
చినజీయర్‌స్వామి (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: దేశంలో కులాలు, అంతరాలు ఉండాలని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పిన ఆంధ్ర పీఠాధిపతి చినజీయర్ స్వామిపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో టీపీఎస్‌కే, కేవీపీఎస్ ఆధ్వర్యంలో చినజీయర్ స్వామి వ్యాఖ్యలకు నిరసనగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టే ముందు సాష్టాంగ నమస్కారం చేయడం విచారకరమని ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. కులాలు ఉండాలి, వర్ణ వ్యవస్థ ఉండాలని చెప్పిన చినజీయర్ స్వామిపై చర్యలు తీసుకోకుంటే ఆయన ఆక్రమించుకున్న 500 ఎకరాల ఆశ్రమం వద్ద నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.
మోదుగుపూల ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన చినజీయర్ స్వామిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబాబు, ప్రముఖ కవి కాలువ మల్లయ్య, జేవీవీ జాతీయ నాయకులు టి.రమేశ్, పీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment