
నిత్యం గోవింద నామస్మరణతో మారి మోగే కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు ఈ నేపథ్యంలో గదులకు సైతం అదే తాకిడి ఉంటుంది అయితే గత మూడు రోజులుగా పండుగ సెలవులు కావడంతో తిరుమలకి భక్తులు పోటెత్తారు

ఈ క్రమంలో తిరుమలలో గదుల కోసం, వెయిటింగ్ హాళ్ల కోసం భక్తులు పడిగాపులు కాశారు గదులు కేటాయించే సిఆర్ఓ ఆఫీస్, టీవీ కౌంటర్ , ఏఆర్ పి కౌంటర్ లో గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు గదులు దొరకపోవడంతో క్యూలైన్లు వద్ద లగేజీలతో చిన్నపిల్లలతో వేచి ఉన్నారు మరికొందరు రోడ్ల, షెడ్ల వద్ద నిద్రిస్తూ ఉన్నారు మరికొందరు భక్తులు షూ లైన్ గేట్లను ఎక్కుతూ రూముల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు సోమవారం ఈ చిత్రాలను సాక్షి కెమెరా బంధించింది

ఫోటోలు:-మోహనకృష్ణ కేతారి ,సాక్షి ఫోటోగ్రాఫర్, తిరుపతి















