ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ దూసుకెళ్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 4జీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరింత ప్రగతి సాధించింది. దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
దేశవ్యాప్తంగా 4జీ సర్వీస్‌ను విస్తరిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేట్ కంపెనీలకు పోటీగా 5జీ టెక్నాలజీని పరీక్షించడం ప్రారంభించింది. ఈ క్రమంలో వినియోగదారులకు 5జీ సిమ్ కార్డ్‌లను కూడా అందిస్తోంది. తాజగా 4జీ సర్వీస్‌లో మరింత పురోగతి సాధించింది. ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ టవర్లు 15 వేల మైలురాయికి చేరుకున్నాయి.
ఈ టవర్లను 'ఆత్మనిర్భర్ భారత్' పథకం కింద నిర్మించామని, దేశవ్యాప్తంగా అంతరాయం లేని ఇంటర్నెట్‌ను అందిస్తామని కంపెనీ తెలిపింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే బీఎస్‌ఎన్‌ఎల్ 4G నెట్‌వర్క్ పూర్తిగా భారతీయ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ మొబైల్ టవర్లలో అమర్చిన పరికరాలన్నీ భారత్‌లోనే తయారయ్యాయి.
అక్టోబరు చివరి నాటికి 80,000 టవర్లను ఏర్పాటు చేస్తామని, మిగిలిన 21,000 టవర్లను వచ్చే ఏడాది మార్చి నాటికి ఏర్పాటు చేస్తామని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అంటే 2025 మార్చి నాటికి మొత్తం లక్ష టవర్లు 4జీ నెట్‌వర్క్‌కు అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల డౌన్‌లోడ్ స్పీడ్ పెరుగుతుందని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment