చినజీయర్ స్వామికి పాదాభివందనం చేస్తున్న వైఎస్ జగన్, స్వామిని కలసి పలు అంశాలపై చర్చిస్తున్న జగన్
శంషాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలోని జీవా కేంద్రంలో చినజీయర్ స్వామిని ఆయన కలిశారు. ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్.. అక్కడి నుంచి నేరుగా ముచ్చింతల్ వచ్చారు. అరగంటకు పైగా అక్కడ గడిపారు. విద్యా ప్రమాణాల పెంపు, విలువల ఆధారిత బోధనకు జీవా తీసుకుంటున్న చర్యలను స్వామీజీ జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా జగన్ పాదయాత్రపై కాసేపు చర్చ జరిగింది. వైఎస్సార్‌సీపీ అధినేత వెంట ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి, నార్నే శ్రీనివాస్‌రావు ఉన్నారు. వీరందరికీ చినజీయర్‌స్వామి మంగళశాసనాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment