
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం (హెచ్‌డీబీఏ) నూతన అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ ఎన్నికయ్యారు. సోమ వారం జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వి. చాముండేశ్వరీనాథ్‌ను అధ్యక్షునిగా, కె. పాణిరావును కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సీనియర్ ఉపాధ్యక్షులుగా దగ్గుబాటి సురేశ్‌బాబు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస రెడ్డి, కె. నాగవేణి, సోమరాజు, ఆదినారాయణ నియమితులయ్యారు. వీరితో పాటు కోశాధికారిగా కె. వంశీధర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా జి. విజయ రాఘవన్, సంయుక్త కార్యదర్శులుగా డి. నివేదిత, సి. రమేశ్‌బాబు, పీవీ శారదా రెడ్డి ఎన్నికయ్యారు. జె. శారద గోవర్ధిని, బంగారు బాబు, బీవీ పద్మారెడ్డి, బి. రాజగోపాలాచారి, సిద్ధార్థ్‌రెడ్డి, అహ్మద్ ఖాద్రి ఇతర సభ్యులుగా ఉంటారు. ఈ కార్యవర్గం 2022 వరకు అధికారంలో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment