tiruchanuru padmavathi temple
-
చంద్రగిరి : శ్రీమహాలక్ష్మి అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
కాలినడకన వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
-
తిరుచానూరు : శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
-
అమ్మవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం
చంద్రగిరి/తిరుమల: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు గత నెల 30న ప్రారంభమై బుధవారం చక్రస్నానంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానాన్ని ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్కరిణిలో ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారి పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు అమ్మవారు, చక్రత్తాళ్వార్లకు చూర్ణాభిషేకం, ఆస్థానం నిర్వహించి వేంచేపుగా పుష్కరిణిలోని పంచమితీర్థం మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం తిరుమల నుంచి తన దేవేరికి శ్రీవారు పంపించిన ముత్తయిదువు సారెతో అమ్మవారు, చక్రత్తాళ్వార్లకు జీయర్ స్వాముల నేతృత్వంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 11.52 నుంచి 12 గంటల మధ్య కుంభలగ్నంలో ఆలయ అర్చకులు చక్రత్తాళ్వార్లకు చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించిన ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. గురువారం సాయంత్రం అమ్మవారికి పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో జవహర్‌రెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ప్రభుత్వ విప్, టీటీడీ బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బోర్డు సభ్యుడు పోకల అశోక్ కుమార్, జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో కస్తూరిబాయి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి శ్రీవారి సారె: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు. 825 గ్రాములు బరువుగల కెంపులు, పచ్చలు, నీలం, ముత్యాలు పొదిగిన బంగారు పతకం, రెండు బాజీ బందులు శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పించారు. -
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం వేడుకలు
-
తిరుమలలో వైభవంగా అమ్మవారి సారె ఊరేగింపు
తిరుమల: తిరుచానూరు పద్మావతి అమ్మవారికి గురువారం పంచమి తీర్థ మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి సంప్రదాయబద్ధంగా సారెను తీసుకెళ్లారు. వేకువజామున 4.30గంటలకు ఆలయం నుండి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, నైవేద్యాలను సంప్రదాయబద్ధంగా బాజాబజంత్రీలు, అర్చకుల వేదమంత్రాలతో తిరువీధుల్లో ఊరేగింపు జరిపారు. వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలును అమ్మవారికి కానుకగా సమర్పించనున్నారు. మాడ వీధులలో ఊరేగించాక బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నడకమార్గంలో ఈ సారెను ఉదయం పంచమి తీర్థ ఘడియలకు ముందే తిరుచానూరు అమ్మవారికి చేర్చనున్నారు. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు పాల్గొన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఉదయం 11.48 గంటలకు అమ్మవారి పుష్కరిణిలో పంచమి తీర్థ (చక్ర స్నాన) మహోత్సవాన్ని టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు సంయమనం పాటించి భద్రతా సిబ్బందికి సహకరించాలని టిటిడి విఙప్తి చేసింది. -
తిరుచానూరు ఆలయంలో సామూహిక వ్రతాలు
తిరుచానూరు: చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వ్రతాలకు ఏర్పాట్లు చేశారు. ఆస్తాన మండపంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ వ్రతాలు జరగనున్నాయి. అమ్మవారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి అర్చకులు వ్రతాలు నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరిగింది. అభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.