సంచార్ నిగమ్...సేవలు సగమ్..
అరకులోయ,న్యూస్‌లైన్: పర్యాటక కేం ద్రమైన అరకులోయలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) సేవలు మెరుగుపడకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరికి ఫోన్ చేిసినా నెట్ వర్క్ ఎర్రర్ అని వస్తుండడంతో విసిగిపోతున్నారు. పది రోజుల కాలం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో అత్యవసర ప రిస్థితుల్లో సైతం సమాచారం చేరవేసేం దుకు అవకాశం లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ ప్రాంతంలో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులే ఎక్కువ మం ది ఉన్నాసేవలు అంతంతా మాత్రంగా ఉండడం, సంబంధిత అధికారులు ప ట్టించుకోకపోవడం గమనార్హం. దాదా పు అరగంట ప్రయత్నించినా ఒక్క ఫోన్ కాల్ కూడా వెళ్ళని పరిస్థితి ఉందని వాపోతున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా ప్రైవేటు సంస్థ అయిన ఎయిర్‌టెల్ వైపు మళ్లుతున్నారు. మన్యంలో సెల్ ఫోన్ సేవలు విసృ్తతం చేసేందుకు గత ఏడాది నుంచి ఈ ప్రాంతంలో విసృ్తతంగా టవర్లు ఏర్పాటు చేశారు.దీంతో పాటు 3జీ సేవలు కూడా అందుబాటులోని తెచ్చారు.
అయినా ఇక్కడ నెట్‌వర్క్ బాగోలేక పోవడంతో ఎన్ని టవర్లు వేసినా ప్రయోజనం లేకపోతోంది. అరకులోయలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో పూర్తి స్థాయి జూనియర్ టెలికాం ఆఫీసర్‌ను నియమించకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదన్న అభిప్రాయాలున్నాయి. పాడేరు జేటీవోకే ఇక్కడి ఇక్కడ ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన ఎప్పుడు వస్తారో తెలియడం లేదు. ఈ విషయంపై ఇన్‌చార్జీ జేటీవో మహ్మాద్‌ను వివరణ కోరగా సాంకేతిక లోపం కారణంగా కొంత అంతరాయం కలుగుతోందని, దీన్ని గుర్తించి లోపాన్ని సరిదిద్దుతామన్నారు.