వాషింగ్టన్: హష్‌మనీ కేసులో అమెరికా(USA)కు కాబోయే అధ్యక్షుడు ట్రంప్(Donald Trump)నకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఈ కేసులో జనవరి 20వ తేదీ వరకు తనకు శిక్ష విధింపును ఆపాలని ట్రంప్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ట్రంప్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
న్యూయార్క్ హష్‌మనీ(Hushmoney Case) కేసులో తనకు జడ్జి శిక్ష విధించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని.. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్బంగా ముగ్గురు లిబరల్ న్యాయమూర్తులు ధర్మసనం.. ట్రంప్ అభ్యర్థనలను తిరస్కరించింది. ఇదే సమయంలో అధ్యక్షుడిగా ఎన్నికైన వారి బాధ్యతలపై శిక్ష విధించే భారం సాపేక్షంగా అసంబద్ధమైనది అంటూ ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. దీంతో, ట్రంప్‌కు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో శిక్ష ఖరారై శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ స్పందించారు. తాజాగా మార్-ఎ-లాగోలో ట్రంప్ మాట్లాడుతూ.. కోర్టు తీర్పును నేను గౌరవిస్తున్నాను. ఇది రికార్డు స్థాయిలో ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ అభ్యర్థిపై జరిగిన దాడి. డెమోక్రాట్స్ ఎన్నికలు జరగకుండా ఆపడానికి చేసిన ప్లాన్ ఇది. వారు గెలిచే అవకాశం లేకపోవడంతో ఎదుటి వారిని తీవ్రంగా హింసించడానికి ప్రయత్నించారు అంటూ కామెంట్స్ చేశారు.
🚨🇺🇸 TRUMP RESPONDS TO SUPREME COURT RULING: I RESPECT THE COURT
Trump vows to appeal after Supreme Court allows Friday sentencing to proceed, calling justices' opinion "very good for us" as they "invited the appeal."
Speaking at Mar-a-Lago:
"This was an attack on the… pic.twitter.com/c0xX1Zf5Cu— Mario Nawfal (@MarioNawfal) January 10, 2025
ఇదిలా ఉండగా.. స్టార్మీ డానియల్స్‌తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్‌మనీని ఇచ్చారంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని ట్రంప్ అభియోగాలు కూడా ఉన్నాయి. అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంపై ఇటీవల న్యూయార్క్ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో విచారణ అనంతరం.. న్యాయమూర్తి జస్టిస్ హవాన్ మర్చన్.. ట్రంప్‌నకు జనవరి 10న శిక్ష విధిస్తానని ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో ట్రంప్ జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ‘అన్‌కండిషనల్ డిశ్చార్జ్’ని అమలు చేస్తామన్నారు. శిక్ష విధించే రోజు ఆయన వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టులో హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో, నేడు ఉదయం 9:30 గంటలకు ట్రంప్.. కోర్టుకు వర్చువల్‌గా హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment