
ఆయనకిదే తొలి పుష్కరస్నానం..
నవీపేట(నిజామాబాద్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన స్నేహితులతో కలిసి పుష్కర స్నానం ఆచరించేందుకు గోదావరి పుష్కరాలకు విచ్చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని తుంగిని పుష్కర ఘాట్‌లో దామోదర తన స్నేహితులతో కలిసి పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం మీడియా ఆయనను సంప్రదించగా.. గోదావరి పుష్కరాలపై ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ.. తనకు ఇదే తొలి పుష్కర స్నానమని చెప్పడం గమనార్హం.