
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిని కలిశారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ సమీపంలో ఉన్న చినజీవయర్ స్వామి ఆశ్రమంలో జరిగిన హోమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. హోమం అనంతరం చినజీయర్ స్వామి ఆశీస్సులను తీసుకున్నారు. కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఉన్నారు. ఎన్నికలకు ముందు చినజీయర్ స్వామి ఆశీస్సులు కేసీఆర్ తీసుకోవడం ఆనవాయితీ. తాజాగా ముందస్తు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసీఆర్ చినజీయర్ ఆశ్రమాన్ని సందర్శించి.. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment