26, 27న తిరుపతిలో అంతర్జాతీయ విద్యాసదస్సు
Published Tue, Aug 23 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : తిరుపతిలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 26, 27వ తేదీల్లో అంతర్జాతీయ ఆంగ్ల విద్యాసదస్సు నిర్వహించనున్నట్లు ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) జిల్లా అధ్యక్షుడు నాగం రఘురాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ఆంగ్ల విద్యావేత్తలు పాల్గొని ‘ఆంగ్లభాష, సాహిత్య బోధన–ఆధునిక పోకడ’పై చర్చిస్తారన్నారు. ఆసక్తిగల ఉపాధ్యాయులు ఇందులో పాల్గొనవచ్చన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement