సాక్షి, హైదరాబాద్: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే.. ఐదేళ్లలో ఎనిమిది స్థానాలకు పెరిగామని, 8 స్థానాల నుంచి మళ్లీ వచ్చే అసెంబ్లీ నాటికి 95 స్థానాలకు బీజేపీ పుంజుకుంటుందని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అవినీతి, మజ్లిస్‌తో అంటకాగిన కేసీఆర్ ఫాం హౌజ్‌కి పరిమితమయ్యారు. కేసీఆర్ కంటే కాంగ్రెస్ ఏం తక్కువ కాదు. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద అవినీతి కుటుంబ పార్టీ. ఆ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. ‘బీఆర్‌ఎస్ మునిగింది.. కాంగ్రెస్ మునిగిపోయేందుకు సిద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సారి తెలంగాణ లో కనీసం 10 లోక్ సభ స్థానాలు గెలవాలి. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 35 శాతం ఓటింగ్ టార్గెట్ అన్న అమిత్‌షా.. 10 లోక్ సభ స్థానాల్లో గెలిచేలా కృషి చేస్తామని కేడర్‌తో అమిత్ షా ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ అభివృద్ధికి గత 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేంద్రం సహకారం అందించిందని, ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని అమిత్ షా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: TS: బీజేపీ ముఖ్య నేతలకు అమిత్‌షా క్లాస్
Comments
Please login to add a commentAdd a comment