tax payment
-
పన్నుల ప్రణాళిక.. ఎగవేత మధ్య తేడా!
పన్నుల ఎగవేతకు, ప్రణాళికబద్ధంగా పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి గల తేడాలకు సంబంధించి నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇంగ్లీషులో Tax Evasion అంటే ఎగవేత.. ఇంగ్లీషులో Tax Planning అంటే ప్లాన్ చేయడం. ప్లాన్ చేయడం వల్ల Tax Avoidance చేయవచ్చు. ఎగవేత నేరపూరితం. ప్లానింగ్ చట్టబద్ధమైనది. వివరాల్లోకి వెళితే..పన్నుల ప్రణాళిక లక్ష్యాలుచట్టంలో ఉన్న అంశాలకు లోబడి ప్లాన్ చేయడం.అన్ని వ్యవహారాలు, బాధ్యతలు చట్టప్రకారం ఉంటాయి.చట్టప్రకారం అవకాశం ఉన్నంతవరకు పన్ను భారాన్ని తగ్గించుకోవడం.ఇదొక హక్కులాంటిది .. శాస్త్ర సమ్మతమైనది.పన్ను ఎగవేత: ఉద్దేశాలుచట్టంలో అంశాలను ఉల్లంఘించడం.జరిగే వ్యవహారాలు చట్టానికి వ్యతిరేకంగా ఉంటాయి.ఉద్దేశపూర్వకంగా పన్ను తప్పించుకునే మార్గాల అమలు.ఇది నేరం. చట్టవిరుద్ధం.పన్నుల ఎగవేతలో కావాలని పన్నులు కట్టకుండా ఎగవేయడం ఉంటుంది. అది చట్టవిరుద్ధం. అనైతికం. అబద్ధాలు చెప్పి, తప్పులు చేసి, ఎన్నో కుతంత్రాల ద్వారా ఆదాయాన్ని దాచి, దోచి.. పన్నులను కట్టకపోవడం కిందకు వస్తుంది. ఎన్నో మార్గాలను వెతుక్కుని, అమలుపర్చి తద్వారా పన్నులు ఎగవేస్తారు. మోసపూరితమైన వ్యవహారాలు, మోసపూరితమైన సమాచారం, లెక్కలు.. ఇవన్నీ అభ్యంతరకరం. చట్టరీత్యా నేరం. ఎండమావుల్లాగా ప్రయోజనం అనిపిస్తుంది. కానీ ప్రయోజనం ఉండదు. ఎన్నెన్నో ఉదాహరణలు. ఎన్నో మార్గాలు. అడ్డదార్లు. ఎందరో మనకు తారసపడతారు. మెరిసిపోతుంటారు. మురిసిపోతుంటారు. వెలిగిపోతుంటారు. కానీ ఇవన్నీ తాత్కాలికం. ఇలాంటి వారిపై చట్టపరంగా శిక్షలు తీవ్రంగానే ఉంటాయి. వడ్డీలు వడ్డిస్తారు. పెనాల్టీలు వేస్తారు. కటకటాల పాలు కావచ్చు. ఎన్నో చట్టాలు వారిని పట్టుకుంటాయి.ఇదీ చదవండి: అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?పన్నుల ప్లానింగ్ఇక పన్నుల ప్లానింగ్‌లో ఓ పద్ధతి ఉంటుంది. ఇది చట్టానికి లోబడి ఉంది. నైతికంగా ఉంటుంది. అబద్ధం ఉండదు. తప్పు ఉండదు. కుతంత్రం ఉండదు. ఆదాయాన్ని దోచడం ఉండదు. దాచడం ఉండదు. పన్నులు పడకుండా జాగ్రత్త పడటం.. పన్నుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం మోసపూరితం కాదు. లెక్కలు గానీ, సమాచారం గానీ మోసపూరితమైనదిగా ఉండదు. అతిక్రమణ ఉండదు. ప్రయోజనం ఉంటుంది. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్నెన్నో సక్రమమైన మార్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరం 10 కోట్ల 41 లక్షల మంది రిటర్నులు వేశారు. లక్ష మంది వారి ఆదాయం కోటి రూపాయలు ఉన్నట్లు చెబుతున్నారు. వీరే మనకు ఆదర్శవంతులు. మనకు కట్టాల్సిన పన్నుల వివరాలు వెల్లడించడం ద్వారా చట్టప్రకారం అన్ని ప్రయోజనాలు దొరుకుతాయి. ఎటువంటి శిక్షలు ఉండదు. మనం ఈ మార్గాన్నే అనుసరిద్దాం.-కె.సీ.హెచ్ ఏ.వీ.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
ట్యాక్స్ పేయర్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలెర్ట్ చేసింది. మే 31,2024 గడువులోపు పాన్ కార్డ్‌కు ఆధార్ కార్డ్‌ను జత చేయాలని సూచించింది. తద్వారా హైయ్యర్ ట్యాక్స్ డిడక్ట్ నుంచి ఉపశమనం పొందవచ్చని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.పన్ను చెల్లింపుదారులు మీ పాన్‌ను మే 31, 2024లోపు ఆధార్‌తో లింక్ చేయండి. మే 31లోపు మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూలు నుంచి మినహాయింపు పొందవచ్చు. పాన్‌కు ఆధార్ లింక్ చేయకపోతే నిర్ణీత తేదీలోపు పాన్‌కు ఆధార్ జత చేయకపోతే పన్ను చెల్లింపుదారులు గణనీయమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి, వారు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్లు 206ఏఏ, 206సీసీ ప్రకారం అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. Kind Attention Taxpayers, Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024. pic.twitter.com/L4UfP436aI— Income Tax India (@IncomeTaxIndia) May 28, 2024 -
పన్ను చెల్లింపులపై అవగాహన కల్పించాలి
మాదాపూర్: పన్నుల చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత సీఏలపై ఉంటుందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో శుక్రవారం ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ)సంస్థ ఆధ్వర్యంలో సీఏ విద్యార్థుల కోసం అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన గవర్నర్ మాట్లాడుతూ సీఏలు అందరూ తమ వృత్తిలో నిజాయితీగా, పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఆదాయపు పన్ను పత్రాలను, లెక్కలను అర్థం చేసుకోవడం ఒకప్పుడు ఎంతో కష్టంగా ఉండేదని, కానీ కేంద్ర ప్రభుత్వం పన్ను విధానాన్ని సరళతరం చేయడంతో సులువుగా మారిందన్నారు. పన్నుల చెల్లింపుల విషయంలో ప్రజలకు ఉండే అపోహలను, భయాలను తొలగించి వారు పన్నులను సక్రమంగా చెల్లించే విదంగా సీఏలు పనిచేయాలన్నారు. ఐసీఏఐ అధ్యక్షుడు డేబాసిస్ మిత్ర మాట్లాడుతూ ఐసీఏఐలో దాదాపు 325000 మంది సభ్యులు ఉన్నారని, 8 లక్షల మంది విద్యార్థులు సీఏ కోర్సు చదువుతున్నారన్నారు. చార్టర్డ్ అకౌంట్ రంగంలో వస్తున్న మార్పులు, సవాళ్లు వంటి అంశాలపై విద్యార్థులకు, వృత్తి దారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి యేటా సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఐ ఉపాధ్యక్షుడు అనికేత్ సునీల్ తలాటి, ప్రతినిధులు దయా నివాసశర్మ తదితరులు పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ బహిర్గతం చేయని ఆరేళ్ల ట్యాక్స్ రిటర్న్ వివరాలను పొందే హక్కు అమెరికా పార్లమెంట్ కమిటీకి ఉందంటూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. దీంతో ఇన్నాళ్లూ ట్యాక్స్ రిటర్స్లను బయటపెట్టని ట్రంప్‌కు సమస్యలు ఎదురుకానున్నాయి. 2015–2020 కాలానికి సంబంధించి ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం సహా స్థిరచరాస్తుల ట్యాక్స్ రిటర్న్‌ల వివరాలను బహిర్గతంచేయలేదు. ట్రంప్ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నాయంటూ హౌజ్ వేస్ అండ్ మీన్స్ కమిటీ ఆరోపించింది. కమిటీ దూకుడును అడ్డుకునేందుకు ట్రంప్ కింది కోర్టును ఆశ్రయించారు. అక్కడ ట్రంప్‌కు చుక్కెదురైంది. -
Andhra Pradesh: పన్ను చెల్లింపు సులభతరం
మద్యం అక్రమ తయారీ, నిరోధంపై గట్టి చర్యలు తీసుకోవాలి. నాటుసారా తయారీ వృత్తిగా కొనసాగిస్తున్న వారి జీవితాలను మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను వారికి అందుబాటులోకి తీసుకు రావాలి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలి. – సీఎం వైఎస్ జగన్ రిజిస్ట్రేషన్ ఆదాయాలపై ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రజత్ భార్గవ, నీరబ్ కుమార్ ప్రసాద్, గుల్జార్ సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. రెండు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ అవసరమయ్యే సేవలు ఏమిటి? వాటివల్ల ఎలాంటి హక్కులు ఉంటాయి? దాని వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం? అనే విషయాలపై అవగాహన కల్పించాలి. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రొఫెషనల్ ఏజెన్సీల సహాయం తీసుకుంటూ నాన్ రిజిస్ట్రేషన్ పరిస్థితులను పూర్తిగా తొలగించాలి. సాక్షి, అమరావతి: పన్ను చెల్లింపుదారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పన్నుల్లో ఎక్కడా లీకేజీలు (ఎగవేతలు, ఆదాయాన్ని తక్కువ చేసి చూపడం, తప్పుడు లెక్కలు) లేకుండా చూసుకోవాలని, వాటిని అరికట్టడానికి అవసరమైతే ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ల సహాయం తీసుకోవాలని స్పష్టం చేశారు. మద్యం అక్రమ తయారీ, విక్రయాలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలని చెప్పారు. గ్రామాల్లో మహిళా పోలీసుల నుంచి తప్పనిసరిగా ప్రతి రోజూ నివేదికలు తీసుకుంటూ, వాటి ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వాణిజ్య, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, గనులు, అటవీ, రవాణా శాఖల కార్యకలాపాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అనుమతులు పొందిన లీజుదారులు మైనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, వారికేమైనా ఇబ్బందులు ఉంటే తీర్చాలని ఆదేశించారు. రవాణా శాఖలో ఆదాయం పెంపుపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందని, జీఎస్టీ వసూళ్లు బాగున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం ► ఆస్తుల విలువ మదింపు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై హేతుబద్ధత ఉండేలా చూడాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలకు సులభతరం చేసేందుకు, అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రొఫెషనల్ ఏజెన్సీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో సంపూర్ణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడిచేందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాలి. భూములు, ఆస్తులే కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోతగిన సేవల వివరాలను పోస్టర్ల రూపంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఫిర్యాదు నంబరు ఉంచాలి. ► మైనింగ్ కోసం ఇప్పటికే అనుమతులు పొందిన వారు, లీజు లైసెన్సులు పొందిన వారు మైనింగ్ ఆపరేషన్ కొనసాగించేలా చూడాలి. దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయి. ఆపరేషన్‌లో లేని వాటిపై దృష్టి పెట్టి, లీజుదారులకున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ► మైనింగ్ ఆపరేషన్ చేయకపోవడానికి కారణం ఏంటి? వారికున్న ఇబ్బందులు ఏంటి? వారికి చేదోడుగా ఎలా నిలవాలి? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి నెలా సమగ్ర సమీక్ష జరిపి, ఆదాయాలు వృద్ధి చెందేలా తగిన చర్యలు తీసుకోవాలి. లక్ష్యాలను చేరుకుంటున్నామా? లేదా? అన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలి. ► రవాణా శాఖలో ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి. కేవలం పన్నులు పెంచడమే దీనికి పరిష్కారం కాదు. వినూత్న ఆలోచనలు చేయాలి. పక్క రాష్ట్రాలతో పోలిస్తే.. వాహనాల కొనుగోలుకు రాష్ట్రంలో తగిన సానుకూల పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి డీలర్లు డబ్బు తీసుకుని, వాహనాలు ఇవ్వని ఘటనలు వెలుగు చూశాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె.నారాయణస్వామి, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వై మధుసూధన్‌రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లక్ష్యం దిశగా ఆదాయం ► ‘గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబర్ వరకు రూ.1,174 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రూ.1,400 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా 19 శాతం పెరుగుదల నమోదైంది. మొత్తం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 43 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేశాం’ అని అధికారులు సీఎంకు తెలిపారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీఎస్టీ వసూళ్లు సహా.. ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. పారదర్శక విధానాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైంది. 2022 సెప్టెంబర్ వరకు లక్ష్యం రూ.27,445 కోట్లు కాగా, రూ.25,928 కోట్ల ఆదాయం వచ్చింది. 94.47% లక్ష్యం చేరుకున్నాం’ అని చెప్పారు. ► లీకేజీలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంను అభివృద్ధి పరిచామని, హెచ్ఓడీ కార్యాలయంలో డేటా అనలిటిక్స్ సెంటర్ ఏర్పాటు చేసి.. సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు. -
పన్ను వేధింపులకు చెక్
సాక్షి, హైదరాబాద్: మీరు సక్రమంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చెల్లిస్తున్నారా? మీ వ్యాపారానికి అనుగుణంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని సకాలంలో జమ చేస్తున్నారా? సమాజంలో పలుకుబడి, ప్రతిష్ట ఉన్న మీ పరపతి దెబ్బతినే విధంగా మీరు సకాలంలో జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికీ పన్ను కట్టడం లేదంటూ నోటీసులు వస్తున్నాయా? సమన్లూ అందుతున్నాయా? అరెస్టు చేస్తామంటూ వారెంట్లు విడుదలవుతున్నాయా? ఈ వేధింపులన్నింటికీ కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. పన్ను చెల్లింపు సక్రమంగా లేదంటూ డీలర్లపై ఎలాంటి విచారణ చేపట్టాలన్నా ఇక నుంచి మాన్యువల్‌గా చేస్తే ఒప్పుకోబోమని, ప్రతి డీలర్‌కు డాక్యుమెంటేషన్ ఐడింటిఫికేషన్ నెంబర్ (డీఐఎన్) ఇచ్చి ఆ నెంబర్ ద్వారా విచారణ ప్రక్రియకు సంబంధించిన లావాదేవీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (సీబీఐసీ) దేశంలోని అన్ని రాష్ట్రాల అధికారులకు లేఖలు రాసింది. పరోక్ష పన్నుల వసూళ్లలో పారదర్శకత, జవాబుదారీతనం తెచ్చేందుకు గాను సీజీఎస్టీ– 2017 చట్టంలోని సెక్షన్ 168 (1), కేంద్ర ఎక్సైజ్ చట్టం – 1944, సెక్షన్ (37), కస్టమ్స్ చట్టం – 1961లోని సెక్షన్ 151(ఏ)ల ప్రకారం డీఐఎన్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్టు ఈ లేఖలో పేర్కొంది. నంబర్ జనరేట్ చేసిన తర్వాతే జీఎస్టీ పరిధిలో రిజిస్టర్ అయిన ప్రతి డీలర్‌కు ఈ చట్టం ప్రకారం డీఐఎన్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈనంబర్‌ను కేవలం విచారణ ప్రక్రియకు మాత్రమే పరిమితం చేస్తున్నా, మరో నెలరోజుల వ్యవధిలో అన్ని రకాల లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఈ నెంబర్ ద్వారానే తెలియజేయాలని సీబీఐసీ భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది కూడా. తాజాగా వచి్చన ఉత్తర్వుల ప్రకారం డీలర్ల నుంచి పన్ను వసూలు చేసేందుకుగాను సోదాలకు అనుమతివ్వడం, సమన్లు జారీ చేయడం, అరెస్టు మెమోలివ్వడం, తనిఖీ నోటీసులు పంపడం, విచారణ పేరుతో లేఖలు పంపడం లాంటివి ఈ నంబర్ ద్వారానే ఎల్రక్టానిక్ పద్ధతిలో జరపాల్సి ఉంటుంది. అలా చేయని ఎలాంటి లావాదేవీ అయినా చెల్లుబాటు కాదని రాష్ట్రాలకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. చాలా పరిమితమైన కేసుల్లో మాత్రమే మాన్యువల్ పద్ధతిలో విచారణ చేపట్టవచ్చని, ఇందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయడంతో పాటు విచారణ ప్రక్రియ ప్రారంభించిన 15 రోజుల్లోపు సంబంధిత ఉన్నతాధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ఉన్నతాధికారులు అనుమతి ఇస్తున్న మాన్యువల్ ప్రక్రియను కూడా 15 రోజుల్లోగా కంప్యూటరైజేషన్ చేయాల్సిందే నని స్పష్టం చేసింది. ఈ తాజా ఉత్తర్వులతో çపన్ను ఎగవేతదారుల నుంచి పన్ను వసూలు చేసే క్రమంలో ఇటు జీఎస్టీ, అటు సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు జరిపే ప్రతి లావాదేవీ ఆన్లైన్లోనే జరగనుంది. దీంతో పన్ను వేధింపుల నుంచి తమకు ఊరట లభిస్తుందని రాష్ట్రంలోని కొందరు బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రెవెన్యూకి రక్షణ ‘ఈ విధానం ద్వారా ప్రభుత్వం నుంచి పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి లెటర్ వచి్చనా ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి లావాదేవీని ప్రభుత్వం స్రూ్కటినీ చేస్తుంది. నోటీసులు లేదా ఇతర లేఖలు జారీ చేసే అధికార్లకు బాధ్యత ఉంటుంది. గతంలో ఈ విధానం లేకపోవడంతో అవినీతికి ఆస్కారం ఉండేది. అక్రమార్కులు, అధికారులు కుమ్మక్కయి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు పన్ను ఎగవేతకు ఆస్కారం ఉండదు. ప్రభుత్వ రెవెన్యూకి ఈ విధానం రక్షణగా ఉంటుంది.’ సుదీర్ వి.ఎస్, చార్టర్డ్ అకౌంటెంట్, హీరెగంగే అండ్ అసోసియేట్స్ ప్రతి లావాదేవీ ట్రాక్.. ‘ఈ విధానం అమల్లోకి రావడం ద్వారా పన్ను చెల్లింపుదారుడు జరిపే ప్రతి లావాదేవీ ట్రాక్ అవుతుంది. లావాదేవీల తారుమారుకు అవకాశముండదు. పన్ను వసూలులో ఇది మంచి సంస్కరణ. దీని ద్వారా అసలైన డీలర్ ఎవరనేది నిర్ధారణ అవుతుంది. పన్ను చెల్లింపు విధానంలో వేధింపులు తగ్గిపోతాయి.’ గడ్డం రామకృష్ణ, చార్టర్డ్ అకౌంటెంట్, ఎస్‌వీఆర్‌ఎల్ అసోసియేట్స్ -
పన్ను చెల్లింపుదార్ల కోసం ఐటీ యాప్
న్యూఢిల్లీ: పన్నుల చెల్లింపులు, పాన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైన వాటిని మరింత సులభతరం చేసేలా ఆదాయ పన్ను శాఖ తాజాగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆదాయ పన్ను శాఖకు, అసెసీలకు మధ్య వారధిలా ఉపయోగపడేలా రూపొందించిన ఈ ’ఆయకర్ సేతు’ యాప్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది పనిచేస్తుంది. పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన సర్వీసులు అందించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు మంత్రి చెప్పారు. దీనితో పన్నుల చెల్లింపులు, పర్మనెంట్ అకౌంటు నంబరుకు దరఖాస్తు చేయడం, పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయడం వంటి పనులను ఎవరి సహాయం అవసరం లేకుండా ఇంటి వద్ద కూర్చునే అసెసీ సులభంగా పూర్తి చేసుకోవచ్చని ఆయన వివరించారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే కాకుండా 7306525252కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో యాప్ ద్వారానే ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఆప్షన్‌ను కూడా సీబీడీటీ అందుబాటులోకి తేనుంది. పన్నుల చెల్లింపునకు సంబంధించిన కీలకమైన తేదీలు, ఫారమ్‌లు, నోటిఫికేషన్స్ మొదలైనవి రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఐటీ శాఖ పంపనుంది. ఎస్ఎంఎస్ అలర్ట్‌లు కావాలనుకునే వారు ఆయకర్ సేతు మాడ్యూల్లో తమ మొబైల్ నంబర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
పీఎంజీకేవై పన్ను వసూళ్లపై బ్యాంకులకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద జమయ్యే డిపాజిట్లకు సంబంధించి పన్ను చెల్లింపులను స్వీకరించేందుకు నిరాకరించే శాఖల గుర్తింపు రద్దు చేస్తామంటూ బ్యాంకులకు కేంద్రం హెచ్చరించింది. ఈ పన్నులను స్వీకరించేలా సాఫ్ట్వేర్/సిస్టమ్స్‌లో తగు మార్పులు చేసేలా శాఖ లను ఆదేశించాలంటూ బ్యాంకుల చీఫ్‌లకు ఆర్థిక శాఖ సూచించింది. డీమోనిటైజేషన్ దరిమిలా లెక్కల్లో చూపని నగదును పీఎంజీకేవై స్కీము కింద 50% పన్ను, పెనాల్టీ కట్టి ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
గౌరవించడంతో ట్యాక్స్‌పేయర్లలో మార్పు
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులను గౌరవించడం వల్ల పన్ను చెల్లించే విషయమై ప్రజల వైఖరిలో మార్పు వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. సకాలంలో పన్ను చెల్లించడం అన్నది ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు. సకాలంలో పన్ను చెల్లించి మార్గదర్శకంగా నిలిచిన పలువురు ట్యాక్స్‌పేయర్లను అభినందిస్తూ జైట్లీ సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వారికి సర్టిఫికెట్లను అందజేశారు. సకాలంలో పన్నులు చెల్లించిన 8.43 లక్షల మందిని అభినందిస్తూ ‘లెటర్ ఆఫ్ అప్రీసియేషన్’ను ఐటీ శాఖ మెయిల్ చేయనుంది. రూ.ఒక లక్ష నుంచి రూ.కోటికి పైగా పన్ను చెల్లించే వివిధ వర్గాల వారు ఈ మెయిల్స్ అందుకోనున్నారు. పన్నులను చెల్లించే విషయమై ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఈ చర్యలు ఫలితమిస్తాయని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ముందుకు రండి.. పూర్తి గోప్యత’ నల్లధనం వెల్లడికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్చంద ఆదాయ వెల్లడి (ఐడీఎస్) పథకం గడువు ఈ నెల 30తో ముగియనుండడంతో ఆదాయపన్ను శాఖ అసెస్సీలకు ఎస్ఎంఎస్లు పంపిస్తోంది. ఈ పథకంలో భాగంగా వెల్లడించే రహస్య ఆస్తుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని, ఎవరితోనూ పంచుకోబోమంటూ ఎస్ఎంఎస్లలో హామీ ఇస్తోంది. ఐడీఎస్ పథకంలో భాగంగా అక్రమ ఆస్తులను ప్రకటించి వాటి విలువపై మొత్తంగా 45 శాతం పన్ను చెల్లించి సక్రమంగా మార్చుకునే అవకాశం ఉంది. ఈ పన్నును కూడా మూడు వాయిదాలుగా చెల్లించవచ్చు. 25 శాతాన్ని మొదటి వాయిదాగా నవంబర్‌లోపు చెల్లించాలి. మరో 25 శాతాన్ని 2017 మార్చిలోపు, మిగిలిన 50 శాతాన్ని 2017 సెప్టెంబర్‌లోగా చెల్లించాల్సి ఉంటుంది. -
నల్లధనంపై పన్ను చెల్లింపు గడువు పొడిగింపు!
న్యూఢిల్లీ: నల్లధనం స్వచ్చంధ వెల్లడికి సంబంధించి పన్ను చెల్లింపు గడువును పొడిగించే అవకాశం ఉందని అత్యున్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. దఫాల వారీగా పన్ను చెల్లింపు వెసులుబాటు కల్పించాలని పరిశ్రమ చేసిన విజ్ఞప్తిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2016-17 బడ్జెట్ ప్రతిపాదన మేరకు 4 నెలలు అమల్లో ఉండే ఈ పథకం జూన్ 1వ తేదీన ప్రారంభమైంది. సెప్టెంబర్ 30వ తేదీతో ముగి యనుంది. దీని ప్రకారం వన్‌టైమ్ విండో- 2016 ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ (ఐడీఎస్) కింద జూన్-సెప్టెంబర్ మధ్య ప్రకటించిన ఆదాయం పై 45% పన్ను, జరిమానాను నవంబర్‌లోపు చెల్లించాల్సి ఉంది. తద్వారా ప్రాసిక్యూషన్, కఠిన శిక్షల నుంచి మినహాయింపు పొందే వీలుంది. నవంబర్‌లో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సంబంధ సమస్యలు ఉండే వీలున్నందున, ఐడీఎస్ పన్ను చెల్లింపు గడువును పెంచాలని ఇటీవల ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నిర్వహించిన ఒక సమావేశంలో పారిశ్రామిక ప్రతినిధులు, సీఏలు, పన్ను సంబంధ వృత్తి నిపుణులు విజ్ఞప్తి చేశారని దీనిని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఉన్నతాధికారి తెలిపారు. రెసిడెంట్, నాన్-రెసిడెంట్ వ్యక్తులకు వర్తించే ఈ పథకం గురించి ఇంకా పలు సందేహాలు, ప్రశ్నలు వస్తున్నాయని, ఈ సందేహాలను వ్యక్తిగతంగా నివృత్తి చేస్తున్నామని అధికారి తెలిపారు. ఈ స్కీమ్ విషయంలో పురోగతిని ప్రతివారం పన్ను అధికారులతో రెవెన్యూ కార్యదర్శి హాస్ముఖ్ ఆదియా సమీక్షలు నిర్వహిస్తున్నారు. -
అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత్ ఐటీ దన్ను
టాప్ 5 నగరాల్లో కాలిఫోర్నియా.. భారతీయ ఐటీ కంపెనీలు ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్ 5 అమెరికన్ నగరాల్లో కాలిఫోర్నియా, టెక్సాస్, ఇలినాయి, న్యూజెర్సీ, న్యూయార్క్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. విదేశీ ఉద్యోగులు అమెరికన్ల ఉద్యోగావకాశాలు దెబ్బతీస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను నివేదిక తోసిపుచ్చింది. అక్కడి స్థానికంగా నిపుణుల కొరతే దీనికి కారణమని వివరించింది. - 4 లక్షల ఉద్యోగాల కల్పన - 20 బిలియన్ డాలర్ల పన్నుల చెల్లింపు - నాస్కామ్ నివేదిక వాషింగ్టన్: ఉద్యోగాల కల్పన, పెద్ద ఎత్తున పన్నుల చెల్లింపు రూపంలో భారతీయ ఐటీ కంపెనీలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పాటు అందిస్తున్నాయని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఒక నివేదికలో పేర్కొంది. 2011-15 మధ్య కాలంలో అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీలు దాదాపు 4,11,000 ఉద్యోగాలు కల్పించాయని, 20 బిలియన్ డాలర్ల మేర పన్నులు చెల్లించాయని, 2 బిలియన్ డాలర్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. అమెరికా ఎకానమీకి భారతీయ టెక్ పరిశ్రమ తోడ్పాటు పేరిట రూపొందించిన ఈ నివేదికను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆవిష్కరించారు. భారత్ అమెరికా మధ్య తొలి వ్యూహాత్మక, వాణిజ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయుల నైపుణ్యాలను ఉపయోగించుకుని అమెరికా సంస్థలు వినూత్న ఆవిష్కరణలు, సేవలతో అంతర్జాతీయ మార్కెట్లో తమ వాటాను మెరుగుపర్చుకోగలిగాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే సామాజిక సంక్షేమ కార్యక్రమాల రూపంలో 1,20,000 మంది అమెరికన్లకు భారతీయ కంపెనీలు తోడ్పాటు అందించాయని వివరించారు. దీనికి తోడు ఫార్చూన్ 500 కంపెనీలతో పాటు వేల కొద్దీ అమెరికన్ వ్యాపార సంస్థలకు ఆర్థిక, నిర్వహణ అంశాలపరంగా భారతీయ ఐటీ కంపెనీలు గణనీయంగా సేవలు అందిస్తున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. -
పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త ఆన్లైన్ కాలిక్యులేటర్
న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) కంప్యూటర్ ఆధారిత కొత్త ఆన్లైన్ కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిసాయంతో అసెస్సీలు వార్షికంగా తాము చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని చాలా సులువుగా సరిచూసుకోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2015-16 అసెసెమెంట్ ఇయర్లో పన్ను చెల్లింపుదారులకోసం కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాల(ఐటీఆర్)ను సీబీడీటీ ఇటీవలే నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఐటీ శాఖ అధికారిక వెబ్సైట్లో ఈ ఆన్లైన్ కాలిక్యులేటర్‌ను వినియోగించుకోవచ్చని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్ను శ్లాబ్‌లు, రేట్లకు సబంధించి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ కాలిక్యులేటర్లో తగిన మార్పుచేర్పులు చేశారు. వ్యక్తిగత, కార్పొరేట్ లేదా ఇతరత్రా ఏ సంస్థలైనా తమ పన్ను లెక్కింపు కోసం కొత్త కాలిక్యులేటర్‌ను వాడొచ్చని ఆయా వర్గాలు వివరించాయి. అయితే, కొన్ని సంక్లిష్టమైన కేసుల విషయంలో ఐటీఆర్‌లలో విభిన్న అంశాలు ఉంటాయని.. అందువల్ల ఆయా అసెస్సీలు పూర్తిగా ఈ కాలిక్యులేర్పైనే ఆధారపడవద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. -
పన్నుల చెల్లింపు సులభతరం చేస్తున్నాం
న్యూఢిల్లీ : పన్నుల చెల్లింపుల విధానాన్ని మరింత సులభతరం చేస్తున్నామని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్పర్సన్ అనితా కపూర్ తెలిపారు. తద్వారా పన్ను చెల్లింపుదారులు.. ఐటీ విభాగం కార్యాలయాలకి అసలు వెళ్లాల్సిన అవసరమే లేకుండా చూసేలా ప్రయత్నిస్తున్నామని ఆమె తెలిపారు. చట్టాలను సక్రమంగా పాటించేందుకు పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించే విధంగా సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెడుతున్నామని వివరించారు. ప్రొఫెషనల్స్ సహాయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా సామాన్య చెల్లింపుదారులు తమంతట తామే ఫైలింగ్ చేసేంత సులభతరంగా ప్రక్రియను చేయాలని భావిస్తున్నట్లు అనితా కపూర్ పేర్కొన్నారు. -
సెంట్రల్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్‌కు పాన్ తప్పనిసరి
న్యూఢిల్లీ: వ్యాపార లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో ఎటువంటి ఆర్థిక అవకతవకలకూ వీలులేకుండా తగిన చర్యలు తీసుకునే దిశలో కేంద్రం మరో ముందడుగు వేసింది. సెంట్రల్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్‌ను కోరుకునే ప్రైవేటు సంస్థలకు సంబంధిత యజమాని లేదా చట్టబద్ధమైన సంస్థ పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్)ను తప్పనిసరి చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అప్లికెంట్ తన ఈ మెయిల్ అడ్రస్‌ను, మొబైల్ నంబర్‌ను కూడా అప్లికేషన్లో తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా తమ ఆన్లైన్ అప్లికేషన్లలో ప్రభుత్వ శాఖలు పాన్‌ను తెలపనక్కర్లేదని ప్రకటన పేర్కొంది. దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులపై విధించిన ఎక్సైజ్ సుంకం చెల్లింపునకు సెంట్రల్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దీనివల్ల అసెస్సీ ఆన్లైన్లో చెల్లింపులు జరిపే వీలుంటుంది. -
విచ్చలవిడిగా లేఅవుట్లు నిబంధనలకు తూట్లు
అధికారుల కళ్లుగప్పి అమ్మేసుకుంటున్న రియల్టర్లు ముడుపులు ముట్టజెప్పి రిజిస్ట్రేషన్లు నాలా పన్ను కూడా చెల్లించని తీరు గుడివాడ : గుడివాడ పరిసర ప్రాంతాల్లో అనధికారిక లేఅవుట్లు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. సీఆర్డీఏ పరిధిలో గుడివాడతో పాటు పరిసర ప్రాంత మండలాలు ఉన్నాయి. దీంతో సీఆర్డీఏ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనుమతి లేకుండా ఎటువంటి లేఅవుట్లూ వేయకూడదని ప్రభుత్వం తేల్చి చెబుతున్నా ఇక్కడ రియల్టర్లు మాత్రం విచ్చలవిడిగా ప్లాట్లువేసి విక్రయాలు జరుపుతున్నారు. రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల కళ్లుగప్పి కనీసం భూమి మార్పిడి పన్ను కూడా చెల్లించకుండా పంట పొలాల్లో రోడ్లు వేసి ప్లాట్లుగా విక్రయిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాస్టర్ ప్లాన్‌కు తూట్లు... మాస్టర్ ప్లాన్ ప్రకారం గుడివాడకు అవుటర్ రింగ్‌రోడ్ భూషణగుళ్ల పంచాయతీ పరిధిలోని ఏఎన్నార్ కళాశాల వెనుక వైపు ఉంది. గతంలో ఆప్రాంతంలో ప్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి 100 అడుగుల అవుటర్ రింగ్‌రోడ్డును వదిలేశాడు. ఇటీవల దీని పక్కనే ప్లాట్లు వేస్తున్న వ్యక్తి అవుటర్ రింగ్ రోడ్డులో ఉన్న 18 సెంట్ల భూమిని కూడా ప్లాట్లుగా వేసి అమ్మేస్తున్నాడు. మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లు వేసిన ఈ వ్యక్తి కనీసం నాలా పన్ను కూడా చెల్లించలేదని సమాచారం. సీఆర్డీఏ పరిధిలో ఉన్న అన్ని వెంచర్లూ తప్పనిసరిగా సీఆర్డీఏ నిబంధనలు తీసుకుని ప్లాట్లు విక్రయించాలి. ఇది వ్యయ ప్రయాసలతో కూడినది కావటంతో పాటు అనుమతులు రావటం లేదని చెప్పి ప్లాట్లుగా వేసి అమ్మేసుకుంటున్నారు. ఇటువంటి ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకూడదని తెలిసినా రిజిస్ట్రార్ కార్యాలయంలో చక్రం తిప్పే ఒక డాక్యుమెంటరీ రైటర్ సాయంతో కార్యాలయంలోని అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పి ఆ ప్రక్రియా పూర్తి చేస్తున్నట్లు వినికిడి. అవుటర్ రింగ్ రోడ్డును కూడా రిజిస్ట్రేషన్ చేయించే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. సీఆర్డీఏ నిబంధనల ప్రకారం అన్ని రోడ్లూ 60 అడుగులు ఉండాలి. డ్రైనేజీ, వీధిలైట్లతో పాటు పది శాతం సామాజిక అవసరాల కోసం స్థలం కేటాయించాలి. ఇన్ని నిబంధనలు గాలికి వదిలి ప్లాట్లు అమ్మేస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవటం లేదని స్థానికులు అంటున్నారు. ఇది వెంచర్ సమీపంలో మరో ఎకరంన్నర పంట పొలాన్ని ప్లాట్లుగా విక్రయించటానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అనధికారిక లేఅవుట్లపై చర్యలు తీసుకుంటాం... సీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా వేసిన అనుమతి లేని ప్లాట్లపై చర్యలు తీసుకుంటామని గుడివాడ ఆర్డీవో ఎస్.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. నాలా పన్ను చెల్లించకుండా రోడ్లు వేసిన రియల్టర్‌పై పెనాల్టీ విధించి ఆ ప్లాట్లను దున్నేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. గురువారం గుడివాడకు వచ్చిన జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు దృష్టికి అనధికార లేఅవుట్ల వ్యవహారాన్ని విలేకరులు తీసుకెళ్లగా, అనుమతులు లేని ప్లాట్లపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఎస్.వెంకటసుబ్బయ్యకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అటువంటి ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోరాదని ప్రజలకు సూచించారు. -
పన్ను విధింపుపై పునరాలోచించాలి
రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి అదనపు పన్ను భారం ప్రజలపైనే పడుతుందని ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రవాణా వాహనాలపై పన్ను విధించాలని తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సర్కారు అదనంగా రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్లు ట్యాక్స్ రూపంలో లాభం చూసుకుంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ ప్రభావం తెలంగాణ ప్రజలపై పడుతుందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలకు అదనపు పన్ను వసూలు చేస్తాం, ఈ విషయంలో ఇక ముందు ఎవరితోనూ చర్చలుండవని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొనడం సబబుగా లేదని, ఇది ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. పంజాబ్, హరియాణాలకు ఛండీగఢ్ రాజధాని అని అక్కడ ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయడం లేదని గుర్తుచేశారు. అక్కడి నిబంధనలనే తెలంగాణ సీఎం కేసీఆర్ పాటిం చాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉందన్న విషయం మరువకూడదన్నారు. 2 రాష్ట్రాల రవాణా విషయంలో ప్రజలు, వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పా రు. తెలంగాణ సర్కారు అవలంబించిన పన్ను వసూలు విధానం ఏపీ సర్కారు కూడా అవలంబిస్తే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటో ఓసారి ఆలోచించాలని కోరారు. వాహనాలపై విధించే అదనపు పన్ను భారం చివరికి రెండు రాష్ట్రాల ప్రజలపైనే ఏదో ఒకవిధంగా పడుతుందన్నా రు. వైఎస్సార్ సీపీకి రెండు తెలుగు రాష్ట్రాలూ సమానమేనని, రెండు రాష్ట్రాల ప్రజలు ఇబ్బం దులు పడకూడదని తాము ఆలోచిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో సరుకు రవాణా భారంగా మారనుందని, ఉభయ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్‌కు కూరగాయలు, పూలు, పండ్లు రవాణా అవుతుంటాయని, వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని రాఘవరెడ్డి చెప్పారు. -
పెరిగిన ఎస్బీఐ అడ్వాన్స్ టాక్స్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి దేశీ కార్పొరేట్ సంస్థల ముందస్తు పన్ను చెల్లింపులు అంతంత మాత్రంగానే ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. క్యూ3 ముందస్తు పన్ను చెల్లింపుల గడువు సోమవారం(16న) ముగిసింది. సంబంధిత వర్గాల వివరాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ. 1,425 కోట్లను చెల్లించింది. గతేడాది(2013-14) ఇదే క్వార్టర్లో రూ. 1,130 కోట్లను మాత్రమే చెల్లించింది. ఈ బాటలో గృహ రుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీ 13% అధికంగా రూ. 735 కోట్ల పన్ను చెల్లించినట్లు తెలుస్తోంది. గతంలో రూ. 650 కోట్లను చెల్లించింది. ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తాజాగా రూ. 135 కోట్ల పన్ను కట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ముంబై నుంచి రూ. 2.30 లక్షల కోట్లు ఈ ఏడాదికి పెట్టుకున్న ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యం రూ. 7.36 లక్షల కోట్లుకాగా, వీటిలో దేశ ఆర్థిక రాజధానిగా భావించే ముంబై నుంచి రూ. 2.30 లక్షల కోట్లు లభించగలవని ఆదాయ పన్ను శాఖ భావిస్తోంది. కాగా, ఈ ఏడాది తొలి అర్థభాగంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా 7% మాత్రమే పెరిగి రూ. 2.68 లక్షల కోట్లకు చేరాయి. లక్ష్యంగా పెట్టుకున్న 17% వృద్ధితో పోలిస్తే ఈ గణాంకాలు నిరుత్సాహం కలిగించేవే. ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారీ స్థాయిలో లాభాలు ఆర్జించే కార్పొరేట్లు, వ్యక్తులు దఫదఫాలుగా చెల్లించే పన్నునే ముందస్తు పన్ను చెల్లింపులుగా పేర్కొంటారు. సాధారణంగా రెండో క్వార్టర్లో కంపెనీలు 30% పన్నును ముందస్తుగా చెల్లిస్తాయి. కార్పొరేట్ల ముందస్తు పన్ను చెల్లింపులు వాటి పనితీరును తెలియజేస్తాయని ఒక అంచనా. -
ఐదేళ్లలో 200% పెరిగిన ఐటీ వసూళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదాయం పన్ను(ఐటీ) వసూళ్లు ఏటా పెరుగుతున్నాయి. కార్పొరేట్ రంగంతో పాటు, అన్ని వర్గాల్లోనూ ఇదే పురోగతి కొనసాగుతోంది. 2005-06 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ. 6,683 కోట్ల ఆదాయం పన్ను వసూలైతే.. 2013-14 నాటికి ఇది రూ. 30 వేల కోట్లు దాటింది. 2005 నుంచి 2010 నాటికి దాదాపు 210 శాతం పన్ను వసూళ్లు పెరిగినట్టు అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత కాలంలో ప్రత్యేక, సమైక్య ఉద్యమాల ఊపు కారణంగా పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలోకి వెళ్లింది. దీంతో కార్పొరేట్ రంగం కుదేలై, పన్ను చెల్లింపులు గణనీయంగా తగ్గాయి. గడచిన ఐదేళ్లుగా సామాన్య, మధ్య తరగతి నుంచి పన్ను చెల్లింపుల శాతం పెరిగింది. రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వర్గం ఐటీ రిటర్న్‌లు మూడింతలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆన్లైన్ రిటర్న్‌ల సంఖ్య 20 లక్షలకు చేరింది. బ్యాంకుల రుణాల మంజూరుకు ఐటీ రిటర్న్‌లే ప్రామాణికం కావడంతో ప్రతి ఒక్కరూ దాఖలు చేస్తున్నారు. రూ. 10 లక్షల లోపు ఐటీ చెల్లింపులు మూడేళ్లుగా 125 శాతం పెరిగినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేదని తొలుత చెప్పినప్పటికీ, చివరలో తప్పనిసరి చేశారు. దాంతో ఈ ఏడాది ఆన్లైన్ రిటర్న్‌ల సంఖ్య 3.5 లక్షలు పెరిగింది. అయితే, ప్రధానంగా కార్పొరేట్ రంగం నుంచి వసూళ్లు తగ్గడంతో ఈ ఏడాది పన్ను టార్గెట్లు పూర్తికాలేదు. కొత్త పరిశ్రమల ఏర్పాటులో మందకొడితనం వల్ల ప్రతికూల ఫలితాలొచ్చాయి. 2012-13 సంవత్సరంలో పన్ను వసూళ్ళు రూ. 29 వేల కోట్లు. 2013-14లో రూ. 36 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.