
అరిజోనా : చేతిలో బైబిల్ పట్టుకుని, నన్ వేషధారణలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ మహిళను పోలీస్ డాగ్ పట్టేసింది. అరిజోనాలోని యుమాకు చెందిన ఈస్తెర్ గొమేజ్ డీ అగులార్(53) తన భర్తతో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా నన్ వేషంలో డ్రగ్స్ సరఫరా చేయాలనుకుంది. 90 వేల డాలర్ల(దాదాపు రూ.63 లక్షలు) విలువైన సింథటిక్ ఓమియాడ్ డ్రగ్ ఫెంటానిల్‌ను అక్రమంగా సరఫరా చేయడానికి అగులార్ నన్ వేషాన్ని ఎంచుకుంది.
అయితే పినాల్ కౌంటీలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించినందుకు ఓ పోలీసు అధికారి వారి కారును అడ్డుకుని కిందకు దింపి మాట్లాడారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న పోలీస్ డాగ్ డ్రగ్స్ వాసన పసిగట్టి అగులార్‌పైకి అరవసాగింది. దీంతో అమెను చెక్ చేయగా హ్యాండ్‌బ్యాగ్‌లో, వస్త్రాల్లో డ్రగ్స్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిద్దరూ 8.5 పౌండ్ల డ్రగ్స్‌ను తీసుకెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment