
న్యూఢిల్లీ: హర్యానాలోని జీంద్ జిల్లాకు చెందిన బీజేపీ మహిళా నేత రేఖా గుప్తా ఈరోజు (ఫిబ్రవరి 20) ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో రేఖ గుప్తా (Rekha Gupta) పేరును ముఖ్యమంత్రి పదవికి ఖరారు చేశారని తెలియగానే హర్యానా బీజేపీ మాజీ అధ్యక్షులు ఓంప్రకాష్ ధన్కర్ (Om Prakash Dhankar) ఆమెకు 501 రూపాయలు ఇచ్చారు. దీనిని చూసినవారంతా ఆనందంతో ఆశ్చర్యపోయారు.
హర్యానాలో ఏదైనా శుభకార్యం ప్రారంభించేముందు కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఓం ప్రకాష్ 501 రూపాయలను.. రేఖా గుప్తా ముఖ్యమంత్రి కాబోతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆమెకు ఇచ్చారు. ఓంప్రకాష్ ధన్కర్ ఢిల్లీ సీఎం (Delhi CM) ఎంపికలో పర్యవేక్షకునిగా వ్యవహరించారు.
రేఖా గుప్తాకు రూ. 501 ఇచ్చిన తరువాత ఓంప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ రేఖా మా హర్యానా (Haryana) ఆడపడుచు అని అన్నారు. 1974లో జన్మించిన రేఖా గుప్తా తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. ఆమె గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.
తొలిసారి పోటీ చేసినప్పుడు ఆమె 11,000 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. తరువాత రేఖాగుప్తా ఆప్ అభ్యర్థి వందన చేతిలో 4,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇప్పుడు రేఖా గుప్తా తన ప్రత్యర్థి వందనను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుండి పోటీకి దిగిన ఆప్ అభ్యర్థి వందనకు 38,605 ఓట్లు వచ్చాయి. రేఖా గుప్తాకు 68,200 ఓట్లు దక్కాయి.
ఇది కూడా చదవండి: Delhi: సుష్మా, కేజ్రీ, రేఖ.. హర్యానాతో లింకేంటి?
Comments
Please login to add a commentAdd a comment