PMGKY
-
AP: పీఎంజీకేఏవై బియ్యం పంపిణీకి కేంద్రం అనుమతి
సాక్షి, అమరావతి: పీఎంజీకేఏవై బియ్యం పంపిణీకి కేంద్రం అనుమతినిచ్చింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలకు అంగీకరించిన కేంద్రం.. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆగస్ట్ 1 నుంచి ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు ప్రభుత్వం బియ్యం పంపిణీ చేయనుంది. చదవండి: ఏపీ సర్కార్‌పై ఎల్లో మీడియా విషం.. పార్లమెంట్ సాక్షిగా వెల్లడైన వాస్తవాలు -
తెలంగాణ: డిసెంబరులో ఉచిత బియ్యం 5 కిలోలే.. రాష్ట్ర వాటా బందు!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా కష్ట కాలంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం ఇక యూనిట్ (లబ్ధిదారు)కు 5 కిలోల చొప్పున మాత్రమే పంపిణి జరగనుంది. కేంద్రం ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పీఎంజీకేవై) కింద ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ గడువు 2022 మార్చి వరకు పొడిగించి కోటా విడుదల చేసినప్పటికీ రాష్ట్ర కోటాపై నిర్ణయం జరగలేదు. ఇప్పటి వరకు పీఎంజీకేవై కింద కేంద్రం యూనిట్‌కు అయిదు కిలోలు మాత్రమే కోటా కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం మరో అయిదు కిలోలు కలిపి యూనిట్‌కు 10 కిలోల చొప్పున పంపిణీ చేస్తూ వచ్చింది. తాజాగా కేంద్రం ఉచితం బియ్యం గడువు పొడిగించినా.. రాష్ట్ర ప్రభుత్వ మాత్రం కేంద్రం కోటాకే పరిమితమైంది. ఈ నెలలో ఉచిత బియ్యం కోటాను 5 కిలోలకు పరిమితం చేస్తూ పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: Police Slapped Man Video: ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి) ఉచిత బియ్యం ఇలా.. ► కరోనా కష్టకాలంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు యూనిట్‌కు 12 కిలోల చొప్పున, ఆ తర్వాత జూలై నుంచి ఆగస్టు వరకు యూనిట్‌కు 10 కిలోల చొప్పున పంపిణీ చేశారు. ► సెకండ్ వేవ్ నేపథ్యంలో మొదటగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని భావించినా.. కరోనా సంక్షోభం వెంటాడుతుండటంతో నవంబరు వరకు గడువు పొడిగించారు. తాజాగా మరో నాలుగు నెలల వరకు పొడిగించారు. ► హైదరాబాద్ మహానగరంలో ఆహార భత్రద కార్డులు కలిగిన సుమారు 17.21 లక్షల కుటుంబాలున్నాయి. ఇందులో 59.55 లక్షల యూనిట్లు ఉన్నాయి. -
తక్కువ వ్యవధిలో ఫలితం ఇచ్చే ఇన్ఫ్రా ప్రాజెక్టులపై దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: తక్కువ వ్యవధిలో మంచి ఫలితాలను అందించే మౌలిక రంగం ప్రాజెక్టులపై తదుపరి దఫా ఉద్దీపనా చర్యలు దృష్టి సారించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గురువారం పేర్కొన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో రాజీవ్ కుమార్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... వివిధ ఆర్థిక వ్యవస్థలు అంచనావేసిన తీవ్ర స్థాయిలో (10 నుంచి 15 శాతం వరకూ క్షీణ అంచనాలు) భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణత ఉండదని భావిస్తున్నాను. నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) స్వల్ప వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి ద్రవ్యపరమైన ప్రత్యక్ష మద్దతు సాధ్యంకాదు. ప్రభుత్వం అందించే పలు ఉద్దీపన చర్యలు భారత్ ఆర్థిక వృద్ధి సత్వర సాధనకు దోహదపడతాయి. కరోనా కష్టాల్లో ఉన్న పేద ప్రజలను రక్షించడానికి మార్చిలో కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేపీ) పథకాన్ని ప్రకటించింది. తరువాత మేలో రూ.20.97 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని ప్రకటించింది. వారం క్రితం మూడవ ప్యాకేజీ ప్రకటించింది. దీనిప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరోనా సమయంలో విహార యాత్రలకు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి.. అందుకోసం ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) మొత్తాన్ని నగదుగా చెల్లించాలని నిర్ణయించింది. ఇది కాకుండా కేంద్రం వివిధ రంగాల మీద పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు రూ.12,000 కోట్లు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణాన్ని ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్యాకేజ్ విలువ దాదాపు రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా. మరో దఫా ఉద్దీపన ప్యాకేజ్ సంకేతాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇస్తున్నారు. మౌలిక రంగ ప్రాజెక్టులపై భారీ వ్యయాల ద్వారా వృద్ధికి తోడ్పాటును అందించవచ్చని పలు వర్గాలు కేంద్రానికి సలహాలను ఇస్తున్న నేపథ్యంలో రాజీవ్ కుమార్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
3 లక్షల జన్‌ధన్ ఖాతాల నుంచి డబ్బులు వెనక్కి
హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు లక్షలకుపైగా జన్‌ధన్ ఖాతాల్లో కేంద్ర సాయం కింద జమ చేసిన నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంక్(టీజీబీ) వెనక్కి తీసుకుంది. పొరపాటు వల్ల అనర్హుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావడంతో టీజీబీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మూడు లక్షలపైగా అకౌంట్ల నుంచి రూ. 16 కోట్ల నగదును తిరిగి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోనా లాక్డౌన్ వేళ పేద మహిళలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద కేంద్రం మూడు నెలల పాటు రూ. 500 చొప్పున సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టీజీబీ అధికారులు ఏప్రిల్ మొదటివారంలో జన్‌ధన్ అకౌంట్లలో మొదటి నెల నగదును జమ చేశారు. అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో 9 లక్షలకు పైగా జన్‌ధన్ ఖాతాలు ఉండగా.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాదాపు 5.5 లక్షల మంది మాత్రమే రూ. 500 సాయం పొందడానికి అర్హుత కలిగి ఉన్నాయి. ఆ తర్వాత తప్పిదాన్ని గుర్తించిన బ్యాంక్ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. దాదాపు మూడు లక్షలకు పైగా అకౌంట్ల నుంచి రూ. 16 కోట్లు వెనక్కి తీసుకున్నారు. అయితే ఇప్పటికే లక్ష మందికి పైగా అనర్హులు కూడా ఈ డబ్బును విత్ డ్రా చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేసేందుకు బ్యాంక్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ పొరపాటు ఎక్కడ జరిగిందనే దానిపై అంతర్గత విచారణ కూడా చేపట్టారు. ‘నిబంధనల ప్రకారం 2014 ఆగస్టు 1 తర్వాత తెరిచిన జన్‌ధన్ ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. కానీ పొరపాటు వల్ల అన్ని జీరో అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ అయ్యాయి. ఈ తప్పిదాన్ని గుర్తించి రూ. 16 కోట్లు వెనక్కి తీసుకున్నాం’ అని టీజీబీ జనరల్ మేనేజర్ మహేష్ తెలిపారు. చదవండి : అన్నపూర్ణ మన తెలంగాణ : కేసీఆర్ కేసుల్లో దాపరికం లేదు: ఈటల -
ఈపీఎఫ్ఓ నుంచి 15 రోజుల్లో రూ. 3,601 కోట్ల ఉపసంహరణ
న్యూఢిల్లీ: కరోనా అడ్వాన్సులను వేగవంతంగా పూర్తిచేస్తున్నట్లు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రకటించింది. దాదాపు 90 శాతం ముందస్తు చెల్లింపులను కేవలం మూడు రోజుల్లోనే పరిష్కరించినట్లు వివరించింది. కరోనా మహమ్మారి ప్రభావాన్ని అధిగమించడం కోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) ప్యాకేజీలో భాగంగా ఈపీఎఫ్ పథకం నుంచి ప్రత్యేక ఉపసంహరణకు ప్రభుత్వం వీలుకల్పించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో రూ. 3,601 కోట్ల ఉపసంహరణ జరిగిందని వివరణ ఇచ్చింది. -
కరోనా: వలంటీర్లకు రూ.50 లక్షల బీమా!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలంటీర్లకు రూ.50 లక్షల భీమా సదుపాయం కల్పించేందుకు సిద్ధమైంది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీ రాజ్ శాఖకు మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. గ్రామ, వార్డు వలంటీర్లకూ 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ' ప్యాకేజీ వర్తింపజేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల 60 వేల మంది వలంటీర్లకు పీఎంజీకే ప్యాకేజీ కింద రూ.50 లక్షల బీమా వర్తించనుంది. మూడు విడతల కొవిడ్-19 ఇంటింటి సర్వేలో పాల్గొన్న వలంటీర్లు పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయ్యే అవకాశమున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై వలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: గృహహింస: మహిళలకు అండగా ఏపీ ప్రభుత్వం) -
రూ.4900 కోట్ల బ్లాక్‌మనీ బహిర్గతం
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనం వెల్లడికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన 'ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన' (పీఎంజీకేవై) కింద భారీగా బ్లాక్‌మనీ బహిర్గతమైంది. ఈ స్కీమ్ కింద 21వేల మంది ప్రజలు రూ.4900 కోట్ల విలువైన బ్లాక్‌మనీని బయటికి వెల్లడించినట్టు ప్రభుత్వ అధికారులు గురువారం చెప్పారు. ఈ వెల్లడితో ఇప్పటి వరకు వీటిపై రూ.2451 కోట్ల పన్నులను కూడా వసూలు చేసినట్టు ఆదాయపు పన్ను అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. ఇవే తుది గణాంకాలుగా కూడా అధికారులు పేర్కొన్నారు. కొన్ని కేసుల్లో ఈ నగదు వెల్లడించిన వారిపై(డిక్లరెంట్లపై) న్యాయప్రక్రియను కూడా ఆదాయపు పన్ను శాఖ చేపట్టినట్టు వివరించారు. గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం ఈ స్కీమ్‌ను లాంచ్ చేసింది. 50 శాతం పన్ను, జరిమానాలను ఈ స్కీమ్ కింద బహిర్గతం చేసిన బ్లాక్‌మనీపై చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాక 25 శాతం బ్లాక్‌మనీని జీరో వడ్డీరేటుతో నాలుగేళ్ల పాటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సిందే. మార్చి 31తో ఈ పథకం ముగిసింది. పీఎంజీకేవై మాదిరిగానే మరిన్ని పథకాలను తీసుకురానున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ఐడీఎస్(ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్) తర్వాత పీఎంజీకేవైను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2016 జూన్ 1 నుంచి 2016 సెప్టెంబర్ 30 వరకు తెరచి ఉంచిన ఐడీఎస్ స్కీమ్ కింద రూ.67,382 కోట్ల బ్లాక్‌మనీ బయటికి వచ్చింది. -
నల్లకుబేరులకు మరో చాన్స్
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను ఎగవేతదారులకు కేంద్ర ప్రభుత్వం మరో చివరి అవకాశం కల్పించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం(పీఎంజీకేవై)లో భాగంగా ఆస్తుల వివరాలను ప్రకటించే గడువును మరోసారి పొడిగించింది. ప్రధాన్ మంత్రీ గరీబ్ కళ్యాణ యోజన (పిఎంజికెవై) కింద మే 10 వరకు పన్ను చెల్లింపులు, డిపాజిట్లపై నల్లధారుదారుల డిక్లరేషన్లు ప్రకటించాలని సీబీడీటీ శుక్రవారం తెలిపింది. మార్చి 31 లోపు సర్ఛార్జ్ మరియు పెనాల్టీ చెల్లించినవారు, ఏప్రిల్30 లోపు డిపాజిట్ పథకం కింద డిపాజిట్ చేసినవారికి ఈ డిక్లరేషన్‌కు అవకాశమని ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మార్చి 31తోముగిసిన ఈ గడువును మే 10 వరకు పొడిగించింది. 2016 ప్రధాన్ మంత్రీ గరీబ్ కళ్యాణ్ డిపాజిట్ పథకం కింద ఆన్లైన్ లో తమ ఆదాయ వివరాలను ప్రకటించాలని చెప్పింది. స్కాన్ చేసిన కాపీలు అప్లోడ్ చేసిన తరువాత ఆన్లైన్ దాఖలు చేయవచ్చని తెలపింది. ఆదాయ వెల్లడికి మార్చి 31, 2017తో ముగిసిన గడువును పెంచుతూ నల్లకుబేరులకు మరో చాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 50 శాతం పన్ను, జరిమానాతో ఈ గడువు లోపు ఆదాయాలను వెల్లడించాలి. పీఎంజీకేవై పథకం కింద పన్ను చెల్లించే నల్లధనం కుబేరులు 49.9శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 25 శాతం జీరో శాతం వడ్డీపై నాలుగు సంవత్సరాలు డిపాజిట్ చేయాలి. దీంతోపాటు గడువులోగా చెల్లించకపోతే 77.25శాతం జరిమానా చెల్లించాలి. ఆస్తుల వివరాలను వెల్లడించని వారికి భారీగా జరిమానా విధిస్తామని గతంలో స్వయంగా రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా హెచ్చరించారు. వివరాలను వెల్లడించిన వాళ్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ప్రకటించిన సంగతి తెలిసందే. -
వైద్యురాలికి పీఎంజీకేవై పథకం వర్తింపు
ఐటీశాఖకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) పథకం షరతుల్లో కొన్నింటిని సడలిస్తూ, దాన్ని ఉపయోగించుకునేందుకు ఓ వైద్యు రాలికిఅనుమతినివ్వాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులను హైకోర్టు ఆదే శించింది. పెద్దనోట్ల రద్దు సమయంలో మూడు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన రూ.11.18 కోట్ల సొమ్ములో పన్నులు, సెస్, జరిమానా తదితరాలుపోను మిగిలిన సొమ్మును పీఎంజీకెవైని ఉపయోగించుకునేందుకు ఆవైద్యురాలిని అనుమతించాలంది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. పీఎంజీకెవై ఉపయోగించుకునేందుకు అధికారులు విధించిన షరతుల్లో కొన్నింటి ని సవాలు చేస్తూ హైదరాబాద్ వైద్యురాలు ఇందిరాఅజయ్ వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ మేరకు స్పందించింది. -
నల్లధనానికి కౌంట్‌డౌన్ మొదలు!
⇒ బ్లాక్‌మనీ వెల్లడి స్కీమ్.. ‘పీఎంజీకేవై’కు ఇంకా వారం రోజులే గడువు ⇒ నల్ల కుబేరులకు ఐటీ శాఖ హెచ్చరికలు న్యూఢిల్లీ: నల్ల కుబేరులు ఈ నెలాఖరులోగా స్వచ్ఛందంగా తమ దగ్గరున్న బ్లాక్‌మనీ వివరాలు వెల్లడించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఆదాయ పన్ను(ఐటీ) శాఖ హెచ్చరించింది. అక్రమ డిపాజిట్ల గురించిన సమాచారం అంతా తమ దగ్గరుందని పేర్కొంది. అక్రమ సంపద గురించిన సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడి చేసేందుకు మార్చి 31తో ముగిసిపోనున్న ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) పథకాన్ని వినియోగించుకోవాలని నల్లకుబేరులకు సూచించింది. ఈ మేరకు ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలిచ్చింది. బ్లాక్‌మనీ హోల్డర్లపై చర్యలకు ‘కౌంట్‌డౌన్‘ మొదలైందని, ఇప్పుడైనా వివరాలు వెల్లడించని వారు తర్వాత బాధపడాల్సి వస్తుందని వాటిలో పేర్కొంది. ‘ఐటీ శాఖ వద్ద మీ డిపాజిట్ల పూర్తి సమాచారం ఉంది‘ అంటూ సాగే ఈ ప్రకటనలో.. అక్రమ సంపదను స్వచ్ఛందంగా వెల్లడించే వారి వివరాలు గోప్యంగా ఉంటాయని భరోసానిచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్లాక్‌మనీ వెల్లడి కోసం కేంద్రం పీఎంజీకేవై స్కీమ్‌ను గతేడాది డిసెంబర్ 17న ప్రవేశపెట్టింది. బినామీ చట్టం కింద కూడా చర్యలు.. సందర్భాన్ని బట్టి డిఫాల్టర్లపై బినామీ లావాదేవీల నిరోధక చట్టం కూడా ప్రయోగించే అవకాశం ఉందని ఐటీ అధికారి ఒకరు చెప్పారు. పీఎంజీకేవై కింద స్వచ్ఛందంగా వివరాలు వెల్లడించిన వారు సదరు ఆదాయంపై 49.9% పన్ను కడితే చాలన్నారు. ఒకవేళ పీఎంజీకేవైని ఎంచుకోకుండా ఆదాయ పన్ను రిటర్న్స్‌లో బ్లాక్‌మనీని చూపిన పక్షంలో పన్ను, దానికి అదనంగా 77.25% పెనాల్టీ కట్టాల్సి ఉంటుందన్నారు. ఇక ఏ విధంగానూ తమ అక్రమ ఆదాయాన్ని చూపించకుండా ఊరుకుని, ఆ తర్వాత స్క్రూటినీ అసెస్మెంట్లో పట్టుబడితే పన్నుకు తోడు జరిమానా 83.25% ఉంటుంది. ఒకవేళ తనిఖీల్లో పట్టుబడి, ఆ మొత్తాన్ని సరెండర్ చేస్తే పన్ను, పెనాల్టీలు 107.25% మేర ఉంటాయి. సోదాల్లో కూడా తమ అక్రమ సంపదను సరెండర్ చేయని వారు అత్యధికంగా పన్నుకు తోడు 137.25% పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని చెప్పారు.. దీనికి తోడుగా బినామీ చట్టం కూడా ప్రయోగిస్తే... ఏడేళ్ల దాకా కఠిన కారాగార శిక్ష , ఐటీ చట్టం కింద విచారణ, బినామీ ఆస్తుల మార్కెట్ రేటు ప్రకారం 25% దాకా పెనాల్టీతో పాటు ఇతరత్ర పెనాల్టీలు కూడా ఉంటాయి. -
పీఎంజీకేవై పన్ను వసూళ్లపై బ్యాంకులకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద జమయ్యే డిపాజిట్లకు సంబంధించి పన్ను చెల్లింపులను స్వీకరించేందుకు నిరాకరించే శాఖల గుర్తింపు రద్దు చేస్తామంటూ బ్యాంకులకు కేంద్రం హెచ్చరించింది. ఈ పన్నులను స్వీకరించేలా సాఫ్ట్వేర్/సిస్టమ్స్‌లో తగు మార్పులు చేసేలా శాఖ లను ఆదేశించాలంటూ బ్యాంకుల చీఫ్‌లకు ఆర్థిక శాఖ సూచించింది. డీమోనిటైజేషన్ దరిమిలా లెక్కల్లో చూపని నగదును పీఎంజీకేవై స్కీము కింద 50% పన్ను, పెనాల్టీ కట్టి ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
సహకార బ్యాంకులకు కేంద్రం షాక్!
గరీబ్ కల్యాణ్ యోజన డిపాజిట్ల స్వీకరణపై నిషేధం • కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో అవకతవకలపై ఐటీ నివేదిక నేపథ్యం న్యూఢిల్లీ: కొత్త పన్ను క్షమాభిక్ష పథకం– ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై), 2016 కింద సహకార బ్యాంకులు డిపాజిట్లను స్వీకరించరాదని కేంద్రం నిర్దేశించింది. ఈ మేరకు పథకం నోటిఫికేషన్‌ను సవరించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం కొన్ని సహకార బ్యాంకుల్లో అకౌంట్ల అవకతవకలను గుర్తించినట్లు ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లకు ఆదాయపు పన్ను శాఖ నివేదిక నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. పాత కరెన్సీల డిపాజిట్లు తీసుకోడానికి తొలుత సహకార బ్యాంకులకు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రకటన ఆరు రోజుల తరువాత, ఈ డిపాజిట్లను స్వీకరించడం నుంచి సహకార బ్యాంకులను కేంద్రం మినహాయించింది. అయితే అప్పటికే దాదాపు రూ.16,000 కోట్లు సహకార బ్యాంకుల్లోని పలు అకౌంట్లలో డిపాజిట్ అయినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖలు గుర్తించాయి. ఏమిటీ పథకం... రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తరువాత కేంద్రం పీఎంజీకేవై పథకాన్ని తీసుకువచ్చింది. నల్లకుబేరులకు సంబంధించి తాజాగా, చివరి అవకాశంగా కేంద్రం ఈ స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం పథకానికి దరఖాస్తు పెట్టుకునే ముందే ‘వెల్లడి మొత్తానికి’ సంబంధించిన మొత్తంలో మొదట 49.9 శాతం పన్ను చెల్లించాలి. దరఖాస్తులో ఇలా పన్ను చెల్లించినట్లు ఆధారం ఉండాలి. అలాగే ఈ దరఖాస్తుకు ముందే ‘వెల్లడి మొత్తం’లో 25 శాతాన్ని వడ్డీరహిత రీతిలో నాలుగేళ్ల కాలానికి ‘లాక్–ఇన్’ విధానంలో డిపాజిట్ చేయాలి. కట్టిన పన్నును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వడం జరగదు. అవినీతి, బినామీ ఆస్తుల నిర్వహణ, అక్రమ ధనార్జన, విదేశీ మారకద్రవ్య నిల్వల ఉల్లంఘనలు, ఫారిన్ బ్లాక్ మనీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ పథకం వర్తించదు. డిసెంబర్ 17న ప్రారంభమైన ఈ పథకం డిక్లరేషన్లు, డిపాజిట్ల నిమిత్తం 2017 మార్చి 31 వరకూ అందుబాటులో ఉంటుంది. బ్యాంకుల్లో తప్ప సహకార బ్యాంకులను ఈ డిపాజిట్ల సేకరణ నుంచి నిషేధించినట్లు తాజాగా కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకూ రూ.300 కోట్ల డిక్లరేషన్లు! ఇదిలావుండగా, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా రూ.300 కోట్ల విలువైన డిక్లరేషన్లు వచ్చినట్లు ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే డిక్లరేషన్ల విలువ తెలియనప్పటికీ, మహారాష్ట్రలోని 16 నగరాలకు చెందిన దాదాపు 36 మంది ఆభరణ వర్తకులు దాదాపు రూ.140 కోట్ల విలువైన డిక్లరేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారుల దాడుల అనంతరం కూడా పలువురు ఈ డిక్లరేషన్లు ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ ఆభరణాల సంస్థ కూడా దాదాపు రూ.100 కోట్ల డిక్లరేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ రాష్ట్రానికి చెందిన ఒక వైద్యుడు కూడా రూ.11.50 కోట్లకు సంబంధించి డిక్లరేషన్‌కు ఆదాయపు పన్ను అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఒక చిత్ర దర్శకుడు రూ.40 కోట్ల డిక్లరేషన్‌తో ముందుకు వచ్చినట్లు సమాచారం. -
కోపరేటివ్ బ్యాంకులు ఆ డిపాజిట్లు స్వీకరించవు
న్యూఢిల్లీ : రద్దయిన నోట్ల డిపాజిట్‌కు గడువు ముగిసినప్పటికీ నల్లధనం వివరాల వెల్లడికి మరో అవకాశమిస్తూ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద పాత నోట్లను డిపాజిట్ల చేసుకోవచ్చని కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు ఈ నోట్లను ఏ బ్యాంకుల్లోనైనా నల్లకుబేరులు డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఈ అనుమతి ఇప్పటినుంచి సహకార బ్యాంకుల్లో వర్తించదు. పీఎంజీకేవై కింద పాత నోట్లను కోపరేటివ్(సహకార) బ్యాంకులు స్వీకరించవని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. దీనికి గల ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు అనంతరం కోపరేటివ్ బ్యాంకుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ గుర్తించడమే. కొన్ని సహకార బ్యాంకుల అకౌంట్లలో తీవ్రమైన వైరుధ్యాలు, అవకతవకలు కనిపించినట్టు ఐటీ డిపార్ట్మెంట్ ఆర్బీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో పీఎంజీకేవై కింద స్వీకరించే డిపాజిట్లను కోపరేటివ్ బ్యాంకులు స్వీకరించవని ప్రభుత్వం తెలిపింది. పీఎంజీకేవై కింద డిపాజిట్ చేసే నగదుపై 50 శాతం పన్నును అకౌంట్ హోల్డర్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ నగదులో25 శాతం మొత్తాన్ని సదరు ఖాతాదారు నాలుగేళ్ల వరకూ వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. అయితే ఈ స్కీమ్‌ను కూడా వాడుకోకుండా తమంతట తాముగా మొత్తాన్ని వెల్లడించని వ్యక్తులపై మాత్రం కఠినంగా వ్యవహరించడం తథ్యమని కేంద్రం హెచ్చరించింది. -
ఐటీ వేట మొదలైంది!
నోట్లరద్దు తర్వాతి డిపాజిట్లపై ప్రత్యేక దృష్టి పీఎంజీకేవై ముగిశాక ఎవరినీ వదలం ఆదాయపన్ను శాఖ కమిషన్ ఏకే చౌహాన్ హెచ్చరిక న్యూఢిల్లీ: నోట్లరద్దు నిర్ణయం అమల్లోకి వచ్చాక బ్యాంకు అకౌంట్లలోకి వెల్లువెత్తిన నల్లధనంపై ఆదాయపన్ను శాఖ దృష్టిపెట్టింది. పరిమితికి మించి అనుమానాస్పదంగా డబ్బుల లావాదేవీలు జరిగిన అకౌంట్లను పరిశీలిస్తోంది. ఢిల్లీలో వ్యాపార సంస్థలు, చార్టెడ్ అకౌంటెంట్లు, నిపుణులతో సమావేశమైన ఐటీ శాఖ కమిషనర్ ఏకే చౌహాన్.. దీనిపై వివరణ ఇచ్చారు. ఇప్పటికే పలు అకౌంట్లలోకి లెక్కలో చూపని ధనాన్ని వేసిన వారు.. ప్రధాన మంత్రి గ్రామీణ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద పన్ను చెల్లించాలన్నారు. లేకుంటే గడువు ముగిశాక విచారణలో బయటపడ్డ నల్లధన కుబేరులకు కఠిన పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. ‘బ్యాంకు అకౌంట్లను, డిపాజిట్లను పరిశీలిస్తున్నాం. అందుకే పీఎంజీకేవై పథకాన్ని వినియోగించుకోవాలనుకునేవారు నిశ్చింతగా ఉండొద్దని చెబుతున్నా. ఆర్థిక ఇంటెలిజెన్స్ యూనిట్, ఇతర సంస్థలిచ్చే వివరాలను విశ్లేషిస్తున్నాం. అంతకుముందే పీఎంజీకేవై పథకం ప్రకారం పన్ను చెల్లించండి. ఒకసారి పథకం గడువు ముగిస్తే.. ఎగవేతదారులకు కష్టాలు తప్పవు’ అని చౌహాన్ హెచ్చరించారు. పీఎంజీకేవై అనేది ‘ఆదాయ వెల్లడి పథకం పార్ట్ –2’ అనుకోవద్దని.. దీని ఉద్దేశాలు పూర్తిగా వేరని స్పష్టం చేశారు. నల్లధనం నుంచి బయటకు వచ్చేందుకు ఇదే చివరి అవకాశమన్నారు. -
నల్లధనం వెల్లడికి ఇదే చివరి అవకాశం