తిరుపతిలోని హథీరాంజీ మఠం భూములను ఇష్టారాజ్యంగా కబ్జాచేశారు. గత ఐదేళ్ల కాలంలో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు పప్పూబెల్లంలా పంచుకుతినేశారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అడ్డదారుల్లో రిజిస్ట్రేషన్లు చేసి జేబులు నింపుకునేశారు. సర్వే నం.13లోనే 110 ఎకరాలకు సంబంధించి సుమారు 602 అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై కూలంకుషంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
సాక్షి, తిరుపతి : తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలో వందలాది ఎకరాలు హథీరాంజీ మఠం భూములు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు హథీరాంజీ మఠం భూములపై దృష్టి సారించారు. ఆ భూములను ఐదుగురు వ్యక్తులు కలిసి పంచుకునేశారు. ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టారు. కొనుగోలుదారులు రిజి స్ట్రేషన్ స్థలాలు కావాలని అడగడంతో అక్రమార్కులు సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో కొందరిని సంప్రదించారు. అక్రమార్కులకు రిజిస్టార్ కార్యాలయంలోని కొందరు అధికారులు తోడవడంతో విక్రయాలు సులభతరమయ్యాయి.
అడ్డదారిలో రిజిస్ట్రేషన్
చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని అడ్డదిడ్డంగా మఠం భూములను రిజిస్ట్రేషన్ చేసి అమ్మి సొమ్ముచేసుకోవడం ప్రారంభించారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. 2014వ సంవత్సరం నుంచి 2019 మధ్య కాలంలో తిరుపతి రూరల్ పరిధిలోని సర్వే నంబర్ 13, 14, 15, 17, 18లోని 275 ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఒకే ఒక్క సర్వే నెంబర్ 13లో మాత్రమే 110 ఎకరాలకు సంబంధించి 602 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో తేలింది. మిగిలిన సర్వే నంబర్లలో మరో 165 ఎకరాలకు సంబంధించి 500 వరకు రిజిస్ట్రేషన్లు చేపినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే అడ్డదారిలో 1,102 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు.
చేతులు మారిన కోట్ల రూపాయలు
మఠం భూముల క్రయవిక్రయాల్లో టీడీపీ నాయకులు, అప్పటి రెవెన్యూ, సబ్ రిజిస్టార్ కార్యాలయంలోని కొందరు, ట్రాన్స్‌కోలో పనిచేసే మరికొందరు కుమ్ముక్కై కోట్ల రూపాయలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని శ్రీవారి కైంకర్యాల కోసం కేటాయించిన మఠం భూములను ఇష్టానుసారంగా అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఈ అక్రమాలు అధికం కావడంతో ఇటీవల రెవెన్యూ, పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన తాత్కాలిక గృహాలను తొలగించినట్లు తెలుస్తోంది. అమ్మి సొమ్ముచేసుకున్న వారు మాత్రం పరారీలో ఉంటే.. అక్రమార్కుల ధన దాహానికి అప్పులుచేసి కొనుగోలు చేసుకున్న సామాన్యులు మాత్రం బలయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారించి.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారినుంచి డబ్బులు వసూళ్లు చేసి స్థలాలు కొనుగోలుచేసి మోసపోయిన సామాన్యులకు తిరిగి ఇప్పించమని కోరుతున్నారు.
చేసుకుని అడ్డదిడ్డంగా మఠం భూములను రిజిస్ట్రేషన్ చేసి అమ్మి సొమ్ము చేసుకోవడం ప్రారంభిం చారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. 2014వ సంవత్సరం నుంచి 2019 మధ్య కాలం లో తిరుపతి రూరల్ పరిధిలోని సర్వే నంబర్ 13, 14, 15, 17, 18లోని 275 ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఒకే ఒక్క సర్వే నెంబర్ 13లో మాత్రమే 110 ఎకరాలకు సంబంధించి 602 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో తేలింది. మిగిలిన సర్వే నంబర్లలో మరో 165 ఎకరాలకు సంబంధించి 500 వరకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే అడ్డదారిలో 1,102 రిజిస్ట్రేషన్లు జరిగి నట్లు గుర్తించారు.
చేతులు మారిన కోట్ల రూపాయలు
మఠం భూముల క్రయవిక్రయాల్లో టీడీపీ నాయకులు, అప్పటి రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు, ట్రాన్స్‌కోలో పనిచేసే మరికొందరు కుమ్మక్కై కోట్ల రూపాయలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని శ్రీవారి కైంకర్యాల కోసం కేటాయించిన మఠం భూములను ఇష్టానుసారంగా అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఈ అక్రమాలు అధికం కావడంతో ఇటీవల రెవెన్యూ, పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన తాత్కాలిక గృహాలను తొలగించినట్లు తెలుస్తోంది. అమ్మి సొమ్ము చేసుకున్న వారు మాత్రం పరారీలో ఉంటే అక్రమార్కుల ధన దాహానికి అప్పులుచేసి కొనుగోలు చేసుకున్న సామాన్యులు మాత్రం బలయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారినుంచి డబ్బులు వసూలు చేసి స్థలాలు కొనుగోలు చేసి మోసపోయిన సామాన్యులకు తిరిగి ఇప్పించమని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment