్లు అంతలా కష్టపడితే.. నీకేమో ఇంత బద్ధకమా? -
Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు బహుమతిగా కారు
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌కు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రోత్సాహక బహుమతిగా కారును ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేతుల మీదుగా దీనిని అందజేశారు. కాగా తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 52 కేజీల ఫ్లయ్ వెయిట్ విభాగంలో ఆమె జగజ్జేతగా నిలిచింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ఫైనల్లో థాయ్‌లాండ్ బాక్సర్ జిత్‌పాంగ్ జుతమాస్‌తో జరిగిన టైటిల్ పోరులో 5–0తో గెలుపొంది ‘స్వర్ణ’ చరిత్ర లిఖించింది. యావత్ భారతావని పులకించేలా ‘పసిడి పంచ్’తో మెరిసింది. చదవండి 👇 IPL 2022 Prize Money: ఐపీఎల్ ‘విజేతలు’.. ఎవరెవరి ప్రైజ్‌మనీ ఎంతంటే! IPL 2022 Final - Hardik Pandya: శెభాష్.. సీజన్ ఆరంభానికి ముందు సవాళ్లు.. ఇప్పుడు కెప్టెన్‌గా అరుదైన రికార్డు! -
హెచ్‌డీబీఏ అధ్యక్షుడిగా చాముండేశ్వరీనాథ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం (హెచ్‌డీబీఏ) నూతన అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ ఎన్నికయ్యారు. సోమ వారం జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వి. చాముండేశ్వరీనాథ్‌ను అధ్యక్షునిగా, కె. పాణిరావును కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ ఉపాధ్యక్షులుగా దగ్గుబాటి సురేశ్‌బాబు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస రెడ్డి, కె. నాగవేణి, సోమరాజు, ఆదినారాయణ నియమితులయ్యారు. వీరితో పాటు కోశాధికారిగా కె. వంశీధర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా జి. విజయ రాఘవన్, సంయుక్త కార్యదర్శులుగా డి. నివేదిత, సి. రమేశ్‌బాబు, పీవీ శారదా రెడ్డి ఎన్నికయ్యారు. జె. శారద గోవర్ధిని, బంగారు బాబు, బీవీ పద్మారెడ్డి, బి. రాజగోపాలాచారి, సిద్ధార్థ్‌రెడ్డి, అహ్మద్ ఖాద్రి ఇతర సభ్యులుగా ఉంటారు. ఈ కార్యవర్గం 2022 వరకు అధికారంలో ఉంటుంది. -
మిథాలీకి బీఎండబ్ల్యూ..
హైదరాబాద్: మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్ మిథాలీ రాజ్‌కు, మాజీ రంజీ క్రికెటర్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరీ నాథ్ బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందజేయనున్నారు. మిథాలీరాజ్ గొప్ప క్రికెటర్.. తన ఆటతో మహిళలు క్రికెట్ ఎంచుకునేలా ప్రభావితం చేసిందని ఆయన ఓ ఇంగ్లీష్ పత్రికకు తెలిపారు. మిథాలీ నాయకత్వం అద్భుతమని, మహిళా క్రికెట్‌ను ముందుండి నడిపిస్తుందన్నారు. టోర్నీలో భారత మహిళలు అద్భుత ప్రదర్శన కనబరిచారని ప్రశంసించిన చాముండేశ్వరి.. మహిళా క్రికెటర్లను ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతో ఉందని అభ్రిపాయపడ్డారు. ఈ విజయాలు అమ్మాయిలను క్రికెట్ వైపు మొగ్గేలా చేసిందని తెలిపారు. మిథాలీకి 2007లో చెవర్లే కారు బహుమతిగా అందించిన చాముండేశ్వరి తాజాగా ఆమె మహిళా వన్డే క్రికెట్లో ప్రపంచ రికార్డు సాధించడంతో బీఎండబ్ల్యూ కారు ఇవ్వనున్నారు. రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్‌లకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు కానుకగా అందించిన విషయం తెలిసిందే.