
దేశ ప్రధాని నరేంద్ర మోదీ 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడం నుంచి తాము స్ఫూర్తి పొంది మిల్లెట్స్ నేషనల్ పోర్టల్(డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.మిల్లెట్ న్యూస్ డాట్‌కామ్) ఏర్పాటు చేశామని, దీనిని నగరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సి.తారా సత్యవతి అధికారికంగా ప్రారంభించారని పోర్టల్ నిర్వాహకులు బిజినెస్ మెంటర్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ శ్రీనివాస్ సరకదం తెలిపారు. ఏకకాలంలో 100 మిల్లెట్ స్టోర్లను నగరం వేదికగా ప్రారంభించిన సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ తమ కార్యక్రమం వివరాలను ఇలా వెల్లడించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
ఆరోగ్య అవగాహన కోసం..
చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఏ రకమైన ప్రయోజనాన్ని అందిస్తాయి? ఏ వ్యాధులను దూరం చేస్తాయి? తదితర విషయాలు తెలియజేసేందుకు హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంబాసిడర్స్(హెచ్‌ఎన్‌ఏ) కౌన్సిల్‌ను స్థాపించాం.. ఇది ప్రస్తుతం 50 మంది వైద్యులను కలిగి ఉంది. ఈ సంవత్సరాంతానికి వెయ్యి మంది సభ్యులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కౌన్సిల్ మిల్లెట్ స్టోర్ యజమానులతో కలిసి పని చేస్తుంది. సహకారంలో భాగంగా.. మిల్లెట్ స్టోర్ యజమానులు పోషకాహార నిపుణులు వైద్యుల నుంచి నిరంతర మార్గదర్శకత్వాన్ని అందుకుంటారు. అలాగే.. స్టోర్ యజమానులకు అవసరమైన శిక్షణ, మద్దతు నిరంతరం అందిస్తాం. బీపీ, డయాబెటిస్, బీఎమ్‌ఐ అసెస్‌మెంట్‌లను కవర్ చేసే బేసిక్ హెల్త్ చెకప్ ట్రైనింగ్ సెషన్‌లను శనివారం నిర్వహించాం. ఈ సెషన్‌లను పోషకాహార నిపుణుడు ఓ.మనోజ ప్రకృతి వైద్యురాలు డాక్టర్ మోనికా స్రవంతి సారథ్యం వహించారు.
కొత్త చిరుధాన్యాల గుర్తింపు..
దేశంలోని 50 అధిక–నాణ్యత గల మిల్లెట్ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టాం. ఇవి ఇప్పుడు కొత్తగా ప్రారంభించబడిన స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటాయి. పెద్దగా పెట్టుబడి పెట్టలేని వారు సైతం వ్యాపారులుగా మారడానికి వీలుగా, మిల్లెట్ స్టోర్ ఏర్పాటుకు ప్రారంభ పెట్టుబడిని తగ్గించగలిగాం. తమ వ్యాపారాన్ని కనీస పెట్టుబడి రూ.85 వేలతోనే ప్రారంభించవచ్చు. ఇందులో 50 మిల్లెట్ ఉత్పత్తులు, బిల్లింగ్ మెషిన్, ఆరోగ్య అవగాహన కంటెంట్‌ను ప్రదర్శించడానికి టీవీ సెటప్, బ్యానర్లు, బ్రోచర్లు, వెబ్‌సైట్, హెల్త్ చెకప్ కిట్ బ్రాండింగ్ మెటీరియల్ సైతం అందిస్తాం.
100 మిల్లెట్ స్టోర్ల ప్రారంభం..
తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పిన 100 మిల్లెట్ స్టోర్లను మాదాపూర్‌లోని మినర్వా హోటల్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి వర్ధమాన తారలు వేది్వక, వాన్యా అగర్వాల్‌లు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మహిళా ఔత్సాహిక వ్యాపారులు 100 మంది పాల్గొన్నారు. మిల్లెట్ పోర్టల్‌తో కలిసి పనిచేస్తున్న వైద్యులు, రైతులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కొత్త మిల్లెట్ ఉత్పత్తులను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment