
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పరామర్శించారు. సోమవారం రోజున ఆయన శంషాబాద్‌లోని ముచ్చింతల్ శ్రీరాంనగర్‌లోని చిన్న జీయర్‌స్వామి ఆశ్రమానికి వచ్చారు. సీఎం కేసీఆర్ దాదాపు గంటపాటు స్వామి వారితో ఆశ్రమంలో గడిపారు. అనంతరం తిరిగి నగరానికి బయలుదేరారు. కాగా.. గత శుక్రవారం రోజున చిన్న జీయర్‌స్వామి తల్లి అలివేలు మంగతాయారు స్వర్గస్తులు కావడంతో సీఎం కేసీఆర్ ఆశ్రమానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. (చినజీయర్‌స్వామికి మాతృ వియోగం)
Comments
Please login to add a commentAdd a comment