
'ప్రభుత్వ ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయి'
గుంటూరు : నదిని కాలుష్యం చేయకుండా స్నానాలు చేయాలని భక్తులకు చిన్నజియర్ స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లి సమీపంలోని కృష్ణానదిలో ఆయన పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం చిన్నజియర్స్వామి మాట్లాడుతూ... ఇప్పటికే మన చర్యల వల్ల నదికీ తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు.
పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయని చిన్నజియర్ స్వామి తెలిపారు. తాడేపల్లిలోని ఘాట్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పుణ్యస్నానం ఆచరించారు.