Statue Of Equality
-
ఘనంగా ప్రారంభమైన ‘సమతా కుంభ్’ బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
ముచ్చింతల్ సమతా మూర్తి: ఫిబ్రవరి 2 నుంచి సమతా కుంభ్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ముచ్చింతల్తో 216 అడుగుల పంచ లోహ రామానుజాచార్యుల విగ్రహంతో సమతామూర్తి(స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కేంద్రం ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, సమతామూర్తి కేంద్రం ఏర్పాటై ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ఏడాది కావస్తున్నది. ఈ తరుణంలో చిన్న జీయర్ కీలక ప్రకటన చేశారు. ఇక, సోమవారం చిన్న జీయర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ – 2023 జరుగనుందన్నారు. అదే సమయంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సమతామూర్తి కేంద్రం గత ఏడాది ఫిబ్రవరి 2న ప్రారంభమైంది.. 216 అడుగుల పంచలోహ విగ్రహం అందుబాటులోకి వచ్చిందన్నారు. 108 దివ్య దేశాలు సమతామూర్తి కేంద్రంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అనేక మంది గత బ్రహ్మోత్సవాలను చూశారు. ఈ ఏడాది కూడా అదే క్రమంలో కార్యక్రమం సాగుతుంది. కాకపోతే ఈ ఏడాది 9 కుండాలతో ఉండే యాగశాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహించనున్నామని వెల్లడించారు. సమతా కుంభ్ పేరుతో ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 11వ తేదీన లక్ష మందితో భగవద్గీత పారాయణం ఉంటుందన్నారు. అలాగే, రామానుజాచార్యులు చాలా మేధావి అంతే కాకుండా మనసు ఉన్న మనస్వి. అన్ని వర్గాల వారిని సమాజంలోకి తెచ్చి ఆలయాల్లో భాగస్వాములను చేశారని అన్నారు. ఈ క్రమంలోనే చిన్న జీయర్‌కు భారత అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ రావడంపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో చిన్న జీయర్ మాట్లాడుతూ.. ముందు రోజు నాకు ఫోన్ చేసి.. లిస్టులో మీ పేరు పెడుతున్నామని చెప్పారు. మీకు ఏదైనా అభ్యంతమా? అని అడిగారు. నాకేమీ అభ్యంతరం లేదని నేను వారికి చెప్పాను. పద్మభూషణ్ రావాలని నేను కోరుకోలేదు. అవార్డు వచ్చినందుకు ఆనందంగా ఉంది అని కామెంట్స్ చేశారు. -
ఆయన వస్తారో.. రారో చూడాలి: చిన్న జీయర్ స్వామి
సాక్షి, హైదరాబాద్: ముచ్చింతల్‌లో రేపు (శనివారం) శాంతి కల్యాణం జరగనుందని చినజీయర్ స్వామి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 108 దివ్యదేశాల ఆలయాల్లో మూర్తులకు శాంతి కల్యాణం జరుగుతుందని పేర్కొన్నారు. రేపు( శనివారం) సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శాంతి కల్యాణం జరగనుందని తెలిపారు. శాంతి కల్యాణ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం అందించామని చెప్పారు. అదే విధంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుతో తమకు విభేదాలు ఎందుకు ఉంటాయని.. ఆయన సహకారం ఉన్నందనే కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్.. ‘తాను ప్రథమ సేవకుడినని తెలిపారని చిన్నజీయర్ స్వామి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ రాకపోవడానికి అనారోగ్యం, పని ఒత్తిడి అవ్వొచ్చని అన్నారు. రేపు నిర్వహించే శాంతి కల్యాణానికి కూడా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని తెలిపారు.అయితే ఆయన వస్తారో.. రారో చూడాలని చిన్న జీయర్‌స్వామి పేర్కొన్నారు. ప్రతిపక్షం, స్వపక్షం రాజకీయాల్లోనే ఉంటాయని అన్నారు. అందరూ సమతామూర్తిని దర్శించాలని తెలిపారు. తమకు అందరూ సమానమేనని చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. -
ముగిసిన సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు
-
మహాక్రతువు సుసంపన్నం.. శాంతి కల్యాణం వాయిదా
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పన్నెండు రోజుల పాటు ఐదువేల మంది రుత్వికులు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు సోమవారంతో పరిపూర్ణమైంది. రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా ప్రవచన మండపంలో రోజూ అష్టాక్షరీ మంత్ర పఠనం, విష్ణుసహస్ర పారాయణం నిర్వహించారు. అలాగే, 114 యాగశాలల్లో 1035 హోమకుండలాల్లో రెండు లక్షల కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యితో విష్వక్సేనేష్టి, నారసింహ ఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, పరమేష్టి, వైభవేష్టి, హయగ్రీవ ఇష్టి, వైవాయిహిక ఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతే ఇష్టి యాగ పూజలను నిర్వహించారు. ఉదయం త్రిదండి చినజీయర్ స్వామి యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞ గుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత యాగశాల నుంచి సమతామూర్తి విగ్రహం వరకు పెరుమాళ్ యాత్రను నిర్వహించారు. 120 కేజీల రామానుజాచార్యుల బంగారు ప్రతిమకు చినజీయర్ స్వామి ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రతి యాగశాల నుంచి దేవతామూర్తులను ఆవాహన చేసిన కలశాలను సమంత్రకంగా సమతాక్షేత్ర స్ఫూర్తి కేంద్రానికి తీసుకెళ్లి కుంభప్రోక్షణ చేసి అభిషేకాన్ని నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. సాయంత్రం గ్లైడర్స్ సమతమూర్తి విగ్రహంపై పూలవర్షం కురిపించారు. అనంతరం దేశవిదేశాల నుంచి వచ్చిన రుత్వికులను ఘనంగా సత్కరించారు. ఈ పన్నెండు రోజులు అష్టాక్షరీ మంత్ర పఠనం, చతుర్వేద పారాయణం, ఐదు వేల మంది కళాకారుల ప్రదర్శనలు, మహా పూర్ణాహుతితో ఈ మహాక్రతువు సుసంపన్నమైంది. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం: కిషన్‌రెడ్డి ముచ్చింతల్ భవిష్యత్తులో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, హిందూ దర్శన ప్రదేశంగా విలసిల్లుతుందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. శ్రీరామనగరంలో శిలాసంపద అత్యద్భుతంగా ఉందని కొనియాడారు. దేశంలోని ప్రముఖ దివ్యదేశాలను ఒకే చోట దర్శించుకోవడం ఆనందంగా ఉందని, కార్యనిర్వాకుల కృషి, వైదిక ప్రక్రియలు ఈ వేడుకకు వన్నె తెచ్చాయన్నారు. ఈ ఉత్సవాలు ప్రారంభమైన రోజు నుంచి చివరి వరకు ఎనిమిది లక్షల మందికిపైగా శ్రీరామనగరాన్ని సందర్శించుకున్నట్లు అంచనా. శాంతి కల్యాణం వాయిదా నిజానికి సోమవారం ఉదయం మహా పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారని నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు ముచ్చింతల్ రహదారులు, సమతామూర్తి ప్రాంగణంలో భారీగా కేసీఆర్, కేటీఆర్ కటౌట్లను ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు కూడా ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం తర్వాత కూడా సీఎం రాలేదు. సాయంత్రం ఆయా దివ్యదేశాల్లోని మూర్తులకు నిర్వహించే శాంతి కల్యాణంలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. కానీ ఈ వేడుకలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఈ సమయంలో శాంతి కల్యాణం నిర్వహిస్తే.. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన రుత్వికులు, సేవకుల తిరుగు ప్రయాణానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటూ ఈ శాంతి కల్యాణాన్ని 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు చినజీయర్ స్వామి ప్రకటించారు. ఆయా ఆలయాల్లోని 108 విగ్రహ స్వరూపాలకు ఒకే చోట, ఒకే సమయంలో శాంతి కల్యాణం జరిపించడం చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుందని చెప్పారు. -
Statue Of Equality : 13వ రోజు సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు ( ఫోటోలు)
-
సమతను చాటే భవ్యక్షేత్రం
సాక్షి, హైదరాబాద్: వెయ్యేళ్ల కింద సమానత్వ భావనతో సామాజిక పరివర్తన దిశగా శ్రీరామానుజాచార్యులు వేసిన అడుగును బలోపేతం చేసే దిశగా ఆయన విరాట్‌మూర్తితో భవ్యక్షేత్రంగా అవతరించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం చైతన్యం నింపుతుందని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. అత్యద్భుతంగా రూపొందించిన ఈ కేంద్రం దేశంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందని పేర్కొన్నారు. జాతి నిర్మాణంలో కీలకమైన వసుదైక కుటుంబం స్ఫూర్తిని రామానుజుల ఆలోచనలు ప్రతిబింబిస్తాయని, జాతి కల్యాణంలో ఇప్పుడు రామానుజుల స్ఫూర్తి కేంద్రం కూడా ఆ పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం ముచ్చింతల్‌లోని రామానుజుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 120 కిలోల బంగారంతో రూపొందిన 54 అంగుళాల శ్రీరామానుజాచార్యుల స్వర్ణమయ మూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ లోకార్పణం చేశారు. అనంతరం రాష్ట్రపతి దంపతులు, వారి కుమార్తె తొలి పూజ నిర్వహించారు. అనంతరం ప్రవచన కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రపతి మాట్లాడుతూ రామానుజుల భవ్యక్షేత్రాన్ని అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించి చినజీయర్ స్వామి చరిత్ర సృష్టించారని కొనియాడారు. రామానుజుల స్వర్ణమయ మూర్తిని జాతికి అంకితం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. 1035 కుండాలతో నిర్వహించిన లక్ష్మీనారాయణ హోమం, 108 దివ్యదేశాల ప్రాణప్రతిష్టతో ఈ మహా క్షేత్రానికి గొప్ప ఆధ్యాత్మిక శోభ ఏర్పడిందని అన్నారు. స్ఫూర్తికేంద్రం సమతాభూమి... సమానత్వం కోసం పరితపించిన శ్రీరామానుజాచార్యులు వెలసిన ఈ క్షేత్రాన్ని తాను భక్తి భూమి, సమతాభూమి, విశిష్టాద్వైతాన్ని సాక్షాత్కరింపజేసే భూమిగా, దేశ సంస్కారాన్ని తెలిపే భూమిగా భావిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. వందేళ్లను మించిన తన జీవనయాత్రతో భారతీయ ఆధ్యాత్మిక, సామాజిక భావనకు కొత్త రూపమిచ్చిన రామానుజులు, సామాజిక భేదభావాలకు అతీతంగా దేవుడిని అందరి దరికి చేర్చి భక్తిప్రపత్తి, తాత్వికతను సామాజిక జీవన సౌందర్యంతో జోడించి కొత్త భాష్యం చెప్పారని కీర్తిం చారు. తక్కువ కులం వారుగా ముద్రపడ్డ వ్యక్తులు చేసిన రచనలను ఆయన వేదంగా గౌరవించారన్నారు. రామానుజులు దక్షిణాది నుంచి భక్తిధారను ఉత్తరాదికి ప్రవహింపజేసి ఎందరో ముక్తి పొందేలా చేశారని కోవింద్ పేర్కొన్నా రు. వారిలో ఎంతోమంది తక్కువ జాతిగా ముద్రపడ్డ వారేనని రాష్ట్రపతి తెలిపారు. రామానుజుల తత్వంతో అంబేడ్కర్... ‘రామానుజ తత్వంతో ప్రేరణ పొందిన కబీర్‌పంత్‌ను అనుసరించిన అంబేడ్కర్ కుటుంబీకులు జీవించిన మహారాష్ట్రలోని వారి గ్రామాన్ని నిన్న సందర్శించా. ఈరోజు శ్రీరామనగరంలోని ఈ క్షేత్రంలో ఉన్నా. ఈ రెండూ పవిత్ర తీర్థ స్థలాలుగానే నాకు అనిపిస్తాయి. అప్పట్లో సమత మంత్రంగా రామానుజులు పరివర్తన కోసం పరితపిస్తే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయం కోసం పనిచేశారు. రామానుజుల తత్వాన్ని అంబేడ్కర్ కూడా ప్రస్తుతించారు. మనలో ఇమిడి ఉన్న వసుదైక కుటుంబానికి ఈ సమతనే ప్రేరణ’అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. అన్ని వర్గాల పురోగతి అనే భావన రామానుజులు ప్రతిపాదించిన విశిష్టాద్వైతంలోని భక్తిభావంలో ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. రామానుజుల సమానత్వ స్ఫూర్తిని మహాత్మాగాంధీ అనుసరించారని, జైలువాసంలో ఉన్నప్పుడు ఆయన రామానుజుల చరిత్రను చదివి ఎంతో ప్రేరణ పొందారని గుర్తుచేశారు. స్వామి వివేకానందపై కూడా రామానుజుల ప్రభావం ఎంతో ఉందని, ఆయన రచనల్లో రామానుజులను గుర్తుచేశారని అన్నారు. సమతా స్ఫూర్తి కేంద్రం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. చిత్రంలో ఆయన సతీమణి సవిత, గవర్నర్ తమిళిసై, చినజీయర్ స్వామి, మంత్రి తలసాని, మైహోం రామేశ్వరరావు భారీ ప్రతిమ... దేశ ఆధ్యాత్మిక వైభవానికి చిహ్నం ఓ శ్లోక తాత్పర్యం ప్రకారం విష్ణువుకు సోదరులుగా వివిధ కాలాల్లో పుట్టిన వారి ప్రస్తావన ఉందని రాష్ట్రపతి గుర్తుచేశారు. దాని ప్రకారం తొలుత ఆదిశేషుడిగా, త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపర యుగంలో బలరాముడిగా, కలియుగంలో రామానుజులుగా అవతరించారని అందులో ఉన్నట్లు ఆయన తెలిపారు. కలియుగంలో ముక్తి మార్గాలు మూసుకుపోయినప్పుడు రామానుజులు భక్తి, ముక్గి మార్గాన్ని చూపిన తీరును అన్నమాచార్యులు పలు కీర్తనల్లో ప్రస్తావించారన్నారు. పంచ లోహాలతో రూపొందిన రామానుజుల విరాట్‌మూర్తిని చూస్తే అది ఒక విగ్రహం మాత్రమే కాదని, దేశ సంప్రదాయ వైభవానికి ప్రతిరూపమని, సామాజిక సమానత్వ భావనను సాకారం చేసే కలకు నిలువెత్తు రూపమని, దేశ ఆధ్యాత్మిక వైభవానికి చిహ్నమని కోవింద్ కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి దంపతులను శాలువా, రామానుజుల జ్ఞాపికతో చినజీయర్ స్వామి సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రామానుజుల సహస్రాబ్ది సమారోహం ప్రతినిధులు జూపల్లి రామేశ్వరరావు, ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Statue of Equality: హైదరాబాద్ పర్యటనలో రామ్‌నాథ్ కోవింద్
-
Statue Of Equality: 11వ రోజు సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు ( ఫోటోలు)
-
Statue Of Equality: పదో రోజు సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు ( ఫోటోలు)
-
Statue Of Equality : తొమ్మిదోరోజు ఘనంగా మహాయాగం
-
Statue Of Equality: 8వ రోజు సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు
-
సమతామూర్తి విగ్రహం.. ప్రధానిపై ‘మేడ్ ఇన్ చైనా’ విసుర్లు
ప్రపంచంలోనే అతిపెద్ద రెండో విగ్రహం(కూర్చున్న పొజిషన్లో) రామానుజాచార్యను ఆవిష్కరించిన దేశ ప్రధాని మోదీ.. జాతికి అంకితమిచ్చిన విషయం తెలిసిందే. ముచ్చింతల్(శంషాబాద్ దగ్గర) జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం.. టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల తుటాలకు కారణమైంది. అయితే ఇప్పుడు అంశం దేశ రాజకీయాలకు చేరింది. సమతామూర్తి విగ్రహం ఆధారంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మేడ్ ఇన్ చైనా కామెంట్లతో దేశ ప్రధాని నరేంద్ర మోదీపై విసుర్లు విసిరారు. సమతామూర్తి విగ్రహం చైనాలో తయారైంది. కాబట్టి, నవ భారతం.. ఆత్మ నిర్భర్ కాదు.. చైనా నిర్భర్(ఆధారపడడం) అంటూ సెటైర్లు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ అంటారు. కానీ, నవ భారతం చైనా మీద ఆధారపడుతోంది. సమతామూర్తి విగ్రహమే అందుకు నిదర్శనం. ఇది చైనా కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించబడింది అంటూ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. Statue of Equality is Made in China. ‘New India’ is China-nirbhar? — Rahul Gandhi (@RahulGandhi) February 9, 2022 ఇదిలా ఉంటే.. కొన్ని నివేదికల ఆధారంగా రాహుల్ గాంధీ ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. 216 అడుగుల స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీ(సమతామూర్తి విగ్రహం)ను చైనాకు చెందిన అయిర్సన్(Aersun) కార్పొరేషన్ రూపొందించింది. 2015 ఆగష్టులో కాంట్రాక్ట్‌ను ఆ కంపెనీకి అప్పగించగా.. చైనాలోనే దాదాపు పని పూర్తైంది. సుమారు 1,600 భాగాలు చైనాలో తయారయ్యి.. ఇక్కడికి వచ్చాయి. అమరిక ప్రక్రియకు సుమారు 15 నెలలు పట్టింది. కాంట్రాక్టు బిడ్డింగ్‌ను గెలుచుకోవడానికి భారతీయ కంపెనీ కూడా పోటీలో నిలిచింది అని ఆ నివేదిక వెల్లడించింది. మరి రాహుల్ ఆరోపణలపై.. బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. చైనా విషయంలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ బలంగా మాటల దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు పార్లమెంటులో రాహుల్ ప్రసంగిస్తూ.. చైనీయులకు వాళ్లు ఏమి చేయాలనుకుంటున్నారనే దానిపై స్పష్టమైన దృక్పథం ఉందని, చైనా,పాకిస్తాన్‌లు ఏకతాటిపై రావడానికి భారతదేశం అనుమతించిందని, ఇది అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదమని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతదేశపు విదేశాంగ విధానం ఏకైక అతిపెద్ద వ్యూహాత్మక లక్ష్యం.. పాకిస్తాన్ చైనాలను వేరుగా ఉంచడం. ఇది భారతదేశానికి ప్రాథమికమైనది. కానీ, మీరు(మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ..) ఏం చేశారు? వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చారు’’ అని లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మనమందరం జాతీయవాదులుగా చర్చిద్దాం. విదేశాంగ విధానంలో మన ప్రభుత్వం వ్యూహాత్మక తప్పులు చేస్తోంది. చైనాను తక్కువ అంచనా వేయొద్దు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు చైనాలో తయారైన సమతామూర్తి విగ్రహంతో చైనా నిర్భర్‌ను ప్రదర్శిస్తున్నారంటూ బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. -
ప్రత్యామ్నాయ వ్యూహం ఫలించేనా?
రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ సభ మరో రకంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీతో కేసీఆర్ వేదిక పంచుకోకపోవడం కొత్త రాజకీయాలకు తెరలేపిందా? బీజేపీ మీద నిరసన తెలపడానికి దీన్నొక ఆయుధంగా చేసుకున్నారా, నిత్యం విమర్శిస్తూ మళ్లీ ప్రధాని వెంట వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అనుకున్నారా... వీటికంటే కూడా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటునకు సన్నద్ధం అవుతున్నారా అన్నదే మరింత రసవత్తరంగా ఉంది. తద్వారా బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమిని కట్టడమూ, వ్యూహచతురుడిగా దానికి సారథ్యం వహించడమూ, ఇంకా కలిసొస్తే మోదీని ఢీకొట్టగలిగే నేత తానేనన్న సంకేతాలు దేశవ్యాప్తంగా పంపడమూ... ఇంత కథ ఉంది. ఈ కొత్త రాజకీయ చక్రం మున్ముందు ఎలా తిరుగుతుందన్నది ఎదురుచూడదగిన పరిణామం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి గైర్హాజరవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొద్ది రోజుల క్రితం మీడియా సమా వేశంలో మాట్లాడుతూ, తాను తప్పక ప్రధాని మోదీతో రామాను జాచార్యుల విగ్రహావిష్కరణ సభలో వేదిక పంచుకుంటానని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ ఆయన మోదీతో పాటు ఆ కార్యక్రమంలో లేరు. కేసీఆర్‌కు జ్వరం వచ్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చినా, దానిని రాజకీయ వర్గాలు అంతగా విశ్వసించడం లేదు. అంతకు ముందురోజే కేసీఆర్ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లి, విగ్రహ ఏర్పాటు తదితర విశేషాలను పరిశీలించి వచ్చారు. ప్రధాని వెళ్లిపోయిన మరుసటి రోజు యాదాద్రిపై సమీక్ష చేశారు. అపర హిందూ భక్తుడిగా తనను తాను అభివర్ణించుకునే కేసీఆర్ ఇంత పెద్ద కార్యక్రమానికి, అందులోనూ ప్రధాని పాల్గొన్న సభకు రాకుండా ఉంటారని అను కోలేదు. ఇందులో వ్యక్తిగత విషయాలు ఉన్నాయా, రాజకీయ కోణాలు ఉన్నాయా అన్న చర్చ సహజంగానే ముందుకు వస్తుంది. గతంలో ప్రధాని అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి వేచి ఉండవలసిన సందర్భాలు ఆయనకు చీకాకు కలిగించి ఉండవచ్చు. అదే సమయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ నేతలంతా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీతో వేదిక పంచుకోవడానికి కేసీఆర్‌కు మొహం చెల్లలేదా అన్న ప్రశ్న కూడా వస్తుంది. నిజంగానే ఆయనకు జ్వరం వచ్చివుంటే, దాన్ని తప్పు పట్టజాలం. ప్రధాని ఒక రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆయనకు స్వాగతం పలకడం, ఆ తర్వాత ఆయనతో కలిసి కార్యక్రమాలలో పాల్గొనడం ప్రోటోకాల్గానే కాకుండా, ప్రివిలేజ్‌గా కూడా పరిగణి స్తారు. కానీ నిత్యం బీజేపీని విమర్శిస్తూ, తీరా మోదీ వెంట వెళ్తే తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన అనుమానించి ఉండవచ్చు. దీనిని నిరసన తెలపడానికి ఒక అవకాశంగా భావించి ఉండవచ్చు. మరో రాజకీయ కోణం కూడా ఉందన్న ప్రచారం ఉంది. కేసీఆర్ వచ్చే రెండేళ్లలో తాను ఊహించిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నద్ధం అవ్వవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలతో రాజకీయ సంబంధాలు పెట్టుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులతో సంప్రదింపులు జరిపారు. అవి కార్యాచరణలోకి ఇప్పటికిప్పుడు వస్తాయని అనుకోలేకపోయినప్పటికీ, ఆ దిశగా పయనించడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. వేరొక ప్రచారం కూడా లేకపోలేదు. ప్రాంతీయ పార్టీల నేతలలో కేసీఆర్‌కు ఉన్న వ్యూహ రచనా పటిమ ఇతరులకు ఆ స్థాయిలో లేదనీ, అలాగే మూడు, నాలుగు భాషలలో ప్రావీణ్యం కలిగిన నేతగా గుర్తింపు పొందారనీ, వీటి ఆధారంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడితే దానికి తాను సార«థ్యం వహించాలని ఆశిస్తుండవచ్చనీ అంటున్నారు. అవసరమైతే, అవకాశం వస్తే మోదీకి తాను ప్రత్యా మ్నాయంగా కనిపించాలన్న ఆలోచన చేస్తుండవచ్చని అంటున్నారు. కొన్నేళ్ల క్రితమే టీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌ను భావి ప్రధాని అని చెప్పేవారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ చక్రం తిప్పడం ఆరంభం కావచ్చని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతోందనీ, బీజేపీని అడ్డుకోవడానికి ప్రాంతీయ పార్టీల కూటమికి ఆ పార్టీ కూడా మద్దతు ఇవ్వక తప్పని స్థితి వస్తుందనీ కొందరి అంచనా. అదే జరిగితే 1996లో యునైటెడ్ ఫ్రంట్ మాదిరిగా ఈసారి ఫెడరల్ ఫ్రంట్ ప్రయోగం జరగవచ్చనీ, అప్పట్లో దేవెగౌడ, ఐకె గుజ్రాల్‌లకు ప్రధాని అవకాశం వచ్చినట్లు ప్రాంతీయ పార్టీల నేతలలో ఎవరో ఒకరికి ఆ ఛాన్స్ తగలవచ్చనీ, ఆ రేసులో ముందంజలో ఉండటానికి కేసీఆర్ వ్యూహరచన చేస్తుండవచ్చనీ ఒక నేత అభిప్రాయపడ్డారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మోదీతో పాటు వేదిక పంచు కుని ఉండకపోవచ్చు. తద్వారా మోదీని తాను ఢీకొట్టగలనన్న అభిప్రా యాన్ని దేశవ్యాప్తంగా పంపడానికి దీనిని వాడుకుని ఉండవచ్చు. ఇలా ప్రధాని కార్యక్రమానికి హాజరు కాని ముఖ్యమంత్రులలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఉన్నారు. ఆమె ప్రధాని రేసులో లేకపోతే ఆ అవకాశం కేసీఆర్‌కు రావచ్చని కొందరు భావిస్తు న్నారు. మరో సీనియర్ నేత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన రాష్ట్రం వదలి రాకపోవచ్చు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహరచనలో భాగంగానే కేసీఆర్ ఈ ప్లాన్ అమలు చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. కాగా కేసీఆర్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్న కూడా వస్తుంది. మోదీని కేసీఆర్ అవమానించారని బీజేపీ నేతలు వ్యాఖ్యా నిస్తున్నారు. మోదీని చూస్తే కేసీఆర్‌కు చలి జ్వరమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అయితే ఇందులో కొంత రిస్కు కూడా ఉంటుంది. ఒకవేళ యూపీలో బీజేపీ గెలిచి, సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే తిరిగి అధికారం లోకి వస్తే, అప్పుడు టీఆర్ఎస్కు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. కాకపోతే ఈలోగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయి. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ తిరిగి విజయం సాధిస్తే కేసీఆర్ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తారు. అయినా కేంద్రంలో తమకు వ్యతిరేకమైన బీజేపీ అధికారంలోకి వస్తే, కేంద్ర, రాష్ట్రాల మధ్య, అలాగే మోదీ కేసీఆర్ మధ్య వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకపోతే మాత్రం కేసీఆర్ కొత్త రాజకీయం ఆరంభించవచ్చు. మరో మాట కూడా చెబుతున్నారు. కేసీఆర్‌కు ఎలాంటి రాజకీయ వాతావరణాన్ని అయినా ఎదుర్కునే తెలివితేటలు ఉన్నాయనీ, దానిని తనకు అనుకూలంగా మార్చుకోగల సత్తా, నేర్పు ఉన్న నేత అనీ, అందువల్ల మోదీ మళ్లీ ప్రధాని అయినా, ఆయనతో సఖ్యతగా ఉండగల చతురత ఆయనకు ఉందనీ మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తానే తెచ్చినట్లు ప్రజలలో విశ్వాసం పొందిన నేతగా కేసీఆర్ గుర్తింపు పొందడం ఇందుకు ఒక ఉదాహ రణగా చెబుతున్నారు. ఒకటి మాత్రం వాస్తవం. ఏదైనా రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలక పోవడం అంత మంచి సంప్రదాయం కాదు. గత ఎన్నికలకు ముందు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ ఏపీకి వచ్చినప్పుడు తాను స్వాగతం పలకకపోగా, కనీసం మంత్రులను కూడా పంపించలేదు. పైగా నల్లజెండాలు, బెలూన్లు ఎగరేసి నిరసన తెలిపారు. అది మోదీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు ఓటమి తర్వాత బీజేపీతో రాజీ కుదుర్చుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నా, ఇప్పటి వరకూ సఫలం కాలేకపోయారు. టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపినా ప్రయోజనం కలగలేదు. రాజకీయాలలో ఇలాంటి సీరియస్ ఘట్టాలు కూడా ఉంటాయి. వాటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడే కేసీఆర్ ఈ వ్యూహంలోకి వెళ్లి ఉండవచ్చు. కానీ కేసీఆర్ ఒక జాగ్రత్త తీసు కున్నారు. ఎక్కడా ప్రోటోకాల్ మిస్ కాకుండా ప్రధానికి తన మంత్రు లతో స్వాగతం చెప్పించారు. నిరసన జెండాలు ఎగుర వేయడం వంటి పిచ్చి పనులు చేయలేదు. అది కొంతలో కొంత తెలివైన వ్యవహారమే! రాష్ట్ర బీజేపీ నేతలతో టీఆర్ఎస్ నేతలు ట్విట్టర్లో వాదప్రతివాదాలు చేస్తూ సందడిగా ఉన్నప్పటికీ కేసీఆర్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మోదీని ఢీకొడుతున్నానన్న సంకేతం ఇచ్చారు. ఆయన రాజకీయ వ్యూహాలు ఎలా పండుతాయో భవిష్యత్తులో చూడాల్సిందే! కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
Statue Of Equality : శ్రీరామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో అమిత్ షా
-
ఇక్కడకు రావడం అదృష్టంగా భావిస్తున్నా: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమతామూర్తి రామానుజ విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన మండపంలో భక్తుల నుద్దేశించి ప్రసంగించారు. రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రతిమను దూరం నుంచి చూస్తే ఆత్మకు శాంతి చేకూరుస్తుందన్నారు. రామానుజాచార్యుడి సమతామూర్తిని దర్శించుకున్న తర్వాత తనలో చైతన్యం పెరిగిందని తెలిపారు. అనేక యుగాలవరకు సనాతన ధర్మ పరిరక్షణకు ఈ రామానుజాచార్యుడి విగ్రహం ప్రేరణ ఇస్తుందన్నారు. సనాతన ధర్మంలో జీవుడే సత్యం అన్నది వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. రామాయణ, భారత కాలాలనుంచి నుంచి ఇప్పటివరకు సనాతన ధర్మం ఒడిదుడుకులకు లోనయినప్పటికీ ముందుకు సాగుతూనే ఉంటుంది. సనాతన ధర్మం యాత్ర ఆగిపోదు.. ప్రపంచమంతా విస్తరిస్తుంది.సనాతన ధర్మ పరిరక్షణలో ముందుకు సాగుతున్న చిన్నజీయర్ స్వామికి నా అభినందనలు. నేను జన్మతా వైష్ణవుడిని. ఇంతమంది ఆచార్యులు, సాదు సంతవులు ముందు విశిష్టాద్వైతం గురించి మాట్లడలేను. రామానుజాచార్యుడు గురువు ఆదేశాలను దిక్కరించి ఆయన బోధించిన అష్టాక్షరి మంత్రాన్ని ప్రజలందరికి వినిపించారు. ఆలయం శిఖరంపైకి ఎక్కి అష్టాక్షరి మంత్రాన్ని సాధారణ ప్రజలకు వినిపించారు. చదవండి: సనాతన ధర్మం అన్నింటికీ మూలం రామానుజాచార్యుడు మధ్యే మార్గం విశిష్టాద్వైతాన్ని సూచిస్తూ.. దేశంలో ఐక్యతను సాధించేందుకు కృషిచేశారు. అందరికీ మోక్షం పొందే హక్కు ఉందని రామానుజాచార్యుడి బోధనలు చేశారు. రామానుజాచార్యుడు రాసిన శ్రీ భాష్యం, వేదాంత సంగ్రహం సహం తొమ్మిది గ్రంథాలు అత్యంత ఆదరణ పొందాయి. ఈ గ్రంథాలు దేశంలోని చాలా గ్రంథాలయాలల్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సర్వస్వం భగవంతునికి సమర్పించిన వారికే మోక్షం పొందే హక్కు ఉంటుందని రామానుజాచార్యుడు బోధించారు. వినమ్రత, సంస్కరణకోసం చేసే విప్లవం ఇవి రెండు కలిస్తేనే ఉద్దరణ ప్రక్రియ ఆవిష్కారమవుతుంది. దేవాలయాలు, గృహాల్లో పూజ చేయడానికి రామానుజాచార్యుడు విది విధానాలను నిర్దేశన చేశారు’ అని అమిత్ షా పేర్కొన్నారు. చదవండి: ‘కేసీఆర్ ఉద్దేశ్య పూర్వకంగానే పీఎంకు ఆహ్వానం చెప్పలేదు.. అయితే ఏంటి?’ -
సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న అమిత్ షా
► కేంద్ర హోంశాఖ మంత్రి ముచ్చింతల్‌లోని సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మం అన్నింటికీ మూలమని, సమతామూర్తి విగ్రహం ఏకతా సందేశాన్ని అందిస్తోందన్నారు. ► కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. తిరునామం, పంచెకట్టుతో వచ్చిన అమిత్ షా.. ముచ్చింతల్‌లోని దివ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. కేంద్రం విశిష్టతను చినజీయర్ స్వామి హోంమంత్రికి వివరించారు. అనంతరం శ్రీరామానుజుడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ► సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత దాదాపు రెండున్నర గంటల పాటు సహస్రాబ్ది వేడుకల్లో అమిత్ షా పాలుపంచుకోనున్నారు. అనంతరం యాగశాలలో జరిగే పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న అమిత్ షాకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన ముచ్చింతల్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, బిజేపి సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఘన స్వాగతం పలికారు. -
Statue of Equality : శ్రీరామ నగరంలో సీఎం వైఎస్ జగన్ (ఫోటోలు)
-
సీఎం జగన్‌కు చిన జీయర్ స్వామి అరుదైన గౌరవం
-
చిన్నారుల శ్లోకాల స్పీడ్‌కు సీఎం జగన్ ఫిదా
-
సీఎం జగన్‌ను అభినందించిన చినజీయర్ స్వామి
-
ముచ్చింతల్‌లో సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం..
-
శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు..సండే సందడి
-
‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ సమానత్వానికి నిలువెత్తు చిహ్నం: మోదీ
సాక్షి, హైదరాబాద్:‘‘జగద్గురు రామానుజాచార్యుల బోధనలు, ఆయన చాటిన ఆధ్యాత్మిక చైతన్యమే వేల ఏళ్ల బానిసత్వంలోనూ భారతీయులను చైతన్యవంతులుగా నిలిపాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు. ప్రస్తుతం స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను, పోరాట యోధులను గుర్తు చేసుకుంటూ 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట జరుపుకొంటున్నామని గుర్తు చేశారు. నాటి స్వాతంత్య్ర పోరాటం అధికారం, హక్కుల కోసమే కాకుండా వేల ఏళ్ల సంస్కృతి పరిరక్షణ కోసం జరిగిందని తెలిపారు. ఆ పోరాటంలో పాటించిన ఆధ్యాత్మిక, మానవీయ విలువలు మనకు రామానుజాచార్యుల వంటి వారి బోధనల నుంచే లభించాయన్నారు. ప్రధాని మోదీ శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న శ్రీరామానుజుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 216 అడుగుల భారీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ వివరాలు ప్రధాని మాటల్లోనే.. ఆయన విలువలు, ఆదర్శాలే మార్గం.. ‘‘రామానుజులు దక్షిణాదిలో జన్మించినా ఆయన బోధనలు అన్నమాచార్యులు, కనకదాసు మొదలుకుని తులసీదాస్, కబీర్దాస్ వంటి సాధు సంతుల ఉపదేశాలు, సందేశాల ద్వారా దేశమంతటా విస్తరించి ఏకత్వాన్ని బోధించాయి. ఆయనను పరమ గురువుగా చిరస్థాయిలో నిలిపాయి. రామానుజులు తన బాగు కంటే జీవకోటి సంక్షేమానికే ఎక్కువ ఆరాటపడ్డారు. ఎంతో శ్రమకోర్చి నేర్చుకున్న గురుమంత్రాన్ని రహస్యంగా ఉంచాలనే గురువు మాటను కాదని.. తాను నరకానికి వెళ్లినాసరే మిగతా వారికి మేలు కలగాలనే ఉద్దేశంతో ఆలయ శిఖరంపైకి ఎక్కి అందరికీ మంత్రాన్ని ఉపదేశించారు. జగద్గురు రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి మార్గనిర్దేశం కావాలని కోరుకుంటున్నాను. గురువు ద్వారానే మనకు జ్ఞానం లభిస్తుంది. ఇది భారతీయ సాంప్రదాయం. మనం అనుసరిసున్న విలువలు, ఆదర్శాలు యుగయుగాలుగా మానవాళికి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నాయి. ఆ విలువలు, ఆదర్శాలను మనం ఈరోజు రామానుజాచార్యుల విగ్రహ రూపంలో ఆవిష్కరించుకుంటున్నాం. రామానుజుల మార్గం రాబోయే సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా ప్రాచీన భారతీయతను కూడా బలోపేతం చేస్తుంది. విశిష్టాద్వైత బోధనతో.. అంబేడ్కర్ వంటివారు రామానుజాచార్యులను ప్రశంసించడంతోపాటు ఆయన బోధనల నుంచి నేర్చుకోవాలని అనేవారు. మన దేశంలో పూర్వకాలం నుంచీ వివిధ వాదాలు, సిద్ధాంతాలను విశ్లేషించి స్వీకరించడమో, తిరస్కరించడమో కాకుండా.. అందులోని మంచిని వివిధ రూపాల్లో ఆచరించే సాంప్రదాయం ఉండేది. అదే రీతిలో రామానుజాచార్యులు కూడా అద్వైత, ద్వైత సిద్ధాంతాలను సమ్మిళితం చేసి విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించారు. తన బోధనల్లో కర్మ సిద్ధాంతాన్ని ఉత్తమ రీతిలో ప్రస్తావించడంతోపాటు స్వయంగా తన పూర్తి జీవితాన్ని అందుకోసమే సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చర్చిస్తున్న ప్రగతిశీలత, సామాజిక సమస్యల పరిష్కారం వంటి ఎన్నో అంశాలను రామానుజులు తన సంస్కృత, తమిళ గ్రంథాల్లో ఎప్పుడో లేవనెత్తారు. సమానత్వాన్ని బోధిస్తున్న ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’.. ఆదర్శాలు, సత్యం అనే ఆభరణాలు లేని గాంధీని, ఆయన లేని స్వాతంత్య్ర పోరాటాన్ని మనం ఊహించలేం. హైదరాబాద్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఏకత్వాన్ని.. రామానుజాచార్యుల ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ సమానత్వాన్ని బోధిస్తున్నాయి. అధికారం లేదా బలం మీద కాకుండా ఏకత్వం, సమానత్వం, సమాదరణ అనే సూత్రాల మీద మనదేశం ఆధారపడి ఉంది. నేడు ఆవిష్కరించిన రామానుజుల విగ్రహం దేశవాసులకు నిరంతరం స్ఫూర్తినిస్తుంది. ఈ సమతాస్ఫూర్తితోనే ఎలాంటి అంతరాలు లేకుం డా ప్రతిఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పేదలకు పక్కాఇళ్లతోపాటు, ఉచిత గ్యాస్, రూ.5లక్షల వరకు ఉచిత ఆరోగ్య చికిత్సలు, ఉచిత విద్యుత్ కనెక్షన్లు, జనధన్ ఖాతాలు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాల ద్వారా పేదలు, వెనుకబడిన వర్గాలకు మేలు కలు గుతోంది. ఈ రోజు ఇక్కడ నాకు 108 దివ్యదేశ మందిరాల సందర్శన భాగ్యం లభించింది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. మూఢ విశ్వాసాలను అధిగమిస్తూ.. వెయ్యేళ్ల క్రితం సమాజంలో బలంగా ఉన్న మూఢ, అంధ విశ్వాసాలను అధిగమిస్తూ భారతీయ ఆలోచన ధారను రామానుజాచార్యులు సమాజానికి పరిచయం చేశారు. వెనుకబడిన తరగతులు, దళితుల పట్ల సమాజంలో ఉన్న అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ, వారిని చేరదీసి గౌరవించారు. యాదగిరిపై నారాయణ మందిరం నిర్మించి దళితులకు దర్శనం, పూజలు చేసే అధికారం కల్పించారు. రామానుజాచార్యుల గురువు వేరే జాతి వ్యక్తి అంత్యక్రియలు చేస్తే వచ్చిన విమర్శలపై సమాధానమిస్తూ.. ‘రాముడు జటాయువు అంత్యక్రియలు జరిపినపుడు ఇది ఎలా తప్పు అవుతుంది?’ అని నిలదీశారు. యుగాల నుంచి పరిశీలించి చూస్తే.. చెడు విస్తరించినపుడల్లా మన మధ్య నుంచే మహానుభావులు పుట్టి.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, అనేక కష్టనష్టాలకు ఎదురొడ్డి నిబద్ధతతో పోరాటం చేశారు. సమాజం దానిని అర్థం చేసుకున్నప్పుడు ఆదరణ లభిస్తుంది. రామానుజులు సమాజాన్ని మంచి మార్గంలో నడిపేందుకు.. ఆధ్యాత్మిక, వ్యక్తిగత జీవితాన్ని ఆచరణలో చూపారు. తాను స్నానం చేసి వచ్చే సమయంలో శిష్యుడు ధనుర్దాసు భుజాల మీద చేయివేసి నడవడం ద్వారా అంటరానితనం సరైనది కాదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీది రాజ ధర్మం చినజీయర్ స్వామి నిత్యం ప్రజల శ్రేయస్సును కాంక్షించే శ్రీరామచంద్రుడు వ్రత సంపన్నుడుగా ప్రసిద్ధికెక్కాడని.. ఇప్పుడు దేశప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని మోదీ కూడా వ్రత సంపన్నుడేనని త్రిదండి చినజీయర్ స్వామి కొనియాడారు. మనుషులంతా ఒక్కటేననే స్ఫూర్తిని వెయ్యి సంవత్సరాలకు పూర్వమే రామానుజులు వ్యక్తపరిచారని.. ఆయన స్ఫూర్తిని మోదీ చాటుతున్నారని పేర్కొన్నారు. ‘‘వాల్మీకి రామాయణంలో ప్రజల సుఖసంతోషాల కోసం ప్రభువు చేసే త్యాగాలు, ధైర్య సాహసాలన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో కనిపిస్తున్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలు తలెత్తుకునేలా పాలన సాగిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను ముందు వరుసలో నిలిపేలా ఆయన కృషి చేస్తున్నారు. అందుకే నరేంద్ర మోదీకి మాత్రమే ప్రధాని స్థానం సరిపోలుతుంది. ప్రజా సంక్షేమం కోసం ఏయే పనులు చేయాలో మోదీకి తెలుసు. సమయానుకూలంగా వాటిని చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. రాజధర్మాన్ని అత్యంత స్పష్టంగా అమలు చేస్తున్నారు. సబ్‌కాసాత్– సబ్కా వికాస్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు.’’అని చినజీయర్‌స్వామి ప్రశంసించారు. ధర్మపాలన చేసే ప్రభువు నియమనిష్టలతో ఉండాలన్నారు. సమానత్వమే మా సిద్ధాంతం: కిషన్‌రెడ్డి మనుషులంతా సమానమేనని రామానుజులు వెయ్యేళ్ల కింద చాటి చెప్పారని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ సమానత్వ సిద్ధాంతాన్ని అమలు చేస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. కొందరు విచ్ఛిన్నకర కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ మనందరం రామానుజుల స్ఫూర్తితో సమానత్వంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. చినజీయర్ స్వామి ముచ్చింతల్‌లో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ఈ సమతా స్ఫూర్తి కేంద్రం అంతర్జాతీయ స్థాయి దివ్యక్షేత్రంగా వెలుగొందుతుందని ఆకాంక్షించారు. మోదీ ప్రభుత్వం కాశీ క్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. గుజరాత్లో సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం, హైదరాబాద్‌లో రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహం ఎంతో ప్రసిద్ధి చెందుతాయని చెప్పారు. దేశం మొత్తానికి 1947లోనే స్వాతంత్య్య్రం లభించినా.. మనకు (హైదరాబాద్ స్టేట్‌కు) ఒక ఏడాది తర్వాత స్వాతంత్య్య్రం లభించిందన్నారు. అది కూడా సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ చొరవతో వచ్చిందని పేర్కొన్నారు. -
ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన ఫొటోలు
-
PM Narendra Modi : తెలుగు సినిమాపై ప్రధాని మోదీ కామెంట్స్ వైరల్
PM Narendra Modi Appreciates Telugu Cinemas: తెలుగు సినిమాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందన్నారు. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ అనంతరం ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. 'సిల్కర్ స్కీన్ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలుగు భాష చరిత్ర ఎంతో సుసంపన్నమైంది. కాకతీయుల రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణం. పోచంపల్లి చేనేత వస్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించాయి' అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం మోదీ చేసిన ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. 🙏🙏🙏🙏 #TeluguCinema 🙏🙏 pic.twitter.com/YYAjBygPow — Harish Shankar .S (@harish2you) February 5, 2022 -
అందరు నవ్వుకుంటున్నారు.. ప్రధాని రాకతో కేసీఆర్‌కు జ్వరం
-
ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
-
మైక్రో ఇరిగేషన్‌ను మరింత ప్రోత్సహించాలి: ప్రధాని మోదీ
-
ఇక్రిసాట్‌ను సందర్శించిన ప్రధాని మోదీ
-
ప్రపంచ ఆహార భద్రత లక్ష్యంగా ఇక్రిసాట్ ఏర్పాటు
-
ప్రధాని మోదీ పర్యటన సాగిందిలా..
-
హైదరాబాద్‌కు ప్రధాని.. స్వాగతానికి కేసీఆర్ దూరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యటన కోసం శనివారం హైదరాబాద్‌కు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని స్వాగతించే, వీడ్కోలు చెప్పే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగిస్తున్నట్టు సీఎం కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని మోదీకి.. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం కేసీఆర్ తదితరులు స్వాగతం పలకాల్సి ఉంది. ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివార్లలోని ఇక్రిశాట్ (అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం)కు చేరుకుని సంస్థ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. స్వాగత కార్యక్రమానికి సీఎం దూరంగా ఉండటంతో ప్రధాని వెంట గవర్నర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇక్రిశాట్‌కు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక్రిశాట్ వేడుకల తర్వాత ప్రధాని మోదీ ముచ్చింతల్‌లో జరిగే రామానుజుల సహస్రాబ్ది వేడుకల ప్రాంగణానికి వస్తారు. ఇక్కడ కార్యక్రమాలు పూర్తయ్యాక శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి ఢిల్లీకి బయలుదేరుతారు. ఇందులో స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలతోపాటు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు కూడా కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ముచ్చింతల్‌లో జరిగే రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో మాత్రం ప్రధానితో కలిసి పాల్గొంటారు. ఎంపీ కుమారుడి వివాహానికి హాజరై.. శనివారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కుమారుడి వివాహం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఆ వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ముచ్చింతల్‌కు రానున్నారు. అయితే ప్రధాని స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలు, పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ప్రభుత్వ సీఎస్‌ను సీఎం ఆదేశించినట్టు తెలిసింది. కేంద్రంపై పోరు నేపథ్యంలో.. వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై ప్రత్యక్ష మొదలుపెట్టిన సీఎం కేసీఆర్.. ఇటీవల కేంద్రం, బీజేపీ తీరుపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీపైనా మండిపడుతున్నారు. తాజాగా నాలుగు రోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ.. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ వైఫల్యాలను ఆయన ఎదురుగానే ఎత్తిచూపుతానని, తాను ఎవరికీ భయపడే రకం కాదనీ ప్రకటించారు. ఇలా ఘాటుగా విమర్శలు చేస్తూనే.. రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానికి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలుకుతానని ప్రకటించారు. కానీ శనివారం ప్రధాని పర్యటనలో స్వాగత బాధ్యతలను మంత్రి తలసానికి అప్పగించారు. మరోవైపు.. గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ సహా మంత్రులెవరూ హాజరుకాకపోవడంతో.. గవర్నర్‌తో విభేదాలు ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ప్రధాని స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలకు సీఎం దూరంగా ఉండనుండటం, అదే సమయంలో రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో సుమారు మూడు గంటల పాటు వేదికను పంచుకోబోవడం ఆసక్తిగా మారాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ ఒకే వేదిక పంచుకుని దాదాపు ఆరేళ్లు అవుతోంది. చివరిసారిగా 2016లో గజ్వేల్‌లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇరువురూ పాల్గొన్నారు. కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. 2020 నవంబర్‌లో మోదీ హైదరాబాద్‌కు వచ్చారు. కానీ కరోనా వ్యాప్తి, ఇతర పరిస్థితుల నేపథ్యంలో.. గవర్నర్‌గానీ, సీఎంగానీ ఎవరూ రావాల్సిన అవసరం లేదని ప్రధాని కార్యాలయం నుంచి ప్రత్యేక సమాచారం పంపించారు. హాకీంపేట ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో విమా నం దిగిన మోదీ.. నేరుగా భారత్ బయోటెక్ పరిశ్రమకు వెళ్లారు. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీకి సంబంధించి శాస్త్రవేత్తలతో మాట్లాడి అట్నుంచే తిరిగి వెళ్లిపోయారు. మోదీ షెడ్యూల్ ఇదీ.. ► ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం 2:10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా హెలికాప్టర్లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు వెళతారు. సాయంత్రం 4:15 వరకు స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్రిశాట్ నూతన లోగోను ఆవిష్కరిస్తారు. తర్వాత శనగ వంగడాల క్షేత్రాన్ని పరిశీలిస్తారు. ► సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి చేరుకుంటారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక.. యాగశాలలో పూర్ణాహుతి, విశ్వక్సేన ఇష్టి హోమంలో పాల్గొంటారు. తర్వాత దివ్యక్షేత్రాలను, రామానుజుల బంగారు విగ్రహం ప్రతిష్టాపన స్థలాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం 6.15 గంటల నుంచి రామానుజుల భారీ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఆవిష్కరిస్తారు. సుమారు 7 గంటల సమయంలో ప్రసంగం చేస్తారు. అనంతరం రుత్విక్కుల నుంచి వేదాశీర్వచనం, చినజీయర్ స్వామి నుంచి మహా ప్రసాదాన్ని అందుకుంటారు. రాత్రి 8:25 గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. -
Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. మూడో రోజు ఫోటోలు
-
దేశానికే గర్వకారణం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భక్తి ఉద్యమంలో రామానుజాచార్యులు గొప్ప విప్లవం తీసుకొచ్చారని, మానవులంతా సమానమంటూ.. సమానత్వం కోసం వెయ్యేండ్ల క్రితమే ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. భగవంతుని దృష్టిలో మనుషులంతా సమానమేనని చాటిచెప్పిన శ్రీరామానుజాచార్యుల విరాట్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం హైదరాబాద్‌కే కాదు దేశానికే గర్వకారణమని చెప్పారు. చినజీయర్ స్వామి వారి అశేష అనుచరులు, అభిమానులు ఇందుకోసం మహాద్భు త కృషి చేశారని కొనియాడారు. జీయర్ బోధనలకు తెలంగాణ కేంద్రం కావడం గొప్ప విషయమని అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరం వేదికగా ప్రారంభమైన శ్రీరామానుజ సహస్రాబ్ది మహోత్సవాలకు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి హాజరయ్యారు. 5వ తేదీన ఇక్కడికి ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా అక్కడ భద్రత, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సామాజిక సమతను కొనసాగిస్తాం ప్రతిష్టాత్మకమైన ఈ దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక సాంత్వన, మానసిక ప్రశాంతత చేకూరుస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం పర్యాటకులకే కాకుండా మానసిక ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ప్రశాంత నిలయంగా మారుతుందని అన్నారు. ఆ మహామూర్తి బోధనలు వెయ్యేళ్ల తర్వాత మళ్లీ ప్రాచుర్యంలోకి రావడం అవి మరో వెయ్యేళ్లపాటు ప్రపంచవ్యాప్తం కానుండటం మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. అనతి కాలంలోనే ఈ ప్రాంతం ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విశేష ప్రాచుర్యం పొందు తుందన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను ఏకతాటిపైన నడిపించే సామాజిక సమతను కొనసాగిస్తామని చెప్పారు. చినజీయర్ స్వామి బోధనలను ప్రతి ఒక్కరు అనుసరించాలని సూచించారు. ఈ మహా ఉత్సవానికి హాజరయ్యే భక్తులకు తమ కుటుంబం తరఫున పండ్లు, ఫలాల ప్రసాదాన్ని అందజేస్తామని తెలిపారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, మనుమడు హిమాన్షు ఉన్నారు. కుటీరానికి ఆహ్వానించి..ఆశీర్వదించి శ్రీరామనగరం సందర్శనకు వచ్చిన సీఎం కేసీఆర్ దంపతులను త్రిదండి చినజీయర్ స్వామి తన కుటీరానికి ఆహ్వానించారు. ఆశీర్వచనాలు అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సక్రమంగా చూసుకుంటోందని తెలిపారు. సమారోహానికి వస్తున్న భక్తులకు స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు అందుతోందని చెప్పారు. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక, ధార్మిక విషయాల పట్ల ఇష్టాన్ని పెంచుకోవడం మంచి అలవాటని కల్వకుంట్ల హిమాన్షురావును చినజీయర్ స్వామి అభినందించారు. ‘తాత కేసీఆర్ నుంచి ఆధ్యాత్మిక భక్తి ప్రపత్తులను పుణికి పుచ్చుకున్నావు..’ అంటూ ప్రశంసించారు. సీఎం పర్యటనలో ముఖ్యాంశాలివే – సాయంత్రం 4 గంటలకు సీఎం శ్రీరామనగరం చేరుకున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. – భద్రవేదికపై ఆశీనులైన భగవత్‌రామానుజుల వారి విరాట్ సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. చిన జీయర్‌తో కలిసి ప్రదక్షిణలు చేశారు. – అగ్ని ప్రతిష్ట, హోమాలు ప్రారంభమైన నేపథ్యంలో అగ్ని ప్రతిష్ట ప్రారంభ సూచికగా 1,260 కేజీల బరువుతో, నాలుగున్నర అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగంటను మోగించి గంటానాదం చేశారు. – రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించబోయే బంగారు ప్రతిమ ప్రతిష్ట స్థలాన్ని పరిశీలించి, రామానుజ జీవిత చరిత్రను తెలియజేసే పెయింటింగ్స్‌ను తిలకించారు. 108 దివ్య దేశాల సమూహం, వాటి ప్రాముఖ్యతను సీఎంకు చినజీయర్ వివరించారు. – రామానుజుల జీవిత చరిత్రను తెలియజేస్తూ రూపొందించిన లఘుచిత్రాన్ని సీఎం వీక్షించారు. – మైహోం అధినేత జూపూడి రామేశ్వరరావు, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్‌రావు, ఏపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు కూడా సీఎం వెంట ఉన్నారు. -
Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. రెండోరోజు ఫోటోలు
-
ముచ్చింతల్‌లో సీఎం కేసీఆర్.. సమతామూర్తి స్పూర్తి విగ్రహ పరిశీలన
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌కు చేరుకున్నారు. ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సమతా మూర్తి కేంద్రాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం కేసీఆర్. చిన్నజీయర్ స్వామితో కలిసి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహం చుట్టూ కేసీఆర్ తిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ముచ్చింతల్ గ్రామంలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 తేదిన ప్రారంభమైన ఈ మహోత్సవం ఫిబ్రవరి 14 వరకు కొనసాగనున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనారాయణయాగం నిర్వహించారు. యాగశాలలో అగ్నిహోత్రం ఆవిష్కరణ, 1035 కుండలాల్లో శ్రీ లక్ష్మీ నారాయణ హోమం జరిగింది. ఈ హోమాన్ని ఏక కాలంలో ఐదు వేల మంది రుత్వికులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, రుత్వికులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలలో పాల్గొన్న సీఎం శ్రీ కేసీఆర్ https://t.co/n4lKbEcxjw — Telangana CMO (@TelanganaCMO) February 3, 2022 -
భద్రతా వలయంలో శ్రీరామనగరం.. అడుగడుగునా పోలీసు నిఘా
సాక్షి, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్న సందర్భంగా ఎస్పీజీ అధికారులు బుధవారం ఉదయం విగ్రహ ప్రాంగణంతో పాటు యాగశాలను సందర్శించారు. ఎస్పీజీ డీఐజీ నవనీత్‌కుమార్ రాష్ట్ర పోలీసులతో కలిసి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన భద్రత సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూం సమతామూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందు పార్కింగ్ ఏరియాకు ఎదురుగా ఉన్న భవనంలో పోలీసుల కమాండ్ కంట్రోల్ రూంను పూర్తి స్తాయిలో సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి పోలీసుల భద్రత ఏర్పాట్లు, ఇతర సమాచారాలన్నింటికి కూడా కమాండ్ కంట్రోల్ రూం పనిచేయనుంది. ఎస్పీజీతో పాటు ఆక్టోపస్, ప్రత్యేక కమాండోలు భద్రత కోసం రంగంలోకి దిగారు. ఇప్పటికే సమతామూర్తి ప్రాంగణంతో పాటు యాగశాల పరిసరాల్లో వీరు నిరంతరం నిఘా కాస్తున్నారు. ఉత్సవాలకు ప్రత్యేక అశ్వాలు సమతామూర్తి సహస్రాబ్ధి సమరోత్సాహ వేడుకల్లో పూజా కార్యక్రమాల్లో దేవతా మూర్తుల రథోత్సవం వేళ ముందుగా నడిపించేందుకు ఏపీలోని కడప వ్యాసాశ్రమం నుంచి రెండు శ్వేత రంగు అశ్వాలను తీసుకొచ్చారు. రంగ, గోధ అనే పేర్లుగల ఈ అశ్వాలను ఆశ్రమంలో దేవతామూర్తుల బయటికి తీసుకొచ్చే సమయంలో ముందుగా నడిపిస్తుంటారు. వీటితో పాటు చిన్న జీయర్ ఆశ్రమంలో ఉన్న మరో అశ్వం యతి కూడా ఉత్సవాల్లో పాల్గొననుంది. ఈ అశ్వాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సమరోత్సాహ భక్తి ‘స్వీయ చిత్రం’ సమతామూర్తి సమారోహ వేదికలో స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడానికి వచ్చిన మహిళలు వీరు.. యాగశాల వద్ద నరసింహస్వామి అవతారంలో ఓ వ్యక్తి తిరుగుతుండడంతో కొందరు వలంటీర్లు ఆయనకు దండం పెడుతుండగా.. మరికొందరు మహిళలు సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యం. (క్లిక్: 13 తర్వాతే సందర్శకులకు అనుమతి) యాగశాలకు చేరుకున్న ఛత్రీలు.. యాగశాల వద్దకు బుధవారం కూడా వరుసగా ప్రత్యేకంగా తయారు చేయించిన ఛత్రీలు చేరుకున్నాయి.. వాటిని తయారు చేసిన కార్మికులు కొందరు యాగశాల వరకు మోసుకుంటూ తీసుకెళ్లారు. (చదవండి: వెయ్యేళ్ల సమతాస్ఫూర్తి.. రామానుజ సమతా కేంద్రం నిర్మాణం..) టీటీడీ ప్రత్యేక సేవలు ముచ్చింతల్‌లో జరుగుతున్న సహస్రాబ్ధి సమారోహ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం తమ వంతు పాత్ర పోషిస్తోంది. ప్రాంగణంలో తిరుమల తిరుపతి ప్రాసస్త్యం, తిరుమల నాడు–నేడు వ్యత్యాసాలు తెలిపే పలు ఛాయా చిత్రాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. చిత్ర ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. విభిన్న రకాల కార్యక్రమాల్లో సహకరించేందుకు తితిదే సిబ్బంది 35 మంది రెండు వారాల పాటు ఇక్కడే ఉండనున్నారు. వీరు కాక దాదాపు 500 మంది వేద పారాయణం చేసేవారు, మ్యూజిక్ కాలేజ్ నుంచి ఆర్టిస్టులు, హరికథ కళాకారులు, మంగళవాద్యాలు మోగించే కళాకారులు 15 మంది వచ్చారు. వీరి కార్యకలాపాలను తితిదే తెలంగాణ ప్రాజెక్ట్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. ఆకట్టుకున్న శోభాయాత్ర సమతా కేంద్రంలో బుధవారం ఉదయం తొలిరోజు నిర్వహించిన శోభాయాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ చంద్ర, జై హనుమాన్ నినాదాలతో వేలాది మంది భక్తులు, పండితులు పాల్గొన్న ఈ యాత్ర కనుల పండుగగా సాగింది. ఈ యాత్రకు త్రిదండి చిన జీయర్‌స్వామి సారథ్యం వహించారు. వందలాదిగా రుత్వికులు వేద మంత్రోచ్చారణలు చేస్తూ ఏడుగురు పూజ్య జీయర్లను అనుసరించారు. భక్తుల భజనలకు తోడుగా కోలాట నృత్యాలు ఆహ్లాదపరిచాయి. అనంతరం వాస్తు పూజ, పుణ్యహవచనం జరిగాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సహస్రాబ్ది సమారోహం.. నమో నారాయణాయ!
రంగారెడ్డి జిల్లా/ శంషాబాద్/ శంషాబాద్ రూరల్: ఐదువేల మంది రుత్వికులు.. ఒకే సమయంలో వేద మంత్రోచ్ఛారణ. మధ్య ... తెలుగు రాష్ట్రాలకు చెందిన 2200 మంది కళాకారుల కళారూపాల ప్రదర్శనలతో ఆ ప్రాంతం పులకించి పోయింది. జై శ్రీమన్నారాయణ.. జైజై శ్రీమన్నారాయణ నామ స్మరణలతో ఆ ప్రాంతం మారుమోగి పోయింది. సమతామూర్తి వేడుకల ప్రాంగణం భక్తులు, కళాకారులతో తొలిరోజు బుధవారం అత్యంత శోభాయమానంగా మారింది. పుట్టమన్ను సేకరణతో.. అంకురార్పణ కార్యక్రమం పుట్టమన్ను సేకరణతో ప్రారంభమైంది. దివ్య సాకేతాలయం సమీపంలో పుట్ట నుంచి రుత్వికులు మట్టిని సేకరించారు. ఉత్సవ మూర్తితో పాటు పుట్టమన్నును భాజా భజంత్రీలతో ప్రధాన యాగశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ మట్టిని అప్పటికే అక్కడ సిద్ధం చేసిన కుండలాల్లో నవ ధాన్యాలతో పాటు సమర్పించారు. ఈ సమయంలోనే రుత్వికుల వేద మంత్రోచ్ఛారణ, భక్తుల నోట నారాయణ జపాలతో ఆ ప్రాంతం భక్తి పారవశ్యం లో మునిగిపోయింది.12 రోజుల పాటు జరగనున్న హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనే రుత్వికులకు రక్షా సూత్రాలు(కంకణాలు), వస్త్రాలు అందజేయగా.. వారు దీక్షకు కంకణబద్ధులయ్యారు. ఆకట్టుకున్న సాంస్కృతిక యాత్ర వివిధ ప్రాంతాల నుంచి రుత్వికులు, భక్తులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు గాను పెద్దసంఖ్యలో కళాకారులు శ్రీరామనగరానికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు కిన్నెర వాయిద్య కళాకారులు కూడా పన్నెండు మెట్ల కిన్నెరలను వాయించడానికి ఇక్కడకి చేరుకున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆరువందల మంది మహిళలు కోలాటం ఆడుతూ తీసుకొచ్చిన బోనాల జాతర అందరినీ ఆకట్టుకుంది. చినజీయర్ స్వామి సైతం ప్రత్యేకంగా బోనాల సందడిని యాగశాల వద్ద వీక్షించారు. చిన్నారి కళాకారుల ప్రత్యేక నృత్యాలు, ఆటపాటలు, సుమారు రెండు వందల మందితో డోలు వాయిద్యాలు, డప్పు దరువులతో పాటు ప్రత్యేక కోలాటాలతో ప్రధాన ఆలయం నుంచి యాగశాల వరకు సాంస్కృతిక యాత్ర చేప ట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడి విశేషాలతో కూడిన చిత్రాల గ్యాలరీని యాగశాల సమీపంలో ఏర్పాటు చేసింది. ఇందులో తిరుమల వెంకటేశ్వరుడికి సంబంధించిన కళాకృతులు, చిత్రాలు కొలువుదీరాయి. దీనికి పక్కనే భక్తులకు వినోదాన్ని పంచే సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నేడు అగ్ని మథనం.. ఉత్సవాల రెండోరోజులో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకు యాగశాలలో ‘అగ్నిమథనం’తో హోమ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మథనంలో భాగంగా ఐదువేల మంది రుత్వికులతో పాటు యాజమాన్యులు వారికి కేటాయించిన యాగశాలల్లో ఆసీనులు కానున్నారు. సెమీ దండం, రావి దండం కర్రలతో మథించగా వచ్చిన అగ్నిని 144 యాగశాలల్లోని 1,035 కుండాలలో నిక్షిప్తం చేసి హోమాలను ఆరంభిస్తారు. అనంతరం అరణి మథనం, అగ్ని ప్రతిష్ట, సుదర్శనేష్టి, వాసుదేవనేష్టి, పెద్ద జీయర్‌స్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రవచన మండపంలో వేద పండితుల ప్రవచనాలు కొనసాగించనున్నారు. విద్యుత్ అంతరాయంతో... సహస్రాబ్ది సమారోహంలో కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్‌శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక లైన్లనూ ఏర్పాటు చేశారు. అయినా మొదటి రోజు కోతలు తప్పలేదు. మధ్యాహ్నం సుమారు అరగంట పాటు కరెంటు సరఫరా నిలిచిపోవడంతో రుత్వికులు, సేవకులు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, ఉద్యోగులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇదిలా ఉండగా బుధవారం స్వల్ప అస్వస్థతకు గురైన సేవకులు, రుత్వికులకు ఇక్కడ వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించారు. సహస్రాబ్ది సమారోహంలో నేడు ► ఉదయం 8.30 గంటలకు దుష్ట నివారణ కోసం శ్రీ సుదర్శనేష్టి, సర్వాభీష్ట సిద్ధికై వాసుదేవేష్టి, అష్టోత్తర శతనామ పూజ ► 9 గంటలకు యాగశాలలో ‘అగ్నిమథనం’తో హోమ కార్యక్రమం ప్రారంభం ► 12.30 గంటలకు పూర్ణాహుతి ► సాయంత్రం 5గంటలకు సాయంత్రపు హోమం.. 5.30 గంటలకు చినజీయర్ స్వామి థాతి పంచకం సహితంగా శ్రీ విష్ణు సహస్ర నారాయణ పారాయణం ► రాత్రి 9.30 గంటలకు ఇష్టిశాలలో పూర్ణాహుతి ► ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రవచన మండపంలో పెద్ద జీయర్ స్వామి ఆరాధన, చిన జీయర్‌స్వామి, రామచంద్ర జీయర్‌స్వామి ఉపదేశాలు ఉంటాయి. ప్రధాన వేదికపై కర్ణాటక సంగీత కచేరీ, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, భజనలు, పాలపర్తి శ్యామలానంద్ ప్రసాద్, నేపాల్ కృష్ణమాచార్య, అహోబిల జీయర్‌స్వామి ప్రవచనాలు ఉంటాయి. పోస్టల్ కవర్ ఆవిష్కరణ లోకానికి సమతాస్ఫూర్తిని చాటిన శ్రీ భగవద్రామానుజుల వారి చిత్రంతో పోస్టల్ శాఖ రూపొందించిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ పోస్టల్ కవర్, స్టాంపును చినజీయర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తపాలా శాఖ రాష్ట్ర డైరెక్టర్ వి.వి.సత్యనారాయణరెడ్డి, మైహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. -
Statue of Equality: శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకలు
-
Statue Of Equality: 13 తర్వాతే సందర్శకులకు అనుమతి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహానికి అంకురార్పణ జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తరలివచ్చే సందర్శకులను సమతామూర్తి ఆశీనులైన భద్రవేదికకు చేరుకునే ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన 108 మెట్లలో మొదటి మెట్టు వరకు అనుమతించనున్నారు. అటు నుంచి యాగశాలకు ఆనుకుని ఉన్న ప్రవచన మండపానికి అనుమతించనున్నారు. ఇక్కడి నుంచే యాగశాలను దర్శించుకునేందుకు సందర్శకులకు అవకాశం కల్పిస్తారు. భద్రవేదికపై ఆశీనులైన 216 అడుగుల ఎత్తైన భగవద్రామానుజాచార్యుల విగ్రహాన్ని ఈ నెల 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి మూడో అంతస్తుపై ఉన్న ప్రధాన విగ్రహం వరకు సందర్శకులను అనుమతించనున్నారు. భద్రవేదిక మొదటి అంతస్తులో ఉన్న 120 కేజీల సువర్ణమయ మూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 13న తొలి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి 54 అంగుళాలు ఉన్న సువర్ణమయ నిత్య ఉత్సవమూర్తిని వీక్షించేందుకు సందర్శకులకు అనుమతించనున్నారు. అప్పటి వరకు వీరంతా బయటి నుంచే వీక్షించి వెళ్లాల్సి ఉంది. అంతేకాదు ఈ ప్రాంగణంలోని 108 దివ్యదేశాల ఆలయాల్లో ప్రతిష్టించిన దేవతామూర్తుల విగ్రహాల వీక్షణ, ఆరాధనకు కూడా ఆ తర్వాతే అనుమతించనున్నారు. అప్పటి వరకు ఆయా ఉత్సవమూర్తులను బయటి నుంచే సందర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ శ్రీరామానుజాచార్యల విగ్రహావిష్కరణకు ఈ నెల 5న ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ మంగళవారం శ్రీరామనగరాన్ని సందర్శించారు. రోడ్లు, విద్యుత్, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షించారు. ఆయా విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం ఆయన కేంద్ర భద్రతా బలగాలతో సమావేశం కానున్నారు. ప్రారంభానికి ముందే అవస్థలు ఇదిలా ఉంటే ఉత్సవాల ప్రారంభానికి ముందే రుత్వీకులు, వలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, సందర్శకులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంగణానికి 15 వేల మందికిపైగా చేరుకోగా, పూజా కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గ్రేటర్ జిల్లాల నుంచి రోజుకు సగటున 50 వేల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. వాలంటీర్లు, రుత్వీకులు, ప్రభుత్వ ఉద్యోగులను అంచనా వేయడంలో నిర్వాహకులు ఇప్పటికే కొంత విఫలమయ్యా రు. ఆయా నిష్పత్తి మేరకు అన్నప్రసాదాలను తయారు చేసినా వారికి అందజేయక పోవడంతో ఇక్కడికి వచ్చిన వారికి పస్తులు తప్పడం లేదు. భారీ స్వాగత తోరణాలు వేడుకలకు వచ్చే అతిథులకు ఆహ్వానం పలుకుతూ నిర్వాహకులు ఆయా మార్గాల్లో భారీ కటౌట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రధాన మార్గాలను సర్వంగసుందరంగా తీర్చిదిద్దా రు. అన్ని మార్గాల్లోనూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు) -
ముచ్చింతల్: శ్రీరామనగరానికి సిటీ బస్సులు
సాక్షి, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో శ్రీరామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలకు శ్రీరామనగరం తరలివెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వేడుకలను దృష్టిలో ఉంచుకొని బస్సులను ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన భక్తులు ముచ్చింతల్‌కు రాకపోకలు సాగించేలా ఉదయం నుంచి రాత్రి వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అన్ని రూట్లలో ఉదయం 6, 7, 8 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు) బస్సుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులను ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేసేందుకు ముచ్చింతల్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ మేరకు ప్రతి గంటకు ఒక బస్సు అందుబాటులో ఉండేవిధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. పోలీసుల ఆధీనంలో ప్రధాన మార్గాలు పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్షించారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన పోలీసు అధికారులతో సమావేశయ్యారు. ఎవరెవరు? ఎక్కడెక్కడ? విధులు నిర్వహించనున్నారు? తదితర అంశాలపై సమీక్షించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గం సహా బెంగళూరు జాతీయ రహదారి మార్గాలను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఎక్కడిక్కడ భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. (చదవండి: 7500 మంది పోలీసులతో భారీ బందోబస్తు) -
Statue Of Equality: 7500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో సమతా మూర్తి సమారోహం వేడుకలకు 7500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎనిమిది విభాగాలుగా పోలీసులకు బాధ్యతలు కేటాయించారు. రెండు సెక్టార్లుగా ట్రాఫిక్ క్లియరెన్స్‌కు 1200 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. సమతామూర్తి ప్రాంగణంలో.. సమతామూర్తి విగ్రహ ప్రాంగణంలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో నలుగురు ఏసీపీల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో పన్నెండు మంది సీఐలు, 58 ఎస్సైలు, 218 మంది కానిస్టేబుళ్లు, ప్రత్యేక పోలీసులు 134, ఇతర 20 మంది ఉంటారు. యాగశాల వద్ద.. యాగశాల వద్ద 1682 మంది పోలీసులతో బందోబస్తుకు కేటాయించారు. ఇందులో డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, 12 మంది ఏసీపీలు, 57 మంది ఇన్స్పెక్టర్లు, 155 మంది ఎస్సైలు, 1214 మంది కానిస్టేబుళ్లు, 240 అదనపు పోలీసులను కేటాయించారు. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు) ప్రవచన మండపం వద్ద.. ప్రవచన మండపం వద్ద 157 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో ఓ డీసీపీ అధికారితో పాటు ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 28 మంది ఎస్సైలు, 88 కానిస్టేబుళ్లు, 36 మంది ప్రత్యేక పోలీసులు ఉంటారు. భోజన శాల వద్ద.. భోజన శాల వద్ద ఓ డీసీపీ స్థాయి అధికారితోపాటు నలుగురు అదనపు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలు, 8మంది ఇన్స్పెక్టర్లు, 24 మంది ఎస్సైలు, 124 మంది కానిస్టేబుళ్లు, 120 ప్రత్యేక పోలీసులను కేటాయించారు. రూట్ల వారిగా.. ఆశ్రయానికి వచ్చిపోయే రహదారులను 17 రూట్లుగా విభజించారు. ఆయా రూట్లలో 1200 మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు. ట్రాఫిక్ పర్యవేక్షణ ఇలా.. వీవీఐపీలు, వీఐపీలు, కీలక ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులతో పాటు దేశ ప్రధాని నరేంద్రమోదీ తదితరులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సెక్టార్ల వారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సహస్రాబ్ది ఉత్సవాలకు మాధవ సేవకులు రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో సేవలందించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో సేవకులు తరలివచ్చారు. శ్రీరామనగరంలో బుధవారం నుంచి ఈ నెల 14 వరకు జరుగనున్న ఉత్సవాల్లో సేవలు అందించేందుకు సుమారు 8 వేల మంది సేవకులు తరలివచ్చారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో సేవకులకు బాధ్యతలు అప్పగించారు. యాగశాల, భోజనశాల, రవాణా, పూజా, వైద్య, తదితర 18 రకాల సేవా విభాగాల్లో వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. రుత్వికుల సందడి.. ఇక్కడ యాగ శాలలో నిర్వహించే హోమాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి రుత్వికులు ఇక్కడికి చేరుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ పూర్తి అయిన తర్వాత హోమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. (చదవండి: అసమానత వైరస్.. సమతే వ్యాక్సిన్) -
Statue Of Equality: రామానుజ సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు
భగవద్రామానుజులవారు భూమిపై అవతరించి ఇప్పటికి వెయ్యేళ్ళు దాటింది. సమాజంలో అసమానతలు తలెత్తి ఎవరికి వారు వేరు వేరంటూ కొందరిని దూరం పెడుతూ... భగవంతుని చేరే మార్గం కొందరి దగ్గరే ఉంచుకుని.. వేరెవరికీ ఇది తెలియ రాదనే కట్టుబాట్లు చాలా కఠినంగా అమలవుతున్న ఆ కాలంలో.. మిగిలినవారంతా భగవంతుని చేరుకోవడానికి నేనొక్కడినీ నరకానికి పోయినా పర్లేదని అప్పటి కట్టుబాట్లను దాటి మానవులందరిని భగవంతుని వద్దకు చేర్చే అష్టాక్షరీ మహామంత్రాన్ని బహిరంగంగా గోపురమెక్కి అందరికీ చెప్పిన భగవదవతారం శ్రీమద్రామానుజులు. నాటి వారి స్ఫూర్తిని నేటికీ నిలుపుతూ వారు పంచిన సమతను మరోసారి ప్రపంచానికి తెలియజేయాలనీ.. మానవులందరూ వారి బోధనలను తెలుసుకోవాలనీ... ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో నడవాలని.. మరో వెయ్యేళ్ళు రామానుజులవారిని మనమంతా గుర్తుంచుకోవాలని రామానుజ సహస్రాబ్ది సందర్భంగా వెలసినదే సమతా కేంద్రం. ఈ సందర్భంగా హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో రామానుజ సమతా కేంద్రం నిర్మాణ విశేషాలు.. రామానుజులవారి జీవిత విశేషాలు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి ఎన్నో ఏళ్ల కల నేడు నిజమైంది. నేటినుంచి ‘రామానుజ సహస్రాబ్ది సమారోహం’ ప్రారంభం కానుంది. పన్నెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి, దేశప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలైన పాలకవర్గం, మరోవైపు ఆధ్యాత్మిక సంప్రదాయానికి సంబంధించిన అనేకమంది పీఠాధిపతులు.. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. విహంగ వీక్షణ దివ్యవిమానశిఖరాలు.. ఎత్తైన గోపురాలు.. గొప్ప శిల్పకళాశోభితమైన మండపాలు... అనేక ప్రాచీన శిల్పశైలీసంపన్నమైన స్వాగతతోరణాలు.. రామానుజ ఆచార్యాభిషేకం చేసే లీలాజలనీరాజనం (వాటర్ ఫౌంటెన్)... పచ్చటి ఉద్యానవనాలు... సర్వతోభద్ర మండలాకృతిలో రూపొందించిన 108 దివ్యదేశ దేవాలయాలు...ఆచార్య పురుషుని చేరుకునే ఉజ్జీవన సోపానమార్గం... ఆపై భద్రవేదిపై. పద్మాసనంపై ఆసీనులై ప్రసన్న మందస్మిత వదనంతో దర్శనమిచ్చే భగవద్రామానుజులవారి దివ్య విగ్రహం దర్శించినవారి మనస్సు ఆనందంతో ఉప్పొంగక మానదు. ప్రవేశద్వారం ఉన్నతమైన రామానుజులవారి విగ్రహాన్ని దర్శించేందుకు వచ్చిన భక్తులు ముందుగా ప్రవేశద్వారం వద్ద ఉన్న శిల్పకళను చూసి అచ్చెరువొందుతారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రవేశద్వారం నుండి నిష్క్రమణ ద్వారం వరకు ఉన్న శిల్పకళను పరిశీలనగా చూడాలంటే రెండు కళ్లూ సరిపోవు. వాటి విశేషాలను తెలుసుకోవడానికి ఒకరోజు చాలదు. ఇందులో భారతీయ ప్రాచీన శిల్పకళా వైభవమంతా కొలువుతీరింది. ఒకవైపు ప్రవేశద్వారం.. మరోవైపు నిష్క్రమణద్వారం.. వీటి మధ్యలో ఉన్న అనేక మండపాలు.. స్వాగతతోరణాలు.. మొదలైనవాటి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. విజయనగరనిర్మాణమైన రాతిరథాన్ని గుర్తుకు తెచ్చే రెండు శిలానిర్మిత రథాలను రెండు ఏనుగులు లాగుతున్న దృశ్యం.. వైష్ణవసంప్రదాయంలో భక్తికి ప్రతీకలుగా నిలిచిన గరుడ, హనుమ విగ్రహాలు ఇరువైపులా ఎత్తైన మండపాల్లో కొలువుతీరాయి. హంసద్వారం.. యాళిద్వారం... వాటిపై కాకతీయ స్వాగతతోరణాలను నిర్మించిన తీరు ఈ నేలపై పరిఢవిల్లిన ఒకప్పటి సామ్రాజ్య వైభవాన్ని గుర్తుకు తెస్తుంది. దక్షిణాది, ఉత్తరాది శిల్పౖ శెలులను గుర్తుకు తెచ్చే అనేక విమానశిఖరాలు.. ఆలయగోపురాలు ఇక్కడ కనిపిస్తాయి. ఒక్కసారి ఆమూలాగ్రం ఈ వరుసను పరికిస్తే భారతీయ ప్రాచీన శిల్పకళా వైభవం కళ్లముందు నిలుస్తుంది. భూమిపై ధర్మానికి ఆపద కలిగినప్పుడు దుష్టశిక్షణ.. శిష్టరక్షణకు చేయడానికి భగవంతుడు అవతరిస్తాడు. రామానుజులవారు తమిళనాడులో శ్రీపెరంబుదూరులో పింగళనామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం నాడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన ఆర్ద్రానక్షత్రంలో రామానుజాచార్యుడు జన్మించాడు. ఆయన తండ్రిపేరు ఆసూరి కేశవ సోమయాజి, తల్లిపేరు కాంతిమతి. సమతామార్గం భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అందరూ మోక్షం పొందడానికి అర్హులే అని చాటి చెప్పిన మహనీయుడు శ్రీమద్రామానుజులు. అందుకే ఆయన దేవుని దరిచేర్చే అష్టాక్షరీమహామంత్రాన్ని అందరికీ వినిపించేలా చెప్పారు. అందరూ సమానమేనని చాటారు. ప్రతి మానవునిలో మాధవుడు కొలువు దీరాడని నిరూపించారు. ఆచార్యుల ఆశయ వారసుడు వైష్ణవ సంప్రదాయంలో పన్నెండు మంది ఆళ్వార్లు ముఖ్యమైనవారుగా పరిగణింపబడుతున్నారు. వీరిలాగే అనేకమంది గురువులు విష్ణుభక్తిని సమాజంలో నెలకొల్పడానికి పాటుపడ్డారు. ఆ కోవలో యామునాచార్యులు ముఖ్యమైన గురుస్థానాన్ని పొందారు. 1042 లో వారు పరమపదించారనే వార్త తెలుసుకొని, వారు వారి జీవితకాలం లో చేయాలనుకుని కలగన్న మూడు కోర్కెలను తీరుస్తానని రామానుజులవారు ప్రతినబూని వాటిని నెరవేర్చారు. యామునాచార్యులవారి వారసత్వాన్ని నిలబెట్టారు. గురువుకే గురువు శ్రీరామానుజాచార్యులవారు పదహారు సంవత్సరాల వరకు శ్రీపెరంబుదూరులోను, ఆ తర్వాత ఎనిమిదేళ్లపాటు తిరుప్పుట్కుళిలోను, పదేళ్లపాటు కంచిలోను వేదాంత విద్యను అధ్యయనం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే అమేయ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. యాదవప్రకాశులనే వేదాంతగురువు పాఠం చెప్తూ విష్ణునేత్రాలను వర్ణిస్తూ వాటికి వింత పోలికలను పోలుస్తూ విచిత్ర ఉపమానాలిస్తున్నప్పుడు రామానుజులవారు అది తప్పని చెబుతూ ‘సూర్యుని రాకతో విచ్చుకున్న తామరల్లా విష్ణునేత్రాలు ఒప్పుతున్నాయి’ అనే శంకరుల భాష్యాన్ని ఉదహరిస్తూ సరైన అర్థాన్ని చెప్పారు. ఇలాంటి సందర్భాలెన్నో. అంతా బ్రహ్మమా? బ్రహ్మమే అంతానా? సర్వం ఖల్విదం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యానికి జగత్తులో ఉన్నదంతా బ్రహ్మపదార్థమే కాని, వేరుకాదు అని అంతవరకూ పండితులు చెప్పిన విశ్లేషణను వ్యతిరేకిస్తూ.. జగత్తులోని అంశలన్నీ భగవంతుని శరీరాలు. అన్నింటిలోనూ భగవంతుని తత్త్వం ప్రకాశిస్తుంటుంది. అంతేకానీ అంశకు, భగవంతునికీ భేదంలేదని చెప్పడం సరికాదన్నారు. బ్రహ్మ అనంతుడంటే సరిపోతుంది కాని, అనంతమే బ్రహ్మ అవుతుందా? అనంతం అంటే అంతం లేనిది అని అర్థం. అంటే అది ఒక గుణాన్ని సూచిస్తుంది కానీ, భగవంతునికి పర్యాయపదం కాదు. సత్య, జ్ఞాన, అనంతాలు భగవంతుని సహజగుణాలు. అటువంటి పరమాత్మని కేవలం సత్యంగాని, జ్ఞానంగాని, అనంతంగాని పరిపూర్ణంగా చిత్రించలేవు కదా! నలుగురి మంచికోసం నరకానికైనా... కాంచీపురంలోనే పెరియనంబి నుండి దివ్యప్రబంధాన్ని, శ్రీశైలపూర్ణుల వద్ద దర్శన రహస్యాలను, వర రంగాచార్యుల నుండి వైష్ణవ దివ్యప్రబంధాలను అధ్యయనం చేశారు. గోష్ఠీపూర్ణులను ఆశ్రయించి వారు పెట్టే పరీక్షలకు తట్టుకుని తిరుమంత్రార్థ రహస్యాన్ని వారివద్దనే గ్రహించారు. ఈ మంత్ర రహస్యాన్ని విన్నవారంతా మోక్షం పొందుతారని గురువులు చెప్పిన ఫలశ్రుతిని గ్రహించారు రామానుజులు. ప్రయాస లేకుండా ప్రజలందరికీ మోక్షం కలిగించాలని ఒకనాడు గుడిగోపురమెక్కి అందరూ వినేలా ఆ మంత్రాన్ని ఉపదేశించారు. అది విన్న గోష్ఠీపూర్ణులవారు. ‘అనర్హులకు ఈ మంత్ర రహస్యాన్ని వివరిస్తే పాపం పొంది నువ్వు నరకానికి పోతావు!’ అని చెప్తే ‘అంతమందికి మేలు జరుగుతున్నప్పుడు నేనొక్కడినే నరకానికి వెళ్లినా పర్వాలేదు’ అని అన్నారు రామానుజులు. వారి గొప్ప మనస్సుకు గోష్ఠీపూర్ణులు ఎంతగానో మెచ్చుకుని. ‘నువ్వు నాకంటే గొప్పవాడివయ్యా!’ అని రామానుజలవారిని గౌరవించారు. రామానుజుల రచనలు – విశిష్ఠ కృతులు రామానుజులవారు శ్రీభాష్యమనే పేరుతో ప్రస్థానత్రయానికి భాష్యం రచించారు. వారు రచించిన శరణాగతి గద్యని ప్రతి నిత్యం పారాయణ చేస్తే తప్పకుండా మోక్షం లభిస్తుంది. శరణాగతిగద్య, శ్రీరంగగద్య, శ్రీవైకుంఠగద్య అనే మూడింటినీ గద్యత్రయం అంటారు. శ్రీవైష్ణవాలయాలలో పాంచరాత్రాగమోక్తంగా విశిష్ఠసేవలను, కైంకర్యాలను అందించేందుకు, శ్రీవైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ద్రవిడవేదం పట్ల అందరూ గౌరవ, ప్రపత్తులతో మెలిగేటట్లు విశిష్టాద్వైత వ్యాప్తి చేశారు. దేవుడు – జీవుడు రెండుగా లేరు. ఇద్దరూ ఒకటే అంటూ చెప్పేదే అద్వైతం (రెండుగా లేనిది). విశిష్టాద్వైతం అంటే ప్రకృతిని ఉపాయంగా చేసుకొని ఒక్కటిగా ఉండటం. ఈ మార్గాన్ని శ్రీరామానుజాచార్యులవారు బోధించారు. ఎవరైనా శరణాగతిమార్గం ద్వారా పరమాత్మను చేరుకోవచ్చని, ఆయనతో కలిసి ఒకటి గా ఉండవచ్చని తెలిపారు. అర్చామూర్తిని కొలిచి అర్చామూర్తిగా నిలిచి.. ఎందరో మహాత్ములు తమ చరమాంకంలో భగవంతునిలో లీనమైపోయారు. మరికొందరు సజీవసమాధి పొందారు. ఇంకొందరు దివ్యవిమానంలో ఆకాశమార్గాన దివ్యలోకాలు పొందారు. మరికొందరు దేవతా విగ్రహాలలో లీనమైపోయారు. అయితే తమ జీవితపర్యంతమూ అర్చామూర్తుల అర్చనాది కైంకర్యాలను, ఆలయసేవలను ఏమాత్రం లోటు లేకుండా ఆలయాలలో జీయర్ వ్యవస్థను బలోపేతం చేసి, అర్చామూర్తి ఆరాధనతో అందరూ పరమపదం చేరవచ్చని చాటిన భగవత్ రామానుజులవారు 1137 పింగళ నామ సంవత్సరం మాఘ శుద్ధ దశమినాడు పరమపదించి తన దేహాన్నే విగ్రహంగా మలచుకున్నారు. దానికి సాక్ష్యంగా నేటికీ ఆ విగ్రహం ‘తానాన తిరుమేని’ గా శ్రీరంగంలోని వసంతమంటపంలో దర్శనమిస్తుంది. లీలాజల నీరాజనం (డైనమిక్ ఫౌంటెయిన్) ప్రవేశద్వారం దాటి లోపలికి ప్రవేశించగానే ఎదురుగా ఒక వాటర్ ఫౌంటెయిన్ కనిపిస్తుంది. ఇది ఒక విశేషమైన నిర్మాణం. దీని చుట్టూ అష్టదళాకృతిలో నీటిని చిమ్ముతూ రెండు వరుసలలో తొట్లు ఉన్నాయి. దానికి మధ్యలో కింద వరుసలో సింహాలు, వాటిపై ఏనుగులు, దానిపై హంసలు ఉంటాయి. వాటిపై అష్టదళపద్మం లోపల రామానుజుల వారి విగ్రహం ఉంటుంది. సింహాలు తామసగుణానికి, ఏనుగులు రాజసగుణానికి, హంసలు సాత్విక గుణానికి ప్రతీకలుగా వాటిపై త్రిగుణాతీతుడైన భగవద్రామానుజులవారు పద్మాలు విచ్చుకుని నిర్ణీత సమయంలో సౌండ్ సిస్టమ్ ద్వారా నీరు పైకెగసి, మధ్యలో చుట్టూ తిరుగుతూ దర్శనం ఇస్తారు. సంప్రదాయ వాద్యాలతో ఏర్పాటు చేసిన ధ్వనితో, నీటి నాట్యంతో జరిగే విన్యాసం చూసిన భక్తులకు దివ్యానుభూతి కలుగుతుంది. ఉజ్జీవన సోపానాలు లీలాజల నీరాజనం దాటి ముందుకు సాగితే భద్రవేదిపై కొలువుతీరిన రామానుజుల దర్శనం చేసుకోవాలని వెళ్లే భక్తులకు ఉజ్జీవనసోపాన మార్గం దర్శనమిస్తుంది. మొత్తం మెట్ల సంఖ్య 108. భగవంతుని దివ్య నామావళి 108ని ప్రతీకగా తీసుకుని ఈ మెట్ల సంఖ్య నిర్ణయించారు. అటూ ఇటూ ఎండవేడిమి, వానతాకిడికి భక్తులు ఇబ్బంది పడకుండా పైన మండపాలు మొత్తం 18 ఉన్నాయి. వీటిని సోపాన మండపాలు అంటారు. భద్రవేది – బంగారు రామానుజులు రామానుజుల విగ్రహం ఉన్న వేదిక ఈ భద్రవేది. ఇది మూడంతస్తుల నిర్మాణం. కింద భాగంలో ప్రవచనమండపం ఉంది. మొదటి అంతస్తులో బంగారు రామానుజులవారు కొలువుతీరే శరణాగత మండపం ఉంది. దీని చుట్టూ స్తంభాలపై 32్ర బహ్మవిద్యల విగ్రహాలున్నాయి. ఈ రామానుజమూర్తి నిర్మాణం కోసం 120 కిలోల బంగారాన్ని వినియోగించారు. ఈ బంగారు రామానుజుల వారి విగ్రహాన్ని భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈనెల 13న ఆవిష్కరించనున్నారు. దానిపై అంతస్తులో లైబ్రరీ ఏర్పాటు కానుంది. ఈ భద్రవేది పొడవు 54 అడుగులు. చుట్టూ 108 దివ్యదేశాలు భద్రవేది చుట్టూ భారతదేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన 108 దివ్యదేశాలలో 92 క్షేత్రాలను పర్యటించి, ఆ ఆలయాలను పరిశీలించి అదేవిధంగా ఆలయం ఆకృతి, దేవతామూర్తులు ఉండేలా ఈ ఆలయాలను తీర్చిదిద్దారు. భూమిపై ఉన్న ఆలయాలు 106. 107 వది క్షీరసాగరం, 108వది పరమపదం. సర్వతోభద్ర మండలాకృతిలో ఉన్న ఈ ఆలయాల్లో మొదటి ఆలయం శ్రీరంగం కాగా చివరిది పరమపదం. -
మూర్తీ’భవించిన రామానుజ స్ఫూర్తి
శంషాబాద్ రూరల్: నేటి సమాజంలో పెరిగిపోతున్న అసమానతలను రూపుమాపడానికి, రామానుజుల స్ఫూర్తిని అందించడానికి సమతామూర్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి చెప్పారు. బుధవారం నుంచి జరుగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాల నేపథ్యంలో శాంతి భద్రతల కోసం వచ్చిన పోలీసులకు ఆయన ప్రవచనం చేశారు. రామానుజుల విశిష్టతను తెలియజేశారు. కూలీలు మొదలుకొని రైతుల, చిరు ఉద్యోగులు ఈ బృహత్తర కార్యక్రమానికి విరాళాలు ఇచ్చారన్నారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం చాలా ఉందన్నారు. సమారోహ ఉత్సవాలకు బుధవారం అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని విభాగాలతో సమన్వయంతో ముందుకు సాగాలని సిబ్బంది, అధికారులకు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ఘట్టానికి సుమారు 7 వేల మంది పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో నిమగ్నం కానున్నారు. ప్రధాన యాగశాల ఏర్పాట్లు పూర్తి రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాలకు ప్రధాన యాగశాలను సిద్ధం చేశారు. మరోవైపు సినీ చిత్ర కళాకారుడు ఆనంద్‌సాయి ఆధ్వర్యంలో ప్రవచన మండపంలో వేదికను అందంగా ముస్తాబు చేస్తున్నారు. రెండు వేల మంది సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ మండపం నుంచే ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు వారి ప్రసంగాలు, ప్రవచనాలు ఇవ్వనున్నారు. యాగశాల సమీపంలో ప్రభుత్వ వైద్యశాఖతో పాటు యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్య సేవల ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఏటీఎం సౌకర్యం కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. -
సమతాస్ఫూర్తికి ప్రాణప్రతిష్ట.. వైభవంగా అంకురార్పణ కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: దేశంలో భారీ ఆధ్యాత్మిక, ధార్మిక కేంద్రాల్లో ఒకటిగా భాసిల్లే స్థాయిలో రూపు దిద్దుకున్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభోత్సవానికి బుధవారం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జీయర్ స్వాములు, మఠాధిపతులు, ద్వైత, అద్వైతంలో పెద్దవారంతా పాల్గొన్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామనుజ జైస్వామి వారు కార్యక్రమ వైభవాన్ని తెలిపారు. మంగళ శాసనాలు అందించారు. శంషాబాద్ ముచ్చింతల్‌లోని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌స్వామి ఆశ్రమ ప్రాంగణంలో రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో 45 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ అద్భుత, దివ్య క్షేత్రం.. భక్తుల సందర్శనకు వీలుగా త్వరలో ప్రారంభం కాబోతోంది. 1,035 కుండాలతో కూడిన లక్ష్మీనారాయణ మహా యాగంతో వేడుకలను ప్రారంభిస్తున్నారు. తొలుత ఆ ప్రాంత భూమి పూజ, వాస్తు పూజ చేస్తారు. వివిధ సంప్రదాయా లను అనుసరించే 5 వేల మంది రుత్వికులు దీక్షధా రణ చేసి పూజల్లో పాల్గొంటారు. సాయంత్రం కుండల్లోని పుట్టమట్టిలో నవధాన్యాలను అలకటం ద్వారా అంకురార్పణ చేయనున్నారు. ఈ ఉత్సవాలు ఈ నెల 14 వరకు కొనసాగనున్నాయి. భారీ విగ్రహం.. 108 ప్రధాన క్షేత్రాలు 216 అడుగుల ఎత్తులో కూర్చున్న భంగిమలో దేశంలో తొలి, ప్రపంచంలో రెండోదిగా కీర్తికెక్కిన రామానుజుల భారీ పంచలోహ సమతామూర్తి విగ్రహం ఈ కేంద్రంలో ప్రధానాకర్షణగా నిలవ నుంది. భారీ విగ్రహమే కాకుండా వైష్ణవ సంప్రదా యంలో అత్యంత ప్రాధాన్యమున్న దివ్య దేశాలుగా పేర్కొనే దేశంలోని 108 ప్రధాన క్షేత్రాల నమూ నాలు ఇక్కడ నిర్మించారు. భారీ విగ్రహం దిగువన 120 కిలోల స్వర్ణమయ 54 అంగుళాల రామాను జుల అర్చామూర్తితో కూడి ఆలయం కూడా ఆకట్టు కోనుంది. ఈ బృహత్తర క్షేత్రంలో అడుగడుగునా ఆధునిక సాంకేతికతను వాడి సంతృప్తిదాయక క్షేత్ర సందర్భన అనుభూతి కలిగేలా రూపొందించారు. సమానత్వ స్ఫూర్తి చాటేలా.. వెయ్యేళ్ల కిందట ఎన్నో వైషమ్యాలు, వైరుధ్యాలు.. అంటరానితనం కరాళనృత్యం చేస్తున్న సమ యంలో ప్రాణికోటి అంతా ఒకటేనని, మనుషుల మధ్య తేడాల్లేవని ప్రబోధించి సమానత్వ భావాలు నాటారు ఆచార్య రామానుజులు. మళ్లీ ఇప్పుడు అసమానతలు దేశ పురోగతికి కంటకంగా మారు తున్న నేపథ్యంలో ఆయన స్ఫూర్తి మరోసారి సమా జంలో పాదుకోవాల్సిన అవసరం ఉందంటూ చినజీయర్ స్వామి ఈ బృహత్ క్షేత్ర నిర్మాణానికి పూనుకున్నారు. దాతల విరాళాలతో ఆరేళ్లలోనే ఈ భారీ కేంద్రం రూపుదిద్దుకుంది. రామానుజులు అవ తరించి వెయ్యేళ్లు గడుస్తున్న నేపథ్యంలో శ్రీ రామా నుజ సహస్రాబ్ది సమారోహంగా ఈ క్రతువును ప్రారంభిస్తున్నారు. ఈ క్షేత్రాన్ని ఓ గుడిలా భావించకుండా, సమాజంలో సమానత్వ భావనల ను విస్తరించేలా చేసేందుకు రామానుజుల ప్రబోధాలు జనంలోకి వెళ్లేలా రూపొందించారు. ఆధునిక అగుమెంటెడ్ రియాలిటీ ఆధారిత 18 నిమిషాల లేజర్ షో ద్వారా నిత్యం భక్తుల మదిని తాకేలా ఏర్పాట్లు చేశామని జీయర్ స్వామి చెబుతున్నారు. సమాజానికి అందించిన అద్భుతమైన 9 గ్రంథాల సారాన్ని అందించేలా డిజిటల్ లైబ్రరీ, సమానత్వ భావాలను సమాజానికి అందించిన విశ్వవ్యాప్త సమతామూర్తుల వివరాలు అందించే హాల్ ఆఫ్ ఫేమ్‌ను సిద్ధం చేశారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 5న వేడుక లకు హాజరుకాను న్నారు. రామానుజుల భారీ సమతామూర్తి విగ్ర హాన్ని ఆవిష్కరించను న్నారు. 7న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, 8న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. 13న రాష్ట్రపతి ఉత్సవ మూర్తిని దర్శించుకోనున్నారు. అలాగే 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల కీలక నేతలు, ఆధ్యాత్మిక వేత్తలు, వివిధ పీఠాధిపతులు కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. భక్త జనం కూడా భారీగా తరలివస్తున్నారు. -
అసమానత వైరస్..సమతే వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న అసమానత ప్రస్తుతం ఎదుర్కొంటున్న కోవిడ్‌ను మించిన పెద్ద వైరస్ అని, దాన్ని అంతం చేసే వ్యాక్సిన్ రావాల్సి ఉందని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి చెప్పారు. సరిగ్గా వెయ్యేళ్ల క్రితం ఇంతకంటే భయంకరంగా ఉన్న అసమానతలు, అస్పృశ్యతలను రూపుమాపేందుకు సమానత్వ తత్వమనే వ్యాక్సిన్‌ను రామానుజులవారు ప్రయోగించారని, ప్రస్తుత జాఢ్యాన్ని నివారించేందుకు ఇప్పుడు మళ్లీ దాన్ని మనలో పాదుకొల్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాహ్య సమస్యలకు పరిష్కారం కనుగొంటున్న మనం అంతర్గతంగా మనసులను కలుషితం చేస్తున్న అంతరాలను తక్షణం దూరం చేసుకోవాల్సి ఉందని అన్నారు. ఇందుకోసమే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మనమందరం రామానుజుల తరహా ప్రేరణ పొందేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామన్నారు. సోమవారం సాయంత్రం శంషాబాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చినజీయర్ స్వామి మాట్లాడారు. సర్వప్రాణులు ఒకటేనని, అంతరాలు లేకుండా మనుషులంతా ఒకటేనని, స్త్రీ పురుష, వర్గ కుల మత ప్రాంత రంగు భేదం లేని సమాజం కోసం రామానుజులు పరితపించి అందించిన సమతా స్ఫూర్తిని చాటేందుకు ఏర్పాటు చేసిన రామానుజుల సహస్రాబ్ది సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. బంగారు శకం ఆరంభం తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలోనే అంటరానివారిని చేరదీసిన రామానుజుల స్ఫూర్తి చాలా కాలం కొనసాగిందని, బ్రిటిష్ వారు వచ్చాక అది విచ్ఛిన్నమైందని, ఇప్పుడు మళ్లీ రావాల్సిన అవసరం ఉందని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో వీరోచితంగా వ్యవహరించిన ఎంతోమందిని స్మరించుకునే అవకాశం ప్రస్తుత ప్రభుత్వం ఆజాదీకా అమృతోత్సవంలో కల్పించిందని, సరిగ్గా ఇదే సమయంలో రామానుజుల సహస్రాబ్ది వేడుకలు జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం కొత్త విద్యావిధానాన్ని తేబోతోందని, పరిస్థితి చూస్తుంటే మళ్లీ బంగారు శకం ఆరంభమైనట్టుగా తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మైహోం అధినేత రామేశ్వరరావు తదితరులు స్వామి వెంట ఉన్నారు. రేపట్నుంచీ కార్యక్రమాలు ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సశాస్త్రీయంగా, వైదికంగా దీనికి సంబంధించిన కార్యక్రమాలుంటాయని చెప్పారు. 5 వేల మంది రుత్వికులు 1,035 హోమకుండాలతో లక్ష్మీ నారాయణ యాగాన్ని నిర్వహించబోతున్నారన్నారు. లక్షన్నర కిలోల దేశవాళీ ఆవుపాలతో రూపొందించిన నెయ్యిని హోమద్రవ్యంగా వినియోగిస్తున్నామని, ఇది ఆవు పాలతో నేరుగా చేసిన నెయ్యి కాదని, పాలను పెరుగుగా మార్చిన తర్వాత తీసిన వెన్నతో చేసిన శ్రేష్టమైన నెయ్యిగా పేర్కొన్నారు. ఐదో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ 216 అడుగుల ఎత్తుతో ప్రతిష్టించిన రామానుజుల మహామూర్తిని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో శైవ, వైష్ణ, శాక్తేయ సంప్రదాయాల్లోని పండితులు పాల్గొంటున్నారన్నారు. అంటరానివారిగా ముద్రపడ్డ వారిని వెయ్యేళ్లనాటి కఠిన పరిస్థితుల్లోనే చేరదీసి సమానత స్ఫూర్తి నింపిన రామానుజుల వారి బాటలోనే తాము నడుస్తున్నామని, ఈ హోమం వద్ద కూడా కుల, వర్గ భేదాలు చూపటం లేదని స్పష్టం చేశారు. రామానుజులకు సమానత్వ నినాదంలో ప్రేరణ కలిగించిన 108 దివ్వ దేశాలుగా పేర్కొనే వైష్ణవ క్షేత్రాల నమూనాలను ఇక్కడ నిర్మించామని, ఆయా క్షేత్రాల్లో నిర్వహించే కైంకర్యాలు ఇక్కడా కొనసాగుతాయని, ఆ క్షేత్రాల్లో పూజలందుకున్న ఏదో ఒక విగ్రహం ఇక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. -
108 దివ్య దేశ దివ్యాలయాల ప్రతిష్ఠా మహోత్సవం (ఫోటోలు)
-
రామానుజ విగ్రహ కథా ‘చిత్రమ్’
రామానుజాచార్య సమతామూర్తి విగ్రహం చెంత కొలువుదీరేందుకు పెద్ద సంఖ్యలో వర్ణచిత్రాలు సిద్ధమవుతున్నాయి. శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఉన్న ప్రాధాన్యతకు తగ్గట్టుగా వీటిని తీర్చిదిద్దేందుకు పలువురు చిత్రకారులు వర్ణాలద్దుతున్నారు. ఒకేసారి ఇన్ని చిత్రాలు రూపుదిద్దుకోవడం, పెద్ద సంఖ్యలో ఆర్టిస్టులు భాగస్వామ్యం కావడం ఇదే తొలిసారి అని నగర చిత్రకారులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డిజిల్లా: వేల ఏళ్ల క్రితం నాటి రామానుజుల సందేశాన్ని ప్రపంచానికి చాటాలనే సదాశయంతో నెలకొల్పుతున్న సమతామూర్తి కేంద్రంలో వందలాదిగా వర్ణచిత్రాలు కొలువుదీరనున్నాయి. వీటిని కనువిందుగా చిత్రించే పనిలో రోజుకు కనీసం 50 మంది చిత్రకారులు భాగం పంచుకుంటున్నారు. కూకట్‌పల్లిలో ఉన్న జీవా గురుకులంలో దీని కోసం అతిపెద్ద ఆర్ట్ క్యాంప్ ఏర్పాటైంది. నేపథ్యానికి అనుగుణంగా చిత్రాలను గీసేందుకు నగరానికి చెందిన పలువురు చిత్రకారులు, ఆర్ట్ కాలేజీ విద్యార్థులు కూడా హాజరవుతున్నారు. సమాజంలో ఎన్నో రకాల మంచి మార్పులకు, సర్వ ప్రాణి కోటి సమానత్వానికి, ఆధ్యాత్మిక ఆలోచనల వ్యాప్తికి ఎనలేని కృషి చేసి చరిత్రలో నిలిచిపోయిన రామానుజాచార్యులు జీవితంలోని ముఖ్య ఘట్టాలే నేపథ్యంగా ఈ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. సందేశాత్మకంగా సాగే ఆయన జీవితాన్ని కళ్లకు కట్టేలా మొత్తంగా 350 చిత్రాలు ఈ ఆధ్యాత్మిక పరిసరాల్లో కొలువుదీరనున్నాయి. సమతామూర్తి ప్రాంగణంలో ఉన్న 40 స్తంభాలకు నలువైపులా వీటిని అమరుస్తారు. ఈ పెయింటింగ్స్ కొన్ని 3/3, కొన్ని 3/11 సైజులో తయారవుతున్నాయి. సమతామూర్తి విగ్రహం చెంత ఏర్పాటు చేసేందుకు చిత్రకారులు వేస్తున్న చిత్రాలు నెలాఖరు వరకూ క్యాంప్... చిత్రకళా శిబిరం నెలాఖరు వరకూ కొనసాగనుందని ఈ క్యాంప్‌లో పాల్గొంటున్న నగర చిత్రకారుడు మారేడు రాము చెప్పారు. తాను రామానుజాచార్యుల జీవిత ఘట్టం లోని ముఖ్యమైన ఉపదేశాల సన్నివేశాలను రామానుజాచార్యులు రుషులకు బోధిస్తున్న దృశ్యాలను చిత్రించామని తెలిపారు. ఈ తరహా అతిపెద్ద చిత్రకారుల శిబిరం తన జీవితంలో చూడలేదని, దీనిలో తాను సైతం భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇదొక పెద్ద చిత్రకళా పండుగలా ఉందన్నారాయన. గిన్నీస్ రికార్డ్ సాధించదగ్గ భారీ ఆర్ట్ క్యాంప్‌గా దీనిని చెప్పొచ్చునన్నారు. రేపటితో క్యాంప్ పూర్తవుతుందని తెలిపారు.