సాక్షి, హైదరాబాద్: భాగ్యలక్ష్మి అమ్మవారికి, భద్రాద్రి రాముడికి నమస్కారాలు తెలుపుతూ.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎవరు అధికారంలో ఉండాలో తేలిపోతుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా.. బీజేపీ సోషల్‌మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.‘ఇళ్లు ఇళ్లు తిరిగి ప్రచారం చేసే కార్యకర్తకు ఎంత హక్కు ఉందో సోషల్ మీడియాకు అంతే. మూడోసారి మోదీ సర్కార్ అధికారంలోకి రాబోతుంది.దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ పేరు తప్ప వేరే పేరు వినిపించడం లేదు. తెలంగాణలో 12 కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలవాలి.
10ఏళ్లలో మోదీ సర్కార్ అవినీతిని అంతం చేసింది. దేశం సురక్షితంగా ఉంది అంటే కారణం మోదీ సర్కార్. మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. 5 వందల ఏళ్ల కల నెలవెర్చిన ఘనత మోదీ సర్కార్‌ది. గతంలో కాంగ్రెస్ సర్కార్ చేయని పని మోదీ చేసి చూపించాడు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత మోదీ... కాంగ్రెస్ పార్టీ దానిని రాజకీయం మాత్రమే చేసింది. మోదీ సర్కార్ చేసి చూపించింది.
ట్రిపుల్ తలాక్ తీసివేసిన వ్యక్తి మోదీ. మహిళ రిజర్వేషన్ కల్పించారు. సీఏఏ నిర్ణయం కూడా మోదీ సర్కార్ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేయని పనిని మోదీ సర్కార్ చేసి చూపించింది. సీఏఏని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. మీ చేతిలో మెక్ ఇన్ ఇండియా ఫోన్ ఉంది.దీని ఘనత మోదీది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు వేరు ఎజెండా ఒక్కటే, మజ్లిస్ ఎజెండా లో మిగితా పార్టీలు నడుస్తాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం మొత్తం కుటుంబ పార్టీలే... అవినీతి పార్టీలే ఈ మూడు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్న కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి.
రూ. 12లక్షల కోట్ల అవినీతి చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అభివృద్ది మోదీ తోనే సాధ్యం.ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన వ్యక్తి మోదీ. మోదీ జీవితం మొత్తం ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాడు. మోదీ విరామం లేకుండా పని చేస్తున్నాడు..రాహుల్ బాబా విశ్రాంతి కోసం విదేశాలకు వెళతాడు. సీఎం రేవంత్రెడ్డిని అడుగుతున్న గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ రూ. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క తెలంగాణకు మోదీ రూ. 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదుల భరతం పట్టాడు మోదీ. ఇండియా అలయన్స్, బీఆర్‌ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేరు. 400 స్థానాల్లో 12 కంటే ఎక్కువ స్థానాలు తెలంగాణ నుండి ఉండాలి’ అని అమిత్ షా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment