సాక్షి, రంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌కు చేరుకున్నారు. ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సమతా మూర్తి కేంద్రాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం కేసీఆర్. చిన్నజీయర్ స్వామితో కలిసి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహం చుట్టూ కేసీఆర్ తిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా ముచ్చింతల్ గ్రామంలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 తేదిన ప్రారంభమైన ఈ మహోత్సవం ఫిబ్రవరి 14 వరకు కొనసాగనున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనారాయణయాగం నిర్వహించారు. యాగశాలలో అగ్నిహోత్రం ఆవిష్కరణ, 1035 కుండలాల్లో శ్రీ లక్ష్మీ నారాయణ హోమం జరిగింది. ఈ హోమాన్ని ఏక కాలంలో ఐదు వేల మంది రుత్వికులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, రుత్వికులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలలో పాల్గొన్న సీఎం శ్రీ కేసీఆర్ https://t.co/n4lKbEcxjw
— Telangana CMO (@TelanganaCMO) February 3, 2022
Comments
Please login to add a commentAdd a comment