
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామిని కలిశారు. ఏపీలో పాదయాత్ర చేపట్టబోతున్న నేపథ్యంలో స్వామి ఆశీస్సులను ఆయన తీసుకున్నారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్ స్వయంగా ట్వీటర్‌లో ట్వీట్ చేశారు. చిన జీయర్‌స్వామిని ఇవాళ (మంగళవారం) కలిశానని, ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ముందుగా ఆయన ఆశీస్సులు తీసుకున్నానని జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చిన జీయర్ స్వామితో సమావేశమైన ఫొటోలను ట్వీటర్‌లో పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment