
సాక్షి, హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పులు శాస్త్రాలకు విరుద్దంగా ఉండటం సరైనది కాదని చిన్న జీయర్ స్వామి అన్నారు. శబరిమల ఆలయంపై జరుగుతున్న రాద్దాంతంపై ఆదివారం ఆయన స్పందించారు. ప్రతీ ఆలయానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని ఉల్లంఘించడం మంచిది కాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగం పరిధిలోనే వ్యవహరించాలని, రాజ్యాంగం శాస్త్రాలకు కల్పించిన హక్కులపై ఇతరులు కల్పించుకోవడం సరికాదన్నారు.
కేవలం అయ్యప్ప ఆలయంపైనే ఎందుకు ఇంత చర్చ చేస్తున్నారని, మసీదుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. నిజంగా దైవంపై నమ్మకం ఉంటే వాటిని గౌరవించాలని.. లేకపోతే వాటికి దూరంగా వదిలేయాలని హితవు పలికారు. కొంతమంది రాజకీయ జోక్యం చేసుకుని కేవలం ఆలయాల మీదనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. సమాజానికి ప్రమాదం లేకుండా ఎవరి స్వేచ్చను వారు పొందే హక్కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment