పోలీసు జాగిలాన్ని ఎత్తుకెళ్లారు! | police dog snatched by unknown persons | Sakshi
Sakshi News home page

పోలీసు జాగిలాన్ని ఎత్తుకెళ్లారు!

Published Thu, Jan 7 2016 8:28 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

పోలీసు జాగిలాన్ని ఎత్తుకెళ్లారు! - Sakshi

పోలీసు జాగిలాన్ని ఎత్తుకెళ్లారు!

చెన్నై, సాక్షి ప్రతినిధి: దొంగలను పట్టుకునేందుకు అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చిన ఓ పోలీసు జాగిలాన్ని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. తాంబరం రైల్వేపోలీస్ ఇన్‌స్పెక్టర్ శేఖర్ మేలుజాతి కుక్కకు భారతి అని పేరు పెట్టుకుని పెంచుకుంటున్నారు. విధి నిర్వహణలో ఎక్కడికి వెళ్లినా దీన్ని వెంటపెట్టుకుని దర్యాప్తు చేయడం ఆయనకు అలవాటు. రాత్రి గస్తీల్లో ఆ జాగిలం సేవలను తప్పకుండా ఉపయోగిస్తుంటారు. తాంబరం రైల్వేస్టేషన్లోని సిబ్బందికి ఆ జాగిలం బాగా అలవాటు.

రైల్వే ప్లాట్‌ఫాంపైకి బిచ్చగాళ్లు వచ్చినా, మందుబాబులు సంచరించినా తరిమివేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఈనెల ఒకటో తేదీన భారతిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లారు. అంత తొందరగా ఎవరికీ లొంగని ఈ జాగిలాన్ని కొత్తవాళ్లు పట్టుకెళ్లడం వీలు కాదని.. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. భారతి కనిపించకపోవడంతో ఇన్‌స్పెక్టర్ శేఖర్‌తో పాటు రైల్వే పోలీసులు కూడా బాగా డల్ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement