holybath
-
'ప్రభుత్వ ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయి'
గుంటూరు : నదిని కాలుష్యం చేయకుండా స్నానాలు చేయాలని భక్తులకు చిన్నజియర్ స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లి సమీపంలోని కృష్ణానదిలో ఆయన పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం చిన్నజియర్స్వామి మాట్లాడుతూ... ఇప్పటికే మన చర్యల వల్ల నదికీ తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు. పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయని చిన్నజియర్ స్వామి తెలిపారు. తాడేపల్లిలోని ఘాట్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పుణ్యస్నానం ఆచరించారు. -
గోదావరి నదిలో నలుగురు గల్లంతు, ఇద్దరి మృతి
సీతానగరం: తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు చినకొండెపూడి గ్రామానికి చెందిన వీరబాబు (28), కనక దీపిక (12) గా పోలీసులు గుర్తించారు. మాల ధారణ ముందు గోదావరిలో స్నానం చేయాలని అనుకుని శనివారం సాయంత్రం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో దిగారు. ప్రవాహ ఉధృతికి వారిద్దరూ కొట్టుకుపోయారు. వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టగా గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహలు లభ్యమైనట్టు పోలీసులు పేర్కొన్నారు. -
అప్పుడే పుణ్యస్నానం.. అంతలోనే విషాదం
బూర్గంపల్లి : కొన్ని నిమిషాల కిందట పుష్కర స్నానాలు ముగించుకుని అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న ఇద్దరు మహిళలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా బూర్గంపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. చిత్తూరు జిల్లా సోమల మండల కేంద్రానికి చెందిన వెంకటలక్ష్మి కుటుంబసభ్యులు గోదావరి పుష్కర స్నానాల కోసం కుటుంబంతో సహా టవేరా వాహనంలో బయలుదేరారు. రాజమండ్రిలో పుణ్యస్నానాలు ముగించుకొని అటునుంచి అటు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో బూర్గంపల్లి వద్ద టీ తాగడం కోసం వాహనాన్ని రహదారి పక్కన ఆపి అందులోంచి వెంకటలక్ష్మి(49), కుమారి(44), నాగయ్య(40) ముగ్గురు కిందికి దిగారు. అదే సమయంలో ఈ వాహనం వెనక ఒక తుఫాన్ వాహనం నిలిపి ఉంది. దాని వెనక ఉన్న లారీ(ఐచర్) ఈ వాహనాన్ని ఢీ కొనడంతో.. ముందుకు దూసుకొచ్చిన తుఫాన్... వెంకటలక్ష్మి సహా ముగ్గురిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మి, కుమారి అక్కడికక్కడే మృతిచెందగా.. నాగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ నాగయ్యను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆయనకిదే తొలి పుష్కరస్నానం..
నవీపేట(నిజామాబాద్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన స్నేహితులతో కలిసి పుష్కర స్నానం ఆచరించేందుకు గోదావరి పుష్కరాలకు విచ్చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని తుంగిని పుష్కర ఘాట్లో దామోదర తన స్నేహితులతో కలిసి పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం మీడియా ఆయనను సంప్రదించగా.. గోదావరి పుష్కరాలపై ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ.. తనకు ఇదే తొలి పుష్కర స్నానమని చెప్పడం గమనార్హం. -
పుష్కర ఘాట్లకు పోటెత్తిన భక్తులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని పుష్కర ఘాట్లు భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. కరీంనగర్ జిల్లాలోని 39 ఘాట్లలో మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు 14 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ధర్మపురిలో 4,80,000 మంది భక్తులు, కాళేశ్వరంలో 4,20,000 మంది, కోటిలింగాలలోని ఘాట్లలో 1,80,000 మంది, వాలుగొండ, వీవీరావు పేట, ఎవర్దండి, కోమటి కొండాపూర్ ఘాట్లలో 3 లక్షల మంది భక్తులు, మంథనిలో 50వేలు, గోదావరిఖనిలో 50,000 మంది భక్తులు పుష్కర ఘాట్లలో స్నానాలు ఆచరించినట్లు సమాచారం.