dhankar
-
బర్త్‌డే నాడు గొర్రెలతో ధర్నా.. గవర్నర్ మనస్తాపం
కలకత్తా: పశ్చిమ బెంగాల్లో మళ్లీ వాతావరణం వేడెక్కింది. నారద స్టింగ్ ఆపరేషన్‌లో ఇద్దరు మంత్రులు ఓ ఎమ్మెల్యే, ఓ నాయకుడిని సీబీఐ అరెస్ట్ చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తీరుపై తీరొక్క నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గురువారం ఆయన జన్మదినం రోజు కూడా నిరసన ప్రదర్శనలు చేయడంతో ఆయన మనస్తాపం చెందారు. తాజాగా గవర్నర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు రాజ్‌భవన్ ఎదుట గొర్రెలతో నిరసన వ్యక్తం చేశారు. గొర్రెలను తీసుకొచ్చి రాజ్‌భవన్ ఉత్తర ద్వారం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. కొద్దిసేపు అనంతరం భద్రతా సిబ్బంది గొర్రెలను వెళ్లగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను గవర్నర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఘటనపై గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న, ఈరోజు పరిస్థితి ఆందోళనగా మారిందని గవర్నర్ తెలిపారు. కలకత్తా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం రెచ్చగట్టే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. నిన్న ఒకరు గవర్నర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే కూడా పోలీసులు ఏం చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ లేఖ విడుదల చేశారు. And on this stance @KolkataPolice (laughable one) is that the man was keen to have photo with Raj Bhawan background. No action whatsoever taken. pic.twitter.com/95mmLGghSC — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 19, 2021 State of law and order @MamataOfficial even at the main entry gate of Raj Bhawan worrisome with stance police @KolkataPolice leaving all to be desired. And all this when the area is subject to 144 CrPC prohibitory orders. Constrained to seek an update on it. pic.twitter.com/HIiD7bTf67 — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 19, 2021 -
నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
న్యూఢిల్లీ: కేంద్రం నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతోపాటు ఉత్తరప్రదేశ్, బిహార్ గవర్నర్లకు స్థానచలనం కలిగించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా మాజీ ఎంపీ, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది జగ్దీప్ ధంకర్(68)ను నియమిస్తూ శనివారం రాష్ట్రపతి భవన్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. వచ్చే వారం పదవీ విరమణ చేయనున్న కేసరీనాథ్ త్రిపాఠీ స్థానంలో ధంకర్ బాధ్యతలు చేపడతారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. బెంగాల్లో రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ, మమతా బెనర్జీల మధ్య పోరు కొనసాగుతున్న సమయంలో ఈ నియామకం చేపట్టడం గమనార్హం. ధంకర్ 1990–91 సంవత్సరాల మధ్య పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. 2003లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే, 2018 జనవరి నుంచి మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆనందీబెన్ పటేల్‌ను కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమించింది. ఆనందీ బెన్ స్థానంలో బీజేపీ కురువృద్ధ నేత, బిహార్ గవర్నర్ లాల్జీ టాండన్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. టాండన్ స్థానంలో బిహార్ గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత ఫగు చౌహాన్ బాధ్యతలు చేపడతారని ఆ సర్క్యులర్ వెల్లడించింది. త్రిపుర గవర్నర్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత రమేశ్ బైస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి పదవీ కాలం 27న ముగియనుంది. నాగాలాండ్ గవర్నర్‌గా ఇంటెలిజెన్స్ బ్యూరో రిటైర్డు స్పెషల్ డైరెక్టర్ ఎన్.రవి నియమితులయ్యారు. 1976 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రవి నాగా వేర్పాటువాదులతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు. వీరు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ తెలిపింది. 1950లో యూపీ ఏర్పడిన తర్వాత మొదటి మహిళా గవర్నర్ ఆనందీబెన్. అంతకుముందు ఉన్న యునైటెడ్ ప్రావిన్సుకు 1947లో సరోజినీ నాయుడు గవర్నర్‌గా నియమితులయ్యారు. -
ఆ రైతులు క్రిమినల్స్, పిరికివాళ్లు..
హర్యానా: రైతుల ఆత్మహత్యలపై హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు పిరికివాళ్లు, క్రిమినల్స్ అని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. అలాంటివారికి తాము ఎందుకు సాయం చేస్తామని మంత్రి ఓపీ ధన్కర్ ప్రశ్నించారు. భారతీయ చట్టాల ప్రకారం ఆత్మహత్యలు చేసుకోవటం నేరమని ధన్కర్ అన్నారు. చట్టాన్ని అతిక్రమించి ప్రాణాలు తీసుకునేవారు చట్టప్రకారం నేరస్తులేనని, అటువంటి వారికి ప్రభుత్వం సాయం చేయదని ఆయన పేర్కొన్నారు. పిరికివాళ్లే ఆత్మహత్యలు చేసుకుంటారని, తమ బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి ఆత్మహత్యలను చేసుకుంటున్నారని ధన్కర్ విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకూడదన్నారు. కాగా ఓ వైపు రైతుల ఆత్మహత్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతుంటే...మరోవైపు మంత్రి అనాలోచిత వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.