సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమతామూర్తి రామానుజ విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన మండపంలో భక్తుల నుద్దేశించి ప్రసంగించారు. రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రతిమను దూరం నుంచి చూస్తే ఆత్మకు శాంతి చేకూరుస్తుందన్నారు. రామానుజాచార్యుడి సమతామూర్తిని దర్శించుకున్న తర్వాత తనలో చైతన్యం పెరిగిందని తెలిపారు. అనేక యుగాలవరకు సనాతన ధర్మ పరిరక్షణకు ఈ రామానుజాచార్యుడి విగ్రహం ప్రేరణ ఇస్తుందన్నారు. సనాతన ధర్మంలో జీవుడే సత్యం అన్నది వ్యక్తమవుతుందని పేర్కొన్నారు.
రామాయణ, భారత కాలాలనుంచి నుంచి ఇప్పటివరకు సనాతన ధర్మం ఒడిదుడుకులకు లోనయినప్పటికీ ముందుకు సాగుతూనే ఉంటుంది. సనాతన ధర్మం యాత్ర ఆగిపోదు.. ప్రపంచమంతా విస్తరిస్తుంది.సనాతన ధర్మ పరిరక్షణలో ముందుకు సాగుతున్న చిన్నజీయర్ స్వామికి నా అభినందనలు. నేను జన్మతా వైష్ణవుడిని. ఇంతమంది ఆచార్యులు, సాదు సంతవులు ముందు విశిష్టాద్వైతం గురించి మాట్లడలేను. రామానుజాచార్యుడు గురువు ఆదేశాలను దిక్కరించి ఆయన బోధించిన అష్టాక్షరి మంత్రాన్ని ప్రజలందరికి వినిపించారు. ఆలయం శిఖరంపైకి ఎక్కి అష్టాక్షరి మంత్రాన్ని సాధారణ ప్రజలకు వినిపించారు.
చదవండి: సనాతన ధర్మం అన్నింటికీ మూలం
రామానుజాచార్యుడు మధ్యే మార్గం విశిష్టాద్వైతాన్ని సూచిస్తూ.. దేశంలో ఐక్యతను సాధించేందుకు కృషిచేశారు. అందరికీ మోక్షం పొందే హక్కు ఉందని రామానుజాచార్యుడి బోధనలు చేశారు. రామానుజాచార్యుడు రాసిన శ్రీ భాష్యం, వేదాంత సంగ్రహం సహం తొమ్మిది గ్రంథాలు అత్యంత ఆదరణ పొందాయి. ఈ గ్రంథాలు దేశంలోని చాలా గ్రంథాలయాలల్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సర్వస్వం భగవంతునికి సమర్పించిన వారికే మోక్షం పొందే హక్కు ఉంటుందని రామానుజాచార్యుడు బోధించారు. వినమ్రత, సంస్కరణకోసం చేసే విప్లవం ఇవి రెండు కలిస్తేనే ఉద్దరణ ప్రక్రియ ఆవిష్కారమవుతుంది. దేవాలయాలు, గృహాల్లో పూజ చేయడానికి రామానుజాచార్యుడు విది విధానాలను నిర్దేశన చేశారు’ అని అమిత్ షా పేర్కొన్నారు.
చదవండి: ‘కేసీఆర్ ఉద్దేశ్య పూర్వకంగానే పీఎంకు ఆహ్వానం చెప్పలేదు.. అయితే ఏంటి?’
Comments
Please login to add a commentAdd a comment