Devotional acitvities
-
విజయవాడ : వైభవంగా ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు (ఫొటోలు)
-
చంద్రగిరి : స్వర్ణరథంపై సౌభాగ్యలక్ష్మీమగా శ్రీ పద్మావతి అమ్మవారు (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
కడప : ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోఉత్సవం (ఫొటోలు)
-
కడప నగరం లో ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజా (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం..భారీగా తరలివచ్చిన భక్తజనం (ఫొటోలు)
-
విజయవాడ : ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి.. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భవానీలు (ఫొటోలు)
-
తిరుమల : రూములు లేవు గోవిందా ... (ఫొటోలు)
-
Naga Panchami: భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు (ఫొటోలు)
-
నిజామాబాద్ : ఘనంగా ఖిల్లా శారదాంబ గద్దె ఊరేగింపు (ఫొటోలు)
-
మహబూబ్‌నగర్ : ఘనంగా పోచమ్మ అమ్మవారి బోనాలు (ఫొటోలు)
-
విజయవాడ : శోభాయమానంగా శ్రీ జగన్నాథ రథయాత్ర (ఫొటోలు)
-
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం (ఫొటోలు)
-
జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేసుకోండి
వారణాసి: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసు బుధవారం అత్యంత కీలక మలుపు తీసుకుంది. మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ చేసిన శాస్త్రీయ సర్వే నివేదిక ప్రకారం మసీదు కింద ఒకప్పుడు ఆలయం ఉండేదని బయటపడిన నేపథ్యంలో హిందువుల అనుకూలంగా వారణాసి కోర్టు నుంచి తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. మసీదు సెల్లార్‌లోని హిందూ దేవతలను ఆరాధించేందుకు, పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు ఒక పూజారికి అనుమతినిస్తూ వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులిచి్చంది. మసీదు ప్రాంగణంపై యాజమాన్య హక్కుల కేసులో పిటిషనర్ అయిన శైలేంద్ర కుమార్ పాఠక్‌కు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని ఆయన తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ చెప్పారు. ‘‘ ఏడు రోజుల్లోగా ఆ మసీదు సెల్లార్లో పూజకు అనువుగా ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను వారణాసి జిల్లా కోర్టు జడ్జి ఏకే విశ్వేశ ఆదేశించారని లాయర్ మదన్ వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాశీ విశ్వనాథ్ ట్రస్టుకు ఈ పూజల బాధ్యతలు అప్పగించింది. పిటిషనర్ శైలేంద్ర తాత,పూజారి సోమ్‌నాథ్ వ్యాస్ గతంలో ఈ సెల్లార్లోనే 1993 డిసెంబర్‌దాకా పూజలు చేసేవారు. ఆ క్రమంలోనే ఇక్కడ పూజలు చేసుకునే హక్కులు తమకు దక్కుతాయంటూ ఆయన కోర్టు ఆశ్రయించారు. మసీదులో చిన్న కొలను వజూఖానా ముందున్న నంది విగ్రహం వద్ద ∙బ్యారీకేడ్లను తొలగించాలని, పూజలకు మార్గంసుగమం చేయాలని జడ్జి ఆదేశించారు. -
Vizianagaram: పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం (ఫొటోలు)
-
విశాఖపట్నం : వైభవంగా పెదవాల్తేరు పోలమాంబ అమ్మవారి జాతర (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సన్నిధిలో వైభవంగా వసంతోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
కాలిఫోర్నియాలో కాశి సందర్శనం..శివపదం నృత్యరూపకం
కాలిఫోర్నియాలోని శాన్ హోసే నగరంలో శివపదం నృత్యరూపకం "కాశి సందర్శనం" కనులపండువగా జరిగింది. ఈ పర్వదినం సందర్భంగా సామవేదం షణ్ముఖశర్మ తెలుగు, సంస్కృత భాషలలో రచించిన వెయ్యికిపైగా శివపదాలు నుంచి కాశి సందర్శనంలోని ఏకాదశ శివపదం కీర్తనలకు మల్లాది సూరిబాబు, మల్లాది శ్రీరాం, మల్లాది రవికుమార్, అనుములయోష, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌లు సంగీతం సమకూర్చి గానం చేసారు. కాశీలో వర్ణించే 11 సంస్కృత కీర్తనలను ఎంపిక చేసుకొని 6 భారతీయ నృత్య శైలుల్లో, 55 మంది ప్రవాస నృత్యకళాకారులు ప్రదర్శించారు. ప్రతి నృత్యం ముందు సామవేదం షణ్ముఖ శర్మ ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయడం అపూర్వ ఘట్టమని నిర్వాహుకులు తెలిపారు. కర్నాటక సంగీతానికి కథక్, ఒడిసి.. హిందుస్తాని సంగీతానికి కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జయ జయ జయ గంగే అనే శివపద కీర్తనతో, నృత్య కారులు, షణ్ముఖ శర్మతో పాటుగా, ఈ కాశి సందర్శనం నృత్యరూపకాన్ని రూపుదిద్ది ప్రాంగణం అంతా శివమయం చేసారు. కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి ఆశీస్సులతో ప్రారంభించిన "నో యువర్ రూట్స్ (ధర్మమూలం)" సంస్థ, అంతర్జాతీయ శివపదం నిర్వాహణ బృందం సభ్యులు సామవేదం షణ్ముఖ శర్మకు శివపద చింతామణి బిరుదును సమర్పించారు. అమెరికాలో కాశిని చూపించిన వాణి గుండ్లాపల్లిని "శివపదాంకిత" అన్న ప్రశంసా బిరుదుని, ఋషిపీఠం తరుపున ఇచ్చి సత్కరించారు. -
నాగ పంచమి: నాగులను పూజించడం వెనుక ఆంతర్యం ఏంటంటే..
‘ఓం సర్పరాజాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్’ ప్రతి ఏటా శ్రావణమాసంలో ఐదవరోజు… శుద్ధ పంచమి రోజును నాగ పంచమిగా పాటిస్తారు. ‘నాగ పంచమి’గా కొందరు, ‘గరుడ పంచమి’ గా మరికొందరూ పూజలు చేస్తారు. నారాయణుడి శయ్య అయిన శేషుడి పేరు మీదుగా చేసుకునే పూజే ‘నాగ పంచమి’. కార్తీకమాసంలో వచ్చే ‘నాగులచవితి’ మాదిరిగానే ‘నాగ పంచమి’ నాడు కూడా నాగదేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజుగా దీనికి ప్రశస్తి. ‘‘నాగుల చవితి’’ రోజులాగే.. ‘‘నాగ పంచమి” నాడు కూడా నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ ఉండవని, చేపట్టిన కార్యాలు సవ్యంగా నెరవేరుతాయని, అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో ‘సర్పం’ దైవ స్వరూపమే. వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు. పరమేశ్వరుడికి కర్ణాభరణమ్. వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు కూడా. వైదిక కాలం నుండి కూడా శ్రావణ మరియు కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయం దేశమంతా నడుస్తోంది. పుట్టలో ఆవుపాలు, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు, జారవిడిచి నైవేద్యంగా సమర్పిస్తారు. పార్వతీ దేవికి పరమేశ్వరుడు ఈ క్రింది విధముగా చెప్పినట్లుగా పురాణాలలో చెప్పడం జరిగినది. ఓ పార్వతీ దేవి, శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగ దేవతారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల సర్ప ప్రతిమను చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల సర్ప చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. పురాణ కథ.. కశ్యప ప్రజాపతి, కద్రువ దంపతులకు.. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , నవనాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు.. జన్మిస్తారు. వీళ్లు కనబడిన వారినల్లా కాటు వేస్తూ ప్రాణాలను హరిస్తుంటారు. దాంతో సకల దేవతలు బ్రహ్మను ఆశ్రయిస్తారు. దీంతో బ్రహ్మ ఆగ్రహించి.. ‘తల్లి చేతిలో శాపానికి గురై వాళ్లంతా నాశనం అవుతార’ని శపిస్తాడు. అప్పుడు ఆ అన్నదమ్ములంతా విధాత ముందు తలవంచుతారు. ‘‘సృష్టించిన మీరే.. మమ్మల్ని నాశనం కావాలని శపించడం న్యాయమా?’’ అని వేడుకుంటారు. దీంతో శాంతించిన బ్రహ్మ.. నిష్కారణంగా ఏ ప్రాణినీ హింసించరాదు. గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మణి సమేతులను తప్పించుకుని తిరగండి . దేవతా విహంగ గణాలకు, జ్ఞాతులైన మీరు.. మీమీ స్థాన గౌరవాలను కాపాడుకోండి. వాయుభక్షకులై సాధుజీవులుగా మారిపోండి. మీ నాగులంతా ఇక అతల, వితల పాతాళ లోకాలలో నివాసం చేయండి’’ అని శాసిస్తాడు. దీంతో ఆ నాగ సంతతి అన్నదమ్ములంతా బ్రహ్మ ఆజ్ఞను శిరసావహిస్తారు. అది చూసి దేవతలంతా నాగులను ప్రశంసించగా.. భూలోక వాసులంతా పూజలు చేశారు. అలా దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతా పూర్వకంగా నాగ పంచమి నాడు నాగులను పూజించడం జనాలకు పరిపాటిగా మారింది. ఎలా చేస్తారంటే.. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా కూడా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నెయ్యితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి. నాగ పంచమి వ్రత కథ పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుండేది. ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుండేవట. దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు, వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . ఆయన విని “అమ్మా ” నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందు వలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , ఇపుడు పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది. నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి. ఆంతర్యం ఇదే.. ఇక ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని, పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు. ఎవరి విశ్వాశము వారిది అని అనుకోవాలి. మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి.. ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శారీరక పరంగా వానరం ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా సర్పం విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే.. సర్పాలు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి నాగసర్పాలు ఆకర్షింపబడతాయి. అలాగే వీటి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ కొంత జరుగుతుందని విశ్వసిస్తారు. పుట్టలో పాలు ఈ క్రింది శ్లోకం చదువుతూ పోయాలి . విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః న తేషా సర్పతో వీరభయం భవతి కుత్ర చిత్।। ఈక్రింది శ్లోకం మననం చేసుకోని పుట్టకు ప్రదక్షిణలు చేస్తే, నాగదోషం మరియు కలిదోషం నశిస్తాయని నమ్మకం . కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం।। గరుడ పంచమి నాగపంచమిలాగే గరుడ పంచమి వ్రతాన్ని కూడా కొందరు చేస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనంద దాయకంగా ఉండాలని, స్త్రీలు తమకు పుట్టిన పిల్లలు గరుత్మంతునిలా బలంగా చురుగ్గా ఉండాలని కోరుతూ గరుడ పంచమి పూజ చేస్తారు. తిరుమలలో స్వామివారు గరుడ పంచమినాడు మాడవీధులలో గరుడ వాహనంపై ఊరేగుతారు, ఈ వ్రతాన్ని తమకు పెద్దల నుంచి అనూచానంగా వస్తున్న విధానం ప్రకారం చేయడం సంప్రదాయం. ఆనవాయితీగా వస్తున్న వారు మాత్రమే చేయాలి. లేనివారు స్నానం చేసి శుచిగా ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్ అనే గరుడ గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మంచిది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సుబ్బారాయుడి షష్ఠి చూసొద్దాం రండి!
సాక్షి, బిక్కవోలు (అనపర్తి): రాష్ట్రవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్టు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జంగా వీర వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ఎనిమిదో తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలు ఆదివారం రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకటో తేదీ రాత్రి తెల్లవారితే రెండో తేదీ సోమవారం 1:10 గంటలకు స్వామి వారి తీర్థపు బిందె సేవతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. షష్ఠి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. సోమవారం ఉదయం నుంచి సన్నాయి, బ్యాండ్ మేళాలతో సందడిగా ఉంటుంది. రాత్రికి భక్తిరంజని కార్యక్రమం, 3న స్వామివారి రథోత్సవం, 8న అన్నదానం కార్యక్రమంతో షష్ఠి ఉత్సవాలు పూర్తవుతాయి. దేదీప్యమానంగా విద్యుత్తు కాంతులు షష్టి ఉత్సవాలకు ఆలయ పరిసరాలు విద్యుత్తు దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ప్రధాన రహదారిలో సినిమా సెంటర్ నుంచి వంతెన వరకు రోడ్డుకు ఇరువైపులా ఎల్ఈడీ దీపకాంతులను ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాన కూడళ్లలో దేవతామూర్తులు, వివిధ అంశాలతో కూడిన ఎల్ఈడీ బోర్డులు ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే చలువ పందిళ్లను రంగురంగుల వస్త్రాలతో అలంకరించారు. ఆలయ చరిత్ర దాదాపు 1100 ఏళ్ల చర్రిత కలిగిన బిక్కవోలులో వేంచేసిన గోలింగేశ్వరస్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ప్రాచీన శివక్షేత్రాల్లో ఒకటి. తూర్పు చాళుక్యుల శిల్పాకళా వైభవంతో నిర్మించిన అనేక పురాతన ఆలయాల్లో ఇది ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్రమాదిత్యుడి పేరిట విక్రమపురంగా, మూడో విజయాదిత్యుడిగా పిలవబడిన గుణగవిజయాదిత్యుని కాలం క్రీస్తు శకం 849–892లో బిరుధాంకినవోలుగా పిలుస్తారు. కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందింది. తూర్పు చాళుక్య రాజుల్లో గుణగవిజయాదిత్యుడు, చాళుక్యభీముడు (క్రీ.శ.892–921) సుప్రసిద్ధులు, గొప్పశివ భక్తులు. వీరిలో గుణగవిజయాదిత్యుడు పశ్చిమ గంగులు, రాష్ట్రకూటులు, కళింగులతో యుద్ధాలు చేసి విజయం సాధించి, శత్రు సంహార పాప పరిహారం కోసం 108 శివాలయాలు నిర్మించగా చాళుక్య భీముడు తన పరిపాలనా కాలంలో 360 శివాలయాలు నిర్మించారు. వీటిలో 101 శివాలయాలు బిక్కవోలు నిర్మించారని పూర్వీకులు చెబుతారు. ఈ గ్రామం దండుపుంత మార్గంలో ఉండుట వల్ల కాలగమనంలో తురుషు్కలు దండయాత్రలు, మురాఠి యుద్ధాల వల్ల చాలా దేవాలయాలు, విగ్రహాలు ధ్వంసమయ్యాయి. నేడు బిక్కవోలు గ్రామాన ఆరు దేవాలయాలు అలనాటి చాళుక్యుల శిల్పాకళా వైభవానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. ఈ గోలింగేశ్వరస్వామి ఆలయంలో పార్వతి అమ్మవారు, కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి వారు దక్షిణ ముఖంగా విజయ గణపతి స్వామి, భద్రకాళి సమేత వీరభద్రేశ్వరస్వామి వారు ఉత్తర ముఖంగా కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయం ఇరుపక్కలా చంద్ర శేఖరస్వామి, రాజరాజేశ్వరస్వామి ఆలయాలు ఒకే ప్రాకారంలో ఉంటాయి. ఆలయ ముఖ ద్వారం కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బ్రహ్మచారిగా కొలుస్తున్నారు. ఈ స్వామి అత్యంత తేజస్సు కలిగి చతుర్బుజుడై అభయ ముద్రలో దర్శనం ఇవ్వడం విశేషం. స్వామికి కుడి వైపున సహజ సిద్ధమైన పుట్ట ఉంది. ప్రతిరోజూ రాత్రి పళ్లెంలో పాలు పోసి ఇక్కడ ఉంచడం ఈ ఆలయ సంప్రదాయం. కుమార స్వామి పళనిలో మాదిరిగానే దక్షిణ ముఖంగా కొలువై ఉన్నందున ఈ స్వామిని దర్శించి అభిషేకాలు జరిపిస్తే స్వామి అనుగ్రహం కలిగి, బాధలు తీరతాయని భక్తుల నమ్మకం. అంగారక క్షేత్రంగా పిలవబడే ఈ దేవాలయంలో దోషనివారణ పూజలు చేయడం వల్ల వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం లభిస్తుందని ప్రజల నమ్మకం. సంతాన ప్రాప్తి కోసం నాగుల చీర మార్గశిర శుద్ధ షష్ఠి రోజున కుమారస్వామి వారి షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. సంతానం లేని మహిళలు పుట్టపై ఉంచిన నాగుల చీరను ధరించి ఆలయం వెనుక నిద్రిస్తే స్వామి సంతాన ప్రాప్తి కలుగ చేస్తాడని పూర్వం నుంచి భక్తుల నమ్మకం. ఈ విశ్వాసంతోనే రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. సంతానం కోసం ఆలయం నిద్రహిస్తున్న మహిళలు ఏర్పాట్లు పూర్తి చేశాం షష్టి ఉత్సవాలకు ఏర్పాటు పూర్తిచేశాం. భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశాం. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల రక్షణకు 200కిపైగా పోలీసు సిబ్బందితో భక్తులకు సేవలందించడానికి సేవాసమితి వలంటీర్లు ఏర్పాటు చేశాం. జంగా వీరవెంకట సుబ్బారెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్, బిక్కవోలు -
జై నారసింహా.. జైజై లక్ష్మీనారసింహా
* మంగళాద్రిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు * ఉత్తరద్వారంలో దర్శనమిచ్చిన శ్రీవారు మంగళగిరి : శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం స్వామివారు బంగారు గరుడవాహనంపై ఉత్తరద్వారంలో దర్శనమిచ్చారు. శనివారం రాత్రి స్వామి వారు జగన్మోహిని అలంకారంలో పుష్పకవిమానంపై గ్రామోత్సవంతో ప్రారంభమైన వేడుకలు అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు తిరువంజనోత్సవం, అభిషకాలు నిర్వహించారు. స్వామివారు బంగారు గరుడవాహనంపై ఉత్తరద్వారంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని శంఖుతీర్ధం స్యీకరించారు. రద్దీ గంటగంటకు పెరగడంతో దైవదర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది. అనంతరం సాయంత్రం శ్రీస్వామివారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి వారు ఉత్తరద్వార దర్శనం ప్రారం¿¶భమైన వెంటనే ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్వామి వారిని దర్శించుకుని శంఖుకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధం స్వీకరించారు. ఆలయ ఈవో మండెపూడి పానకాలరావు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి పూజలు చేయించారు. స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకటరమణ, మురుగుడు హనుమంతరావు, ఇండియా క్రికెట్ సలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కె ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, హైకోర్టు జడ్జి మూర్తి, జిల్లా జడ్జిలు, వివిధ శాఖల అధికారులు స్వామి వారిని దర్శించుకుని శంకుతీర్ధం స్వీకరించారు. ఆలయ అధికారి మండెపూడి పానకలరావు, పాలకవర్గం సభ్యులు ఆలేటి నాగలక్ష్మి, ఊట్ల శ్రీమన్నారాయణ, అనుమోలు సాంబశివరావు, క్రోసూరి శివనాగరాజు, మోరం సాంబశివరావు, పంచుమర్తి ప్రసాద్, ఆర్ శ్రీనివాసరావు, వెనిగళ్ళ ఉమాకాంతంలు వారికి ఆలయమర్యాదలతో స్వాగతం పలకగా అర్చకులు పద్మానాభాచార్యులు తదితరులు పూజలు నిర్వహించారు.