కాలిఫోర్నియాలోని శాన్ హోసే నగరంలో శివపదం నృత్యరూపకం "కాశి సందర్శనం" కనులపండువగా జరిగింది. ఈ పర్వదినం సందర్భంగా సామవేదం షణ్ముఖశర్మ తెలుగు, సంస్కృత భాషలలో రచించిన వెయ్యికిపైగా శివపదాలు నుంచి కాశి సందర్శనంలోని ఏకాదశ శివపదం కీర్తనలకు మల్లాది సూరిబాబు, మల్లాది శ్రీరాం, మల్లాది రవికుమార్, అనుములయోష, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌లు సంగీతం సమకూర్చి గానం చేసారు.
కాశీలో వర్ణించే 11 సంస్కృత కీర్తనలను ఎంపిక చేసుకొని 6 భారతీయ నృత్య శైలుల్లో, 55 మంది ప్రవాస నృత్యకళాకారులు ప్రదర్శించారు. ప్రతి నృత్యం ముందు సామవేదం షణ్ముఖ శర్మ ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయడం అపూర్వ ఘట్టమని నిర్వాహుకులు తెలిపారు.
కర్నాటక సంగీతానికి కథక్, ఒడిసి.. హిందుస్తాని సంగీతానికి కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జయ జయ జయ గంగే అనే శివపద కీర్తనతో, నృత్య కారులు, షణ్ముఖ శర్మతో పాటుగా, ఈ కాశి సందర్శనం నృత్యరూపకాన్ని రూపుదిద్ది ప్రాంగణం అంతా శివమయం చేసారు.
కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి ఆశీస్సులతో ప్రారంభించిన "నో యువర్ రూట్స్ (ధర్మమూలం)" సంస్థ, అంతర్జాతీయ శివపదం నిర్వాహణ బృందం సభ్యులు సామవేదం షణ్ముఖ శర్మకు శివపద చింతామణి బిరుదును సమర్పించారు. అమెరికాలో కాశిని చూపించిన వాణి గుండ్లాపల్లిని "శివపదాంకిత" అన్న ప్రశంసా బిరుదుని, ఋషిపీఠం తరుపున ఇచ్చి సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment