
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఈ నెల 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం కానుంది

మహాపూజకు అవసరమైన పవిత్ర గంగాజలాన్ని జన్నారం మండలం హస్తిన మడుగు నుంచి తెచ్చిన మెస్రం వంశీయులు శుక్రవారం ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు

సంప్రదాయ వాయిద్యాల మధ్య ఆలయం ఎదుట ఉన్న మర్రి చెట్టుపై గంగాజలాన్ని భద్రపర్చారు

ఇంద్రాదేవికి పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు

అనంతరం కేస్లాపూర్ గ్రామ పొలిమేరలోని మర్రి చెట్టు వద్ద బస చేశారు

పుష్యమాస అమవాస్యను పురస్కరించుకుని ఈ నెల 28న రాత్రి 10.30 గంటలకు నాగోబా ఆలయంలో మహాపూజ చేసి జాతరను ప్రారంభించనున్నట్లు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ తెలిపారు

కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి 22 కితల మెస్రం వంశీయులు ఎడ్లబండ్లపై ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు










