మిథాలీకి బీఎండబ్ల్యూ..
హైదరాబాద్: మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్ మిథాలీ రాజ్‌కు, మాజీ రంజీ క్రికెటర్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరీ నాథ్ బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందజేయనున్నారు. మిథాలీరాజ్ గొప్ప క్రికెటర్.. తన ఆటతో మహిళలు క్రికెట్ ఎంచుకునేలా ప్రభావితం చేసిందని ఆయన ఓ ఇంగ్లీష్ పత్రికకు తెలిపారు. మిథాలీ నాయకత్వం అద్భుతమని, మహిళా క్రికెట్‌ను ముందుండి నడిపిస్తుందన్నారు.
టోర్నీలో భారత మహిళలు అద్భుత ప్రదర్శన కనబరిచారని ప్రశంసించిన చాముండేశ్వరి.. మహిళా క్రికెటర్లను ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతో ఉందని అభ్రిపాయపడ్డారు. ఈ విజయాలు అమ్మాయిలను క్రికెట్ వైపు మొగ్గేలా చేసిందని తెలిపారు. మిథాలీకి 2007లో చెవర్లే కారు బహుమతిగా అందించిన చాముండేశ్వరి తాజాగా ఆమె మహిళా వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సాధించడంతో బీఎండబ్ల్యూ కారు ఇవ్వనున్నారు. రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్‌లకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు కానుకగా అందించిన విషయం తెలిసిందే.