ప్రైవేట్ టెలికాం కంపెనీలు చార్జీలు పెంచేయడంతో చాలామంది ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే గణనీయంగా యూజర్లు ఇతర కంపెనీల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేరారు. వినియోగదారుల డిమాండ్‌కు తగ్గుట్టుగానే ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ 4జీ సేవలను విస్తృతం చేస్తోంది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లకు కొత్త సమస్య వచ్చింది. అదేంటంటే..
4జీ రోల్‌అవుట్ కోసం ఉపయోగిస్తున్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ల కారణంగా, బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) కస్టమర్‌లు 4జీ సేవలను ఉపయోగించడానికి 5జీ-అనుకూల ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి రావచ్చు. 4G సేవలను అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ 2,100 MHz, 700 MHz అనే రెండు ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను ఉపయోగిస్తోంది. వీటిలో 700 MHz బ్యాండ్ సాధారణంగా 5జీ సేవలకు సంబంధించిదైనా బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలకు కూడా వినియోగిస్తోంది.
ఇతర టెలికాం ఆపరేట్లకు ఇచ్చినట్లే ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌కి కూడా 700 MHz బ్యాండ్‌ని కేటాయించింది. అయితే జియో వంటి వాణిజ్య ఆపరేటర్‌లు తమ స్వంత 5జీ నెట్‌వర్క్ కోసం దీనిని ఇంకా ఉపయోగించడం లేదు. ఈ బ్యాండ్ 5జీ సేవల కోసం ఇంకా పూర్తిగా స్థాపితం కాలేదు.దీంతో 2,100 MHz ఫ్రీక్వెన్సీ మాత్రమే సరిపోదన్న ఉద్దేశంతో బీఎస్‌ఎన్‌ఎల్ 700 MHz బ్యాండ్‌ని కూడా 4జీ సేవలు అందించడానికి ఉపయోగిస్తోంది.
ఇదీ చదవండి: జియోలో అత్యంత చవకైన ప్లాన్ ఇదే..
ఈ సమస్య గురించి తెలిసిన ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్ 700 MHz బ్యాండ్ (B28)తో పని చేసేలా 4జీ ఫోన్‌లను తయారు చేయాలని తయారీ కంపెనీలను కోరింది. రాబోయే హ్యాండ్‌సెట్‌లు 700 MHz బ్యాండ్‌లో 4జీ, 5జీ రెండింటికి సపోర్ట్ చేసేలా చూసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో సమన్వయంతో పనిచేస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ 700 MHz బ్యాండ్‌తో పనిచేసే ఫోన్‌లు ప్రస్తుతం 1,000 మాత్రమే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment