ఎక్కడ ఖననం చేశారో కూడా తెలియదు.. | viral video Two mens dragged down the dog in Chennai | Sakshi
Sakshi News home page

ఎక్కడ ఖననం చేశారో కూడా తెలియదు..

Published Thu, Oct 12 2017 11:34 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

viral video Two mens  dragged down the dog in Chennai  - Sakshi

సాక్షి, చెన్నై: శునకం విశ్వాసానికి మారుపేరు. కానీ ఇద్దరు యువకులు దానికి చుక్కలు చూపించారు. మానవత్వం మరిచి యువకులు చాలా కిరాతకంగా ప్రవర్తించారు. ఈ విషాద సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. కుక్క మెడకు వైర్లు కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌ లో పోస్టు చేశారు.

ఈ వీడియోను వేలూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్సాలజీ క్యాంపస్‌లో తీశారు. ఒక నల్లకుక్క మెడకు వైర్లతో కట్టి. రెండు వైపులా లాక్కెళుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అలానే వారు వ్యాన్‌ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగానే ఈ కుక్క ఒక్కసారిగా పడిపోయింది.

ఈ వీడియోను చూసిన స్థానికులు.. కుక్కను లాక్కెళ్లిన ఆ ఇద్దరూ చెన్నైలోని తాంబరం మున్సిపాలిటీ సిబ్బంది అని, కుక్కల పట్టుకుని తరలించే విధులో భాగంగానే ఇలా చేశారని అంటున్నారు. బ్లూ క్రాస్‌ సంస్థ మాత్రం ఈ వీడియోను తీవ్రంగా తప్పుబట్టింది. ఈ వీడియో విషయమై కాలేజీ యాజమాన్యంపై, మున్సిపాలిటీ మీద బ్లూక్రాస్‌ ప్రతినిధి డాన్‌ విలియం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై వారు ఎందుకు స్పందించడంలేదని, క్యాంపస్‌లో వారు ఏమిచేస్తున్నారని ప్రశ్నించారు. ‘మా ప్రాంతంలో ఈ విధంగానే దాదాపుగా 11 కుక్కలను పట్టుకున్నారు. ఆ కుక్కలను ఎక్కడ ఖననం చేశారో కూడా చెప్పలేదు’ అని ఆయన అన్నారు. ఈ విషయంపై యూనివర్సిటీ అధికారులు కిమ్మనడం లేదు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు  చేస్తున్నామని కాంచీపురం పోలీసులు తెలిపారు. గత సంవత్సరం మెడికల్‌ విద్యార్థులు ఓ కుక్కను బిల్డింగ్‌ పై నుంచి కిందకు విసిరేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన కోర్టు వారికి ఫైన్‌ కూడా వేసింది. కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థులను సస్పెండ్‌ చేసింది. గాయపడిన ఆ కుక్కను ఓ వ్యక్తి తీసుకుని పెంచుతున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement