
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం హైదరాబాద్ వెళ్లనున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామ నగరంలో నిర్వహిస్తున్న శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి వేడుకల ప్రాంతానికి వెళ్తారు. శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. తిరిగి రాత్రి 9.05 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారు.
చదవండి: మీరు లేకపోతే నేను లేనని గుర్తు పెట్టుకోండి: సీఎం వైఎస్ జగన్