న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద జమయ్యే డిపాజిట్లకు సంబంధించి పన్ను చెల్లింపులను స్వీకరించేందుకు నిరాకరించే శాఖల గుర్తింపు రద్దు చేస్తామంటూ బ్యాంకులకు కేంద్రం హెచ్చరించింది.
ఈ పన్నులను స్వీకరించేలా సాఫ్ట్‌వేర్/సిస్టమ్స్‌లో తగు మార్పులు చేసేలా శాఖ లను ఆదేశించాలంటూ బ్యాంకుల చీఫ్‌లకు ఆర్థిక శాఖ సూచించింది. డీమోనిటైజేషన్ దరిమిలా లెక్కల్లో చూపని నగదును పీఎంజీకేవై స్కీము కింద 50% పన్ను, పెనాల్టీ కట్టి ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.