
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి

రెండో రోజు శుక్రవారం ఉదయం పెద్ద శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకరణలో అమ్మవారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు

భక్తులు కర్పూర నీరాజనాలు సమరి్పంచి మొక్కులు తీర్చుకున్నారు

రాత్రి శ్రీవారి ప్రియసఖి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు హంస వాహనంపై వీణ చేతబట్టి సరస్వతీదేవి అలంకరణలో భక్తులను కటాక్షించారు

వాహన సేవల ముందు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి

కళాకారులు పోటీలు పడిమరీ తమ ప్రతిభను చాటి భక్తులను ఆకట్టుకున్నారు


































