sri ramanuja
-
Statue Of Equality : 13వ రోజు సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు ( ఫోటోలు)
-
సమతను చాటే భవ్యక్షేత్రం
సాక్షి, హైదరాబాద్: వెయ్యేళ్ల కింద సమానత్వ భావనతో సామాజిక పరివర్తన దిశగా శ్రీరామానుజాచార్యులు వేసిన అడుగును బలోపేతం చేసే దిశగా ఆయన విరాట్‌మూర్తితో భవ్యక్షేత్రంగా అవతరించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం చైతన్యం నింపుతుందని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. అత్యద్భుతంగా రూపొందించిన ఈ కేంద్రం దేశంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందని పేర్కొన్నారు. జాతి నిర్మాణంలో కీలకమైన వసుదైక కుటుంబం స్ఫూర్తిని రామానుజుల ఆలోచనలు ప్రతిబింబిస్తాయని, జాతి కల్యాణంలో ఇప్పుడు రామానుజుల స్ఫూర్తి కేంద్రం కూడా ఆ పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం ముచ్చింతల్‌లోని రామానుజుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 120 కిలోల బంగారంతో రూపొందిన 54 అంగుళాల శ్రీరామానుజాచార్యుల స్వర్ణమయ మూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ లోకార్పణం చేశారు. అనంతరం రాష్ట్రపతి దంపతులు, వారి కుమార్తె తొలి పూజ నిర్వహించారు. అనంతరం ప్రవచన కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రపతి మాట్లాడుతూ రామానుజుల భవ్యక్షేత్రాన్ని అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించి చినజీయర్ స్వామి చరిత్ర సృష్టించారని కొనియాడారు. రామానుజుల స్వర్ణమయ మూర్తిని జాతికి అంకితం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. 1035 కుండాలతో నిర్వహించిన లక్ష్మీనారాయణ హోమం, 108 దివ్యదేశాల ప్రాణప్రతిష్టతో ఈ మహా క్షేత్రానికి గొప్ప ఆధ్యాత్మిక శోభ ఏర్పడిందని అన్నారు. స్ఫూర్తికేంద్రం సమతాభూమి... సమానత్వం కోసం పరితపించిన శ్రీరామానుజాచార్యులు వెలసిన ఈ క్షేత్రాన్ని తాను భక్తి భూమి, సమతాభూమి, విశిష్టాద్వైతాన్ని సాక్షాత్కరింపజేసే భూమిగా, దేశ సంస్కారాన్ని తెలిపే భూమిగా భావిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. వందేళ్లను మించిన తన జీవనయాత్రతో భారతీయ ఆధ్యాత్మిక, సామాజిక భావనకు కొత్త రూపమిచ్చిన రామానుజులు, సామాజిక భేదభావాలకు అతీతంగా దేవుడిని అందరి దరికి చేర్చి భక్తిప్రపత్తి, తాత్వికతను సామాజిక జీవన సౌందర్యంతో జోడించి కొత్త భాష్యం చెప్పారని కీర్తిం చారు. తక్కువ కులం వారుగా ముద్రపడ్డ వ్యక్తులు చేసిన రచనలను ఆయన వేదంగా గౌరవించారన్నారు. రామానుజులు దక్షిణాది నుంచి భక్తిధారను ఉత్తరాదికి ప్రవహింపజేసి ఎందరో ముక్తి పొందేలా చేశారని కోవింద్ పేర్కొన్నా రు. వారిలో ఎంతోమంది తక్కువ జాతిగా ముద్రపడ్డ వారేనని రాష్ట్రపతి తెలిపారు. రామానుజుల తత్వంతో అంబేడ్కర్... ‘రామానుజ తత్వంతో ప్రేరణ పొందిన కబీర్‌పంత్‌ను అనుసరించిన అంబేడ్కర్ కుటుంబీకులు జీవించిన మహారాష్ట్రలోని వారి గ్రామాన్ని నిన్న సందర్శించా. ఈరోజు శ్రీరామనగరంలోని ఈ క్షేత్రంలో ఉన్నా. ఈ రెండూ పవిత్ర తీర్థ స్థలాలుగానే నాకు అనిపిస్తాయి. అప్పట్లో సమత మంత్రంగా రామానుజులు పరివర్తన కోసం పరితపిస్తే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయం కోసం పనిచేశారు. రామానుజుల తత్వాన్ని అంబేడ్కర్ కూడా ప్రస్తుతించారు. మనలో ఇమిడి ఉన్న వసుదైక కుటుంబానికి ఈ సమతనే ప్రేరణ’అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. అన్ని వర్గాల పురోగతి అనే భావన రామానుజులు ప్రతిపాదించిన విశిష్టాద్వైతంలోని భక్తిభావంలో ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. రామానుజుల సమానత్వ స్ఫూర్తిని మహాత్మాగాంధీ అనుసరించారని, జైలువాసంలో ఉన్నప్పుడు ఆయన రామానుజుల చరిత్రను చదివి ఎంతో ప్రేరణ పొందారని గుర్తుచేశారు. స్వామి వివేకానందపై కూడా రామానుజుల ప్రభావం ఎంతో ఉందని, ఆయన రచనల్లో రామానుజులను గుర్తుచేశారని అన్నారు. సమతా స్ఫూర్తి కేంద్రం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. చిత్రంలో ఆయన సతీమణి సవిత, గవర్నర్ తమిళిసై, చినజీయర్ స్వామి, మంత్రి తలసాని, మైహోం రామేశ్వరరావు భారీ ప్రతిమ... దేశ ఆధ్యాత్మిక వైభవానికి చిహ్నం ఓ శ్లోక తాత్పర్యం ప్రకారం విష్ణువుకు సోదరులుగా వివిధ కాలాల్లో పుట్టిన వారి ప్రస్తావన ఉందని రాష్ట్రపతి గుర్తుచేశారు. దాని ప్రకారం తొలుత ఆదిశేషుడిగా, త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపర యుగంలో బలరాముడిగా, కలియుగంలో రామానుజులుగా అవతరించారని అందులో ఉన్నట్లు ఆయన తెలిపారు. కలియుగంలో ముక్తి మార్గాలు మూసుకుపోయినప్పుడు రామానుజులు భక్తి, ముక్గి మార్గాన్ని చూపిన తీరును అన్నమాచార్యులు పలు కీర్తనల్లో ప్రస్తావించారన్నారు. పంచ లోహాలతో రూపొందిన రామానుజుల విరాట్‌మూర్తిని చూస్తే అది ఒక విగ్రహం మాత్రమే కాదని, దేశ సంప్రదాయ వైభవానికి ప్రతిరూపమని, సామాజిక సమానత్వ భావనను సాకారం చేసే కలకు నిలువెత్తు రూపమని, దేశ ఆధ్యాత్మిక వైభవానికి చిహ్నమని కోవింద్ కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి దంపతులను శాలువా, రామానుజుల జ్ఞాపికతో చినజీయర్ స్వామి సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రామానుజుల సహస్రాబ్ది సమారోహం ప్రతినిధులు జూపల్లి రామేశ్వరరావు, ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Statue of Equality: హైదరాబాద్ పర్యటనలో రామ్‌నాథ్ కోవింద్
-
Statue Of Equality: 11వ రోజు సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు ( ఫోటోలు)
-
Statue Of Equality: పదో రోజు సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు ( ఫోటోలు)
-
Statue Of Equality : తొమ్మిదోరోజు ఘనంగా మహాయాగం
-
సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న అమిత్ షా
► కేంద్ర హోంశాఖ మంత్రి ముచ్చింతల్‌లోని సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మం అన్నింటికీ మూలమని, సమతామూర్తి విగ్రహం ఏకతా సందేశాన్ని అందిస్తోందన్నారు. ► కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. తిరునామం, పంచెకట్టుతో వచ్చిన అమిత్ షా.. ముచ్చింతల్‌లోని దివ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. కేంద్రం విశిష్టతను చినజీయర్ స్వామి హోంమంత్రికి వివరించారు. అనంతరం శ్రీరామానుజుడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ► సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత దాదాపు రెండున్నర గంటల పాటు సహస్రాబ్ది వేడుకల్లో అమిత్ షా పాలుపంచుకోనున్నారు. అనంతరం యాగశాలలో జరిగే పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న అమిత్ షాకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన ముచ్చింతల్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, బిజేపి సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఘన స్వాగతం పలికారు. -
ముచ్చింతల్‌లో సీఎం కేసీఆర్.. సమతామూర్తి స్పూర్తి విగ్రహ పరిశీలన
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌కు చేరుకున్నారు. ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సమతా మూర్తి కేంద్రాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం కేసీఆర్. చిన్నజీయర్ స్వామితో కలిసి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహం చుట్టూ కేసీఆర్ తిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ముచ్చింతల్ గ్రామంలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 తేదిన ప్రారంభమైన ఈ మహోత్సవం ఫిబ్రవరి 14 వరకు కొనసాగనున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనారాయణయాగం నిర్వహించారు. యాగశాలలో అగ్నిహోత్రం ఆవిష్కరణ, 1035 కుండలాల్లో శ్రీ లక్ష్మీ నారాయణ హోమం జరిగింది. ఈ హోమాన్ని ఏక కాలంలో ఐదు వేల మంది రుత్వికులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, రుత్వికులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలలో పాల్గొన్న సీఎం శ్రీ కేసీఆర్ https://t.co/n4lKbEcxjw — Telangana CMO (@TelanganaCMO) February 3, 2022 -
సహస్రాబ్ది సమారోహం.. నమో నారాయణాయ!
రంగారెడ్డి జిల్లా/ శంషాబాద్/ శంషాబాద్ రూరల్: ఐదువేల మంది రుత్వికులు.. ఒకే సమయంలో వేద మంత్రోచ్ఛారణ. మధ్య ... తెలుగు రాష్ట్రాలకు చెందిన 2200 మంది కళాకారుల కళారూపాల ప్రదర్శనలతో ఆ ప్రాంతం పులకించి పోయింది. జై శ్రీమన్నారాయణ.. జైజై శ్రీమన్నారాయణ నామ స్మరణలతో ఆ ప్రాంతం మారుమోగి పోయింది. సమతామూర్తి వేడుకల ప్రాంగణం భక్తులు, కళాకారులతో తొలిరోజు బుధవారం అత్యంత శోభాయమానంగా మారింది. పుట్టమన్ను సేకరణతో.. అంకురార్పణ కార్యక్రమం పుట్టమన్ను సేకరణతో ప్రారంభమైంది. దివ్య సాకేతాలయం సమీపంలో పుట్ట నుంచి రుత్వికులు మట్టిని సేకరించారు. ఉత్సవ మూర్తితో పాటు పుట్టమన్నును భాజా భజంత్రీలతో ప్రధాన యాగశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ మట్టిని అప్పటికే అక్కడ సిద్ధం చేసిన కుండలాల్లో నవ ధాన్యాలతో పాటు సమర్పించారు. ఈ సమయంలోనే రుత్వికుల వేద మంత్రోచ్ఛారణ, భక్తుల నోట నారాయణ జపాలతో ఆ ప్రాంతం భక్తి పారవశ్యం లో మునిగిపోయింది.12 రోజుల పాటు జరగనున్న హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనే రుత్వికులకు రక్షా సూత్రాలు(కంకణాలు), వస్త్రాలు అందజేయగా.. వారు దీక్షకు కంకణబద్ధులయ్యారు. ఆకట్టుకున్న సాంస్కృతిక యాత్ర వివిధ ప్రాంతాల నుంచి రుత్వికులు, భక్తులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు గాను పెద్దసంఖ్యలో కళాకారులు శ్రీరామనగరానికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు కిన్నెర వాయిద్య కళాకారులు కూడా పన్నెండు మెట్ల కిన్నెరలను వాయించడానికి ఇక్కడకి చేరుకున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆరువందల మంది మహిళలు కోలాటం ఆడుతూ తీసుకొచ్చిన బోనాల జాతర అందరినీ ఆకట్టుకుంది. చినజీయర్ స్వామి సైతం ప్రత్యేకంగా బోనాల సందడిని యాగశాల వద్ద వీక్షించారు. చిన్నారి కళాకారుల ప్రత్యేక నృత్యాలు, ఆటపాటలు, సుమారు రెండు వందల మందితో డోలు వాయిద్యాలు, డప్పు దరువులతో పాటు ప్రత్యేక కోలాటాలతో ప్రధాన ఆలయం నుంచి యాగశాల వరకు సాంస్కృతిక యాత్ర చేప ట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడి విశేషాలతో కూడిన చిత్రాల గ్యాలరీని యాగశాల సమీపంలో ఏర్పాటు చేసింది. ఇందులో తిరుమల వెంకటేశ్వరుడికి సంబంధించిన కళాకృతులు, చిత్రాలు కొలువుదీరాయి. దీనికి పక్కనే భక్తులకు వినోదాన్ని పంచే సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నేడు అగ్ని మథనం.. ఉత్సవాల రెండోరోజులో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకు యాగశాలలో ‘అగ్నిమథనం’తో హోమ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మథనంలో భాగంగా ఐదువేల మంది రుత్వికులతో పాటు యాజమాన్యులు వారికి కేటాయించిన యాగశాలల్లో ఆసీనులు కానున్నారు. సెమీ దండం, రావి దండం కర్రలతో మథించగా వచ్చిన అగ్నిని 144 యాగశాలల్లోని 1,035 కుండాలలో నిక్షిప్తం చేసి హోమాలను ఆరంభిస్తారు. అనంతరం అరణి మథనం, అగ్ని ప్రతిష్ట, సుదర్శనేష్టి, వాసుదేవనేష్టి, పెద్ద జీయర్‌స్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రవచన మండపంలో వేద పండితుల ప్రవచనాలు కొనసాగించనున్నారు. విద్యుత్ అంతరాయంతో... సహస్రాబ్ది సమారోహంలో కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్‌శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక లైన్లనూ ఏర్పాటు చేశారు. అయినా మొదటి రోజు కోతలు తప్పలేదు. మధ్యాహ్నం సుమారు అరగంట పాటు కరెంటు సరఫరా నిలిచిపోవడంతో రుత్వికులు, సేవకులు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, ఉద్యోగులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇదిలా ఉండగా బుధవారం స్వల్ప అస్వస్థతకు గురైన సేవకులు, రుత్వికులకు ఇక్కడ వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించారు. సహస్రాబ్ది సమారోహంలో నేడు ► ఉదయం 8.30 గంటలకు దుష్ట నివారణ కోసం శ్రీ సుదర్శనేష్టి, సర్వాభీష్ట సిద్ధికై వాసుదేవేష్టి, అష్టోత్తర శతనామ పూజ ► 9 గంటలకు యాగశాలలో ‘అగ్నిమథనం’తో హోమ కార్యక్రమం ప్రారంభం ► 12.30 గంటలకు పూర్ణాహుతి ► సాయంత్రం 5గంటలకు సాయంత్రపు హోమం.. 5.30 గంటలకు చినజీయర్ స్వామి థాతి పంచకం సహితంగా శ్రీ విష్ణు సహస్ర నారాయణ పారాయణం ► రాత్రి 9.30 గంటలకు ఇష్టిశాలలో పూర్ణాహుతి ► ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రవచన మండపంలో పెద్ద జీయర్ స్వామి ఆరాధన, చిన జీయర్‌స్వామి, రామచంద్ర జీయర్‌స్వామి ఉపదేశాలు ఉంటాయి. ప్రధాన వేదికపై కర్ణాటక సంగీత కచేరీ, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, భజనలు, పాలపర్తి శ్యామలానంద్ ప్రసాద్, నేపాల్ కృష్ణమాచార్య, అహోబిల జీయర్‌స్వామి ప్రవచనాలు ఉంటాయి. పోస్టల్ కవర్ ఆవిష్కరణ లోకానికి సమతాస్ఫూర్తిని చాటిన శ్రీ భగవద్రామానుజుల వారి చిత్రంతో పోస్టల్ శాఖ రూపొందించిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ పోస్టల్ కవర్, స్టాంపును చినజీయర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తపాలా శాఖ రాష్ట్ర డైరెక్టర్ వి.వి.సత్యనారాయణరెడ్డి, మైహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. -
Statue of Equality: శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకలు
-
సమతాస్ఫూర్తికి ప్రాణప్రతిష్ట.. వైభవంగా అంకురార్పణ కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: దేశంలో భారీ ఆధ్యాత్మిక, ధార్మిక కేంద్రాల్లో ఒకటిగా భాసిల్లే స్థాయిలో రూపు దిద్దుకున్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభోత్సవానికి బుధవారం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జీయర్ స్వాములు, మఠాధిపతులు, ద్వైత, అద్వైతంలో పెద్దవారంతా పాల్గొన్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామనుజ జైస్వామి వారు కార్యక్రమ వైభవాన్ని తెలిపారు. మంగళ శాసనాలు అందించారు. శంషాబాద్ ముచ్చింతల్‌లోని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌స్వామి ఆశ్రమ ప్రాంగణంలో రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో 45 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ అద్భుత, దివ్య క్షేత్రం.. భక్తుల సందర్శనకు వీలుగా త్వరలో ప్రారంభం కాబోతోంది. 1,035 కుండాలతో కూడిన లక్ష్మీనారాయణ మహా యాగంతో వేడుకలను ప్రారంభిస్తున్నారు. తొలుత ఆ ప్రాంత భూమి పూజ, వాస్తు పూజ చేస్తారు. వివిధ సంప్రదాయా లను అనుసరించే 5 వేల మంది రుత్వికులు దీక్షధా రణ చేసి పూజల్లో పాల్గొంటారు. సాయంత్రం కుండల్లోని పుట్టమట్టిలో నవధాన్యాలను అలకటం ద్వారా అంకురార్పణ చేయనున్నారు. ఈ ఉత్సవాలు ఈ నెల 14 వరకు కొనసాగనున్నాయి. భారీ విగ్రహం.. 108 ప్రధాన క్షేత్రాలు 216 అడుగుల ఎత్తులో కూర్చున్న భంగిమలో దేశంలో తొలి, ప్రపంచంలో రెండోదిగా కీర్తికెక్కిన రామానుజుల భారీ పంచలోహ సమతామూర్తి విగ్రహం ఈ కేంద్రంలో ప్రధానాకర్షణగా నిలవ నుంది. భారీ విగ్రహమే కాకుండా వైష్ణవ సంప్రదా యంలో అత్యంత ప్రాధాన్యమున్న దివ్య దేశాలుగా పేర్కొనే దేశంలోని 108 ప్రధాన క్షేత్రాల నమూ నాలు ఇక్కడ నిర్మించారు. భారీ విగ్రహం దిగువన 120 కిలోల స్వర్ణమయ 54 అంగుళాల రామాను జుల అర్చామూర్తితో కూడి ఆలయం కూడా ఆకట్టు కోనుంది. ఈ బృహత్తర క్షేత్రంలో అడుగడుగునా ఆధునిక సాంకేతికతను వాడి సంతృప్తిదాయక క్షేత్ర సందర్భన అనుభూతి కలిగేలా రూపొందించారు. సమానత్వ స్ఫూర్తి చాటేలా.. వెయ్యేళ్ల కిందట ఎన్నో వైషమ్యాలు, వైరుధ్యాలు.. అంటరానితనం కరాళనృత్యం చేస్తున్న సమ యంలో ప్రాణికోటి అంతా ఒకటేనని, మనుషుల మధ్య తేడాల్లేవని ప్రబోధించి సమానత్వ భావాలు నాటారు ఆచార్య రామానుజులు. మళ్లీ ఇప్పుడు అసమానతలు దేశ పురోగతికి కంటకంగా మారు తున్న నేపథ్యంలో ఆయన స్ఫూర్తి మరోసారి సమా జంలో పాదుకోవాల్సిన అవసరం ఉందంటూ చినజీయర్ స్వామి ఈ బృహత్ క్షేత్ర నిర్మాణానికి పూనుకున్నారు. దాతల విరాళాలతో ఆరేళ్లలోనే ఈ భారీ కేంద్రం రూపుదిద్దుకుంది. రామానుజులు అవ తరించి వెయ్యేళ్లు గడుస్తున్న నేపథ్యంలో శ్రీ రామా నుజ సహస్రాబ్ది సమారోహంగా ఈ క్రతువును ప్రారంభిస్తున్నారు. ఈ క్షేత్రాన్ని ఓ గుడిలా భావించకుండా, సమాజంలో సమానత్వ భావనల ను విస్తరించేలా చేసేందుకు రామానుజుల ప్రబోధాలు జనంలోకి వెళ్లేలా రూపొందించారు. ఆధునిక అగుమెంటెడ్ రియాలిటీ ఆధారిత 18 నిమిషాల లేజర్ షో ద్వారా నిత్యం భక్తుల మదిని తాకేలా ఏర్పాట్లు చేశామని జీయర్ స్వామి చెబుతున్నారు. సమాజానికి అందించిన అద్భుతమైన 9 గ్రంథాల సారాన్ని అందించేలా డిజిటల్ లైబ్రరీ, సమానత్వ భావాలను సమాజానికి అందించిన విశ్వవ్యాప్త సమతామూర్తుల వివరాలు అందించే హాల్ ఆఫ్ ఫేమ్‌ను సిద్ధం చేశారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 5న వేడుక లకు హాజరుకాను న్నారు. రామానుజుల భారీ సమతామూర్తి విగ్ర హాన్ని ఆవిష్కరించను న్నారు. 7న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, 8న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. 13న రాష్ట్రపతి ఉత్సవ మూర్తిని దర్శించుకోనున్నారు. అలాగే 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల కీలక నేతలు, ఆధ్యాత్మిక వేత్తలు, వివిధ పీఠాధిపతులు కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. భక్త జనం కూడా భారీగా తరలివస్తున్నారు. -
అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయండి
శంషాబాద్ రూరల్: మండలంలోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై మంత్రులు టి.హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం చినజీయర్ స్వామితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శ్రీరామనగరంలోని నేత్ర విద్యాలయం సమావేశం మందిరంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఉత్సవాలకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెంది న ప్రముఖులు రానుండటంతో ఆ మేరకు అన్ని సౌకర్యాలు ఏర్పా టు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా వైద్య, వాటర్ గ్రిడ్, ఇంట్రా, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, ఏపీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేతాజీ జయంతి సందర్భంగా ‘ఉద్ఘోష్’ సాక్షి, హైదరాబాద్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జన్ ఉర్జా మంచ్ ఆధ్వర్యంలో ‘ఉద్ఘోష్‘కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆబ్కారీ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు ఉద్ఘోష్ అవార్డులను పంపిణీ చేశారు. -
రాతి.. చిర ఖ్యాతి!
సాక్షి, హైదరాబాద్: పాత రాతి కట్టడాలు చూస్తే వాటిల్లోని శిల్పాలు అబ్బురపరుస్తాయి. వాటిని చెక్కిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ మండపాలు, ప్రాకారాలు, గోపురాలు.. ఒకటేమిటి అన్నీ కట్టిపడేస్తాయి. కారణం.. అవన్నీ రాతి నిర్మాణాలే. 17వ శతాబ్దంలో జటప్రోలు దేవాలయాల నిర్మాణాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఆ స్థాయిలో రాతి నిర్మాణాలు జరగలేదు. ఆ తర్వాత సిమెంటు వాడకం పెరిగాక నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కింది. రాతి కట్టడాలు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ అలనాటి అబ్బురాన్ని కళ్లకు కట్టేలా రెండు భారీ రాతి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటు యాదాద్రి.. అటు శ్రీరామానుజుల సహస్రాబ్ధి ప్రాంగణం.. సనాతన సంప్రదాయ నిర్మాణ విధానానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాయి. మన శిల్పుల్లో ఆ కళ పదిలం ఎలాంటి ఆధునిక పరిజ్ఞానం లేని సమయంలో కూడా టన్నుల బరువున్న రాళ్లను పేర్చి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసి శిల్పులు అద్భుతాలు çసృష్టించారు. అయితే ప్రస్తుతం ఆలయాల్లోని మూలవిరాట్టు మినహా మిగతా భాగాలకు రాతితో పని అవసరం లేని సమయంలో నేటి శిల్పుల చేతుల్లో నాటి పనితనం ఉండదన్న అనుమానాలుండేవి. కానీ ఈ రెండు మందిరాలను నిర్మించి వారు నాటి శిల్పుల వారసులేనని నిరూపించారు. యాదాద్రి, రామాను జుల సహస్రాబ్ది మందిరాల్లో దాదాపు 5 వేల మంది శిల్పులు అద్భుత పనితనాన్ని చూపారు. రామానుజుల ప్రాంగణంలో రాతి నిర్మాణాలు యాదాద్రి మందిరానికి 86 వేల టన్నుల నల్లరాయి యాదాద్రి మందిరాన్ని పూర్తిగా కృష్ణ శిలతో నిర్మించారు. ఇందుకు మేలురకమైన బ్లాక్ గ్రానైట్ కోసం వివిధ ప్రాంతాలను గాలించి ప్రకాశం జిల్లా గుర్జేపల్లి ప్రాంతంలోని క్వారీని ఎంపిక చేశారు. దాదాపు 86 వేల టన్నుల నల్లరాతిని సేకరించారు. ఇందుకు రూ. 48 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఆ రాతిని చెక్కి ఇటు శిల్పాలు, అటు నగిషీలు, ప్రాకార రాళ్లు.. ఇలా రకరకాలుగా వినియోగించారు. మొత్తంగా యాదాద్రి ఆలయానికి 10 లక్షల క్యూబిక్ ఫీట్ మేర దీన్ని వినియోగించారు. రామానుజుల సహస్రాబ్ది ప్రాంగణంలో మందిరాలకు రకరకాల రాళ్లు రామానుజుల 216 అడుగుల ఎత్తున్న విగ్రహం దిగువన ఉన్న 54 అడుగుల ఎత్తున్న భద్రపీఠానికి రాజస్తాన్‌లోని బన్సీపహాడ్‌పూర్ ప్రాంతం లోని లేత గులాబీ రంగు ఇసుక రాయిని వాడారు. మౌంట్అబూ ప్రాంతంలోని శిల్పుల చేత దాన్ని చెక్కించి తీసుకొచ్చి ఇక్కడ వినియోగించారు. సమతామూర్తి చుట్టూ విస్తరించి ఉన్న 108 దివ్యదేశ మందిరాల్లోని గర్భాలయ అంతరాలయాలకు ఏపీలోని కోటప్పకొండ, మార్టూరు పరిసరాల్లోని బ్లాక్ పెరల్ గ్రానైట్‌ను వాడారు. దివ్య మండపంలో హోయసల, కాకతీయ శైలిలో ఏర్పాటు చేసిన 468 స్తంభాలకు రాజస్తాన్‌లోని బేస్లానా బ్లాక్ మార్బుల్ (నల్ల చలువరాయి) వినియోగించారు. కాంచీపురం సమీపంలోని వాలాజా ప్రాంతంలోని కృష్ణ పురుష శిలను ఆలయాల్లోని ప్రధాన మూర్తులకు వాడారు. మరో 12 రోజుల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహణ జరగబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా 216 అడుగుల భారీ రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రామానుజుల సహస్రాబ్ది ప్రాంగణం 17వ శతాబ్దం తర్వాత తగ్గిన రాతి నిర్మాణాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరికెళ్లినా రాతితో నిర్మించిన చారిత్రక మందిరాలు దర్శనమిస్తాయి. శాతవాహనులు మొదలు కాకతీయులు, విజయనగర రాజుల వరకు నిర్మాణాలన్నీ రాతితోనే జరిపించారు. డంగు సున్నం మిశ్రమాన్ని నిర్మాణాలకు వినియోగించే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా రాతికి రాతికి మధ్య బైండింగ్ వరకే దాన్ని వాడారు తప్ప ఆలయాల నిర్మాణానికి అంతగా వినియోగించలేదు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని దక్కన్ సుల్తాన్‌ను ఓడించిన తర్వాత భారీ రాతి నిర్మాణాలు పెద్దగా జరగలేదు. తర్వాత సంస్థానాలు కొలువుదీరాక 17వ శతాబ్దంలో కొన్ని పెద్ద రాతి దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి. జటప్రోలు సంస్థానాధీశులు స్థానికంగా మదనగోపాల స్వామి దేవాలయం, కృష్ణా తీరంలోని మంచాలకట్ట మాధవస్వామి దేవాలయాలు నిర్మించారు. మళ్లీ 3 శతాబ్దాల తర్వాత 1910లో వనపర్తి సంస్థానాధీశులు పెబ్బేరు సమీపంలోని శ్రీరంగాపురంలో రంగనా«థ స్వామి ఆలయాన్ని రాతితో నిర్మించారు. కానీ అది చిన్నగా ఉండే ఒకే దేవాలయం. జటప్రోలు దేవాలయాల తర్వాత ఇంత కాలానికి అత్యంత భారీగా, పూర్తి రాతితో నిర్మించిన దేవాలయం యాదాద్రి. రామానుజుల సహస్రాబ్ధి మందిరాలు కూడా కొంతభాగం సిమెంటు నిర్మాణాలు పోను ప్రధాన మందిరాలను రాతితోనే నిర్మించారు. నగరం నడిబొడ్డున నౌబత్ పహాడ్‌పై పాలరాతితో నిర్మించిన బిర్లామందిరం కూడా రాతి కట్టడమే అయినా తెలుగు ప్రాంతాల సంప్రదాయ శైలికి భిన్నమైంది. -
సనాతన సమతామూర్తి
సందర్భం ‘‘భగవద్రామానుజులు ఒక్కరే అంత్యజుల నుంచి బ్రాహ్మణుల వరకు అంద రికి భక్తి మార్గము సమా నమేయని, ప్రబోధిం చారు’’ అని స్వామి వివే కానంద పేర్కొన్నారు. ‘‘ఒకప్పుడు, ఒక వర్గానికే పరిమితమైన ‘‘మోక్షమార్గము’’ అన్ని వర్గాలకు, సమాన అర్హత గలదని శ్రీమద్రామానుజులు చాటి చెప్పి, అందరికి ద్వారాలు తెరిచారు’’ అని శ్రీ భారతీ దాసన్ తెలిపారు. ఆళ్వారులు మొత్తం పండ్రెండుగురున్నారు. వారు వివిధ కులాలలో జన్మించిన వారైనా అపార విజ్ఞానం వల్లా, అమా యక ముగ్ధ భక్తి వల్ల అత్యంతాదర గౌరవాలకు పాత్రులయ్యారు. ఆ పండ్రెండుగురిలోనూ ఒక స్త్రీ ఉన్నది, ఒక అస్పృశ్యుడున్నాడు. కొందరు బ్రాహ్మ ణేతరులున్నారు. వారందరూ పరమ విశుద్ధ జీవి తాలు గడిపినవారు. అందుచేతనే ఆళ్వారుల మత ప్రబోధం కుల సంప్రదాయ పరిధులను అతి క్రమించి భక్తి మార్గాన్ని ప్రారంభించింది. శ్రీ రామానుజుడు తమిళనాడులో శ్రీ పెరం బుదూరులో బ్రాహ్మణకులంలో క్రీ.శ. 1017లో జన్మించారు. నిమ్నవర్గాల ప్రజల స్థితి పట్ల ఎంతో ఆవేదన చెందాడు. అన్ని వర్గాల ప్రజలకు ఆచరణ యోగ్యమైన ఆధ్యాత్మిక ఉపాసనా పద్ధతులను సృష్టించారు. శ్రీ రామానుజుని గురువులు ఐదు గురు. నిమ్న వర్గీయుడైన మహాపూర్ణుడు అనే గురువు నుంచి వేదాలను, నాలియర ప్రబంధాన్ని (తమిళ వేదాన్ని) అధ్యయనం చేసి, వారివద్దే ‘వైష్ణవ దీక్ష’ను స్వీకరించాడు. శూద్రుడైన తిరుక్కో టియార్ నంబి (గోష్ఠిపూర్ణుడు)ని రెండవ గురు వుగా స్వీకరించి వారిని సేవించాడు. రామానుజుడు కర్ణాటకలోని ‘మేలుకోట’ను కేంద్రంగా చేసుకుని కొన్ని సంవత్సరాలు గడిపాడు. అన్ని వర్ణాలకు చెందిన వారిని శిష్యులుగా స్వీకరించాడు. 1099లోనే అక్కడ తిరునా రాయణ పెరుమాళ్ళ వైష్ణవ మందిరంలో పంచములకు ప్రవేశార్హత కల్పించాడు. అనేక మందిరాలలో నిమ్న వర్గాల వారికి ప్రవేశం కల్పించి వైష్ణవ మతావలం బికులుగా చేశాడు. శ్రీ రామానుజుడు అనేక దేవాలయాలను నిర్మించి, దేశమంతటా పర్యటించి ఆ దేవాలయా లలో అన్ని వర్గాల ప్రజలు ప్రధానంగా నిమ్న వర్గాల ప్రజలు దేవుని సేవించే విధంగా నూతన వ్యవస్థలను, పద్ధతులను ప్రారంభించాడు. ఆయన ప్రయత్నాలవల్ల వేదాలు, ఇతర ధార్మిక గ్రంథాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అస్పృశ్యుల ఇండ్లలో బిక్షను స్వీకరించాడు. తిరుప్పాణాళ్వారు అస్పృశ్యుడుగా జన్మించినం దువల్ల ఆలయంలో ప్రవేశించే అధికారం లేక కావేరీ తీరంలో నిలబడి భగవంతుణ్ణి ప్రార్థించేవారు. లోక సారంగముని ఒకనాడు ఆళ్వారును సమాధి స్థితిలో చూడటం తటస్థించినది. అది సమాధి స్థితి అని ఆయనకు తెలియక ఒక రాయి ఆళ్వారుపైకి విసి రారు. అది ఆయనకు తగిలి పెద్దగాయమై నెత్తురు కారింది. ఆ రాత్రి రంగనాథస్వామి, లోక సారంగ మునికి కలలో కనిపించి ఆళ్వారును భుజా లమీద మోసి ఆలయంలోకి తేవలసిందని ఆజ్ఞాపించారు. మరునాడు ఆళ్వారు ఎంత వద్దన్నా వినని లోక సారంగముని స్వామి ఆజ్ఞను శిరసావహించి రంగ నాథస్వామి ఆలయం వద్దకు తిరుప్పాణా ళ్వారును తన భుజాలపై మోసుకుంటూ తీసుకు వచ్చారు. రామానుజాచార్యులు దీన్ని పదేపదే ఉదహరించి భగవదనుగ్రహం కొన్ని ప్రత్యేక జాతుల వారికే పరిమితం కాదనేవారు. మహిళలకు సముచిత స్థానం: కొంగు దేశంలో (ఇప్పటి కోయంబత్తూరు ప్రాంతం) పెద్ద కరువు వచ్చినందువల్ల కొంగు ప్రత్తి అనే ఒకామె శ్రీరం గానికి తరలి వచ్చింది. రామానుజుల దర్శనం చేసుకున్న తర్వాత అక్కడనే స్థిర నివాసం ఉండి పోయింది. సుదూర ప్రాంతాల నుంచి శ్రీరంగానికి వచ్చి మఠంలో ఉండిపోయిన స్త్రీలు చాలామంది ఉన్నారు. దీన్నిబట్టి పురుషులతో పాటు సమానంగా స్త్రీలనాదరించిన మతాచార్యులలో రామానుజులే ప్రథములని రుజువవుతోంది. శ్రీరామానుజులు శ్రీరంగం కేంద్రంగా సుదీర్ఘ కాలం ధర్మప్రచారం చేసారు. ‘రామానందుడు’ వంటి అనేకమంది శిష్యులను తయారు చేసాడు. కాలానుగుణమైన మార్పులను చేస్తూ నిమ్న వర్గాల ప్రజలలో వైష్ణవ వ్యాప్తికి మాల, మాదిగ దాసరుల వ్యవస్థను ఏర్పరచారు. ఈ మాల మాదిగ దాసరులే హరినామ సంకీర్తన చేస్తూ సంక్రాంతి సందర్భంగా గ్రామంలోని అగ్రవర్ణాల ఇండ్లకు సైతం వచ్చిన పుడు ఈ హరిదాసులను ధర్మ ప్రచారకులుగా గౌరవించడం మనం ఎరిగినదే. శ్రీ రామానుజులు క్రీ.శ. 1137లో తన 120వ ఏట సమాధిని పొం దారు. శ్రీ రామానుజుల ప్రభావం కారణంగానే వేయి సంవత్సరాల క్రితమే పలనాడులో బ్రహ్మ నాయుడు చాపకూడు పద్ధతిని, మాచర్ల చెన్న కేశవ దేవాలయంలో అందరికీ ప్రవేశాన్ని కల్పించాడు. తిరుమల వంటి దేవాలయాల నిర్వహణలో అన్ని కులవృత్తుల వారికి స్థానం కల్పించిన ఘనత ఆయనదే. వెయ్యేళ్ల క్రితమే సమతా సందేశాన్ని ఆచరించి చూపిన మార్గంలో నడవడమే శ్రీ రామా నుజులపట్ల మనం అందించే సరియైన నివాళి. (నేడు శ్రీరామానుజుల సహస్ర జయంతి) - కె. శ్యామ్‌ప్రసాద్ (వ్యాసకర్త కన్వీనర్, సామాజిక సమరసతా వేదిక మొబైల్: 9440901360)