![Supreme Court declines to block release of Trump tax returns - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/11/24/trump.jpg.webp?itok=ahrLTfU1)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ బహిర్గతం చేయని ఆరేళ్ల ట్యాక్స్ రిటర్న్ వివరాలను పొందే హక్కు అమెరికా పార్లమెంట్ కమిటీకి ఉందంటూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. దీంతో ఇన్నాళ్లూ ట్యాక్స్ రిటర్స్‌లను బయటపెట్టని ట్రంప్‌కు సమస్యలు ఎదురుకానున్నాయి.
2015–2020 కాలానికి సంబంధించి ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం సహా స్థిరచరాస్తుల ట్యాక్స్ రిటర్న్‌ల వివరాలను బహిర్గతంచేయలేదు. ట్రంప్ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నాయంటూ హౌజ్ వేస్ అండ్ మీన్స్ కమిటీ ఆరోపించింది. కమిటీ దూకుడును అడ్డుకునేందుకు ట్రంప్ కింది కోర్టును ఆశ్రయించారు. అక్కడ ట్రంప్‌కు చుక్కెదురైంది.
Comments
Please login to add a commentAdd a comment